ఏంజెల్ బ్రోకింగ్ వద్ద ఉత్తమ డీమాట్ అకౌంట్ ఉందా?
ఏంజెల్ బ్రోకింగ్ అనేది ఆర్ధిక పరిశ్రమలో వాసికెక్కిన పేరు. ఏంజెల్ బ్రోకింగ్ ఏంజెల్ ఐ అనేది ఒక అధునాతన ట్రేడింగ్ వేదిక, ఇది బిఎస్ఇ, ఎన్ఎస్ఇ, ఎంసిఎక్స్ మరియు ఎన్‌సిడిఇఎక్స్ వంటి స్టాక్ ఎక్స్ఛేంజీ లకు ఒకే చోట ప్రాప్తి ని అందిస్తుంది. మీరు ఫోన్, ఇమెయిల్ మరియు ఎస్ఎమ్ఎస్ ద్వారా ఎప్పుడైనా ట్రేడ్ చేయవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ నిపుణుల నుండి వివరణాత్మక నివేదికలను కూడా అందిస్తుంది. ఏంజెల్ ఐ అనేది పోర్ట్‌ఫోలియోలను ఒకే వీక్షణంలో నిర్వహించడానికి, సమర్ధవంతంగా ట్రేడ్ చేయడానికి, నిజ-సమయ స్టాక్ నవీకరణలను ట్రాక్ చేయడానికి మరియు అవసరమైనప్పుడు నివేదికలను తిరిగి పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఏంజెల్ బ్రోకింగ్ తో ఆన్‌లైన్ లో డీమాట్ అకౌంట్ ను ఎలా తెరవగలను?
మీరు మొదట రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి) ను సంప్రదించాలి. అకౌంట్ ప్రారంభించే ఫారమ్ ను డిపి వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా శాఖా కార్యాలయం నుండి సేకరించవచ్చు. కెవైసి (మీ కస్టమర్ ని తెలుసుకోండి) నిబంధనలను నెరవేర్చిన పత్రాలను సమర్పించాలి. వీటిలో పాన్ కార్డు యొక్క నకలు, చిరునామా రుజువు, గత మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, ఆదాయపు పన్ను రిటర్న్స్, ఫోటోలు మరియు క్రాస్ చేయబడ్డ చెక్ ఉంటాయి. అకౌంట్ తెరిచే ఫారమ్ లో అందించిన వివరాలను నిర్ధారించడానికి వ్యక్తిగత ఫోన్ ధృవీకరణ జరుగుతుంది. దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత, మీకు ఇంటర్నెట్ పాస్‌వర్డ్ మరియు లావాదేవీ పాస్‌వర్డ్ అందించబడతాయి. అప్పుడు మీరు సెక్యూరిటీలను బదిలీ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.
ఏంజెల్ బ్రోకింగ్‌తో డీమాట్ అకౌంట్ తెరవడానికి ఏ పత్రాలు అవసరం?
ఏంజెల్ బ్రోకింగ్ తో డీమాట్ అకౌంట్ ను తెరవడానికి, మీరు ఏంజెల్ బ్రోకింగ్ వెబ్‌సైట్ లో లేదా శాఖా కార్యాలయంలో అందుబాటులో ఉన్న అకౌంట్ తెరిచే ఫారమ్‌ను సరిగ్గా నింపి సమర్పించాలి. ఫారమ్ తో పాటు, సమర్పించాల్సిన ఇతర పత్రాలు గుర్తింపు రుజువు, చిరునామా రుజువు మరియు ఇటీవలి పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోలు. ధృవీకరణ ప్రయోజనం కోసం అసలు పత్రాలను తీసుకెళ్లాలి. గుర్తింపు రుజువుగా, ఈ పత్రాల్లో దేనినైనా సమర్పించవచ్చు-ఓటరు ఐడి, పాన్ కార్డు, నివాస విద్యుత్ బిల్లు, నివాస టెలిఫోన్ బిల్లు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. దరఖాస్తుదారు నివాస చిరునామా ఉన్న ఏదైనా పత్రాన్ని చిరునామా రుజువుగా సమర్పించవచ్చు. -బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ఓటరు ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. దరఖాస్తు ధృవీకరించబడిన తర్వాత, మీరు మీ లాగిన్ వివరాలను అందుకుంటారు. మీరు మీ హోల్డింగ్లను తనిఖీ చేయడానికి మీ డీమాట్ అకౌంట్ లోకి లాగిన్ అవవచ్చు.
నేను నా పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే, నేను ఏమి చేయాలి?
మీరు మీ పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే, చింతించవలసిన అవసరం లేదు. మీరు సైట్ ద్వారా లాగిన్ ఫారమ్ లో అందుబాటులో ఉన్న మా “పాస్‌వర్డ్ మర్చిపోయారు ఎంపికను” ఉపయోగించి ఒక కొత్త పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మీ యూజర్ కోడ్ మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు మీ పాస్‌వర్డ్ పునరేర్పాటు చేసుకోవచ్చు. మీరు 18602002006/18605005006 నంబర్ పై ఏంజెల్ బ్రోకింగ్ ను కూడా సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, ebroking@angelbroking.com వద్ద మీ ప్రశ్నతో ఒక ఇమెయిల్ పంపండి, మరియు మీరు మీ పాస్‌వర్డ్ ఎలా పునరేర్పాటు చేయాలి అనేదాని గురించి మార్గదర్శకత్వం అందుకుంటారు.
ఏంజెల్ బ్రోకింగ్ తో అకౌంట్ తెరవడానికి నాకు ఇమెయిల్ అడ్రస్ అవసరమా?
అవును, డీమాట్ అకౌంట్ తెరవడానికి మీకు ఇమెయిల్ ఐడి అవసరం. ఇమెయిల్ ఐడి కలిగి ఉండటం అదనపు ప్రయోజనం ఎందుకంటే మీరు మీ ఐడి లో లావాదేవీ వివరాలు మరియు స్టేట్‌మెంట్ లను పొందవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ మీ ట్రేడింగ్/డిమాట్ అకౌంట్ ద్వారా చేసిన లావాదేవీల హెచ్చరికలు/సమాచారాన్ని పంపుతుంది. అలాంటి సమాచారం రోజు చివరిలో పంపబడుతుంది. అందువల్ల, మీరు తాజా లావాదేవీ వివరాల గురించి నవీకరించబడతారు. ఇది మీ ట్రేడింగ్/డిమాట్ అకౌంట్ నుండి అనధికార లావాదేవీలను నిరోధించడంలో సహాయపడుతుంది. కెవైసి (మీ కస్టమర్ ని తెలుసుకోండి) నిబంధనలను నెరవేర్చడంలో ఇమెయిల్ ఐడిని అందించడం కూడా పాత్ర పోషిస్తుంది. అందువల్ల, మీరు వేరే మధ్యవర్తిని సంప్రదించినప్పుడు మీరు మళ్ళీ అదే ప్రక్రియ ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు.
నా యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఎంత సురక్షితం?
మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ పూర్తిగా సురక్షితం. విశ్వసనీయమైన సమాచారాన్ని కలిగి ఉన్నందున ఏంజెల్ బ్రోకింగ్ మీ ఉప బ్రోకర్‌కు స్వాగత కిట్‌ను అందించదు. స్వాగత కిట్ క్లయింట్ కు తప్ప మరెవరికీ ఇవ్వబడదు. భద్రతా కారణాల దృష్ట్యా, మీరు మీ స్వాగత కిట్‌ను స్వీకరించిన వెంటనే మీ పాస్‌వర్డ్ ను మార్చడం మంచిది. మీరు మీ స్వాగత కిట్‌ను స్వీకరించిన తర్వాత, వివరాలను ఉపయోగించి మీ అకౌంట్ కు లాగిన్ అవ్వండి మరియు మీరు ట్రేడింగ్ ప్రారంభించే ముందు పాస్‌వర్డ్ ను మార్చండి. స్వాగత కిట్ ను ఎవరైనా తెరవడానికి ప్రయత్నించినట్లుగా ఉన్నట్టు మీకు అనిపిస్తే, వీలైనంత త్వరగా ఏంజెల్ బ్రోకింగ్‌కు తెలియజేయండి.
నా ఆన్‌లైన్ డీమాట్ అకౌంట్ ను ఎలా నిర్వహించాలి?
డీమాట్ అకౌంట్ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత, అకౌంట్ హోల్డర్ క్లయింట్ ఐడి మరియు పాస్‌వర్డ్ ను అందుకుంటారు. అతను ఈ వివరాలతో తన అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. అలాంటి అకౌంట్ ను కనీస షేర్ ల అవసరం లేకుండా తెరవవచ్చు. ఒక పెట్టుబడిదారుడు షేర్ లను కొనాలనుకుంటే, ఆన్‌లైన్ లో డీమాట్ అకౌంట్ ద్వారా ఆర్డర్ పంపాలి. అప్పుడు బ్రోకర్ షేర్ లను అకౌంట్ లో జమ చేస్తాడు. పెట్టుబడిదారుడు షేర్ లను అమ్మాలనుకుంటే, అతను స్టాక్ వివరాలను అందించే డెలివరీ సూచన సందేశం ఇవ్వాలి. ఆర్డర్ ప్రక్రియ చేయబడిన తర్వాత, షేర్ లు అకౌంట్ నుండి డెబిట్ చేయబడతాయి మరియు అమ్మిన షేర్ ల మొత్తం చెల్లించబడుతుంది.
ఒక డీమాట్ అకౌంట్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
డిమాట్ అకౌంట్ ను కలిగి ఉన్న ప్రధాన లక్ష్యం భౌతిక రూపానికి బదులుగా సెక్యూరిటీ లను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచడం. ఇది ఫోర్జరీ, దొంగతనం మరియు షేర్ ధృవీకరణ పత్రాల తారుమారు చేసే ప్రమాదాన్ని తొలగించే అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు కాగితపు పని మరియు ఎక్కువ ఆలస్యం లేకుండా షేర్ లను కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు మరియు లావాదేవీలు చేయవచ్చు. డిమెటీరియలైజేషన్ అనేది ఇంటర్నెట్ ద్వారా సెక్యూరిటీలను లావాదేవీల యొక్క భద్రమైన మరియు సురక్షితమైన పద్ధతి. ఇది బదిలీ ఫారమ్‌లను నింపడం, విముక్తి అభ్యర్థనలను పంపడం మొదలైనవాటిని తొలగిస్తుంది. మీరు మీ మౌస్ క్లిక్ తో మరియు మీ స్వంత సౌలభ్యం మేరకు లావాదేవీలు చేయవచ్చు.
డీమాట్ ఖాతా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలు ఏవి?
డీమాట్ అకౌంట్ యొక్క ప్రధాన లక్షణం సెక్యూరిటీ లను ఎలక్ట్రానిక్ రూపంలో (డీమెటీరియలైజ్డ్ రూపంలో) ఉంచడం. డీమాట్ అకౌంట్ ఎలక్ట్రానిక్ ఆకృతిలో సెక్యూరిటీలను కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్ కు సమానంగా ఉంటుంది. అందువల్ల, ధృవీకరణ పత్రాలు లేదా దొంగతనాల భౌతిక నష్టం గురించి భయం లేదు. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన అన్ని పెట్టుబడులను ఒకే అకౌంట్ లో ఏకీకృతం చేయడానికి డీమాట్ అకౌంట్ లు మిమ్మల్ని అనుమతిస్తాయి. వారు తమ పెట్టుబడులను ఒకే ఛానల్ (డిపి) ద్వారా నిర్వహించవచ్చు. ఇది మీ పెట్టుబడులను ట్రాక్ చేయడానికి మరియు నిర్వహించడానికి వివిధ కంపెనీలు మరియు సంస్థలతో సంప్రదించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
నేను ఇప్పటికే మరొక డిపాజిటరీ పార్టిసిపెంట్ తో డీమాట్ అకౌంట్ కలిగి ఉంటే? నేను ఏంజెల్ బ్రోకింగ్ డీమాట్ అకౌంట్ కు షేర్ లను ఎలా బదిలీ చేయగలను?
మీరు ఇప్పటికే ఒక నిర్దిష్ట డిపాజిటరీతో డీమాట్ అకౌంట్ ను కలిగి ఉంటే మరియు మరొకదానికి మార్చాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు. మీరు డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డిఐఎస్) పుస్తకాన్ని నింపి మీ బ్రోకర్‌కు సమర్పించాలి. మీ సెక్యూరిటీల సమాచారం, ఐఎస్ఐఎన్ నంబర్ మరియు కొత్త డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడి వంటి సంబంధిత వివరాలను పూరించండి (భద్రత కోసం కేటాయించిన ప్రత్యేకమైన 12 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఐఎస్ఐఎన్ నంబర్). మీ బ్రోకర్ మీ అభ్యర్థనను డిపి కి పంపుతాడు. డిపి అప్పుడు మీ కొత్త డీమాట్ అకౌంట్ కు షేర్ లను బదిలీ చేస్తుంది. డిఐఎస్ ఫారమ్ సరిగ్గా నింపబడితే, బదిలీ 24 గంటలలోపు లేదా తదుపరి వ్యాపార రోజులో జరుగుతుంది. డీమాట్ అకౌంట్ బదిలీ కోసం బ్రోకర్లు ఛార్జీలు వసూలు చేస్తారు. ఛార్జీలు బ్రోకర్ నుండి బ్రోకర్ కు భిన్నంగా ఉంటాయి.
ఇతర డిపి తో డీమాట్ అకౌంట్ ను ఎలా మూసివేయాలి?
మీరు మీ డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో మీ డీమాట్ అకౌంట్ ను మూసివేసే ముందు, దయచేసి ఈ క్రింది వాటిని నిర్ధారించుకోండి:
- మీ ప్రస్తుత షేర్ లు మరియు సెక్యూరిటీలన్నీ మీ ఏంజెల్ బ్రోకింగ్ డీమాట్ అకౌంట్ కు బదిలీ చేయబడ్డాయి
- మీ ప్రతికూల నగదు మిగులులు (ఎఎమ్ సి చెల్లించకపోవడం లేదా బదిలీ ఛార్జీలు కారణంగా ఉత్పన్నమయ్యే) డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో పరిష్కరించబడ్డాయి.
మీ ప్రస్తుత డీమాట్ అకౌంట్ ను మూసివేయడానికి, మీరు మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ యొక్క వెబ్‌సైట్ లో కనుగొనగలిగే అకౌంట్ మూసివేత ఫారమ్‌ను సరిగ్గా నింపి సమర్పించాలి. మీరు అవసరమైన అన్ని పద్దతులను పూర్తి చేసిన తర్వాత అకౌంట్ ను మూసివేయడానికి సాధారణంగా 7 నుండి 10 వ్యాపార దినాలు పడుతుంది.
ఎన్‌ఎస్‌డిఎల్ మరియు సిడిఎస్ఎల్ లో మీ కార్పొరేట్ డీమాట్ అకౌంట్ పేరును ఎలా మార్చాలి?
సమ్మేళనం/అమరిక పథకం విషయంలో మీరు మీ కార్పొరేట్ డీమాట్ అకౌంట్ పేరును మార్చలేరు. అన్ని ఇతర సందర్భాల్లో, మీరు ఈ క్రింది విధానాన్ని అనుసరించవచ్చు:
ఎన్‌ఎస్‌డిఎల్ తో పేరు మార్చే విధానం:
మీ కంపెనీ/సంస్థ కంపెనీ యాక్ట్, 1956 కింద నమోదు చేయబడితే, కింది పత్రాలను మీ డిపి ద్వారా ఎన్‌ఎస్‌డిఎల్ కు పంపాలి:
- మీ కంపెనీ యొక్క అధీకృత సంతకందారులు సంతకం చేసిన పేరు మార్పు అభ్యర్థన కోసం లేఖ
- కంపెనీ ల రిజిస్ట్రార్ జారీ చేసిన పేరు మార్చబడిన తరువాత నవీకరించిన/తాజా వ్యవస్థాపన ధృవీకరణ పత్రం (ధృవీకరించబడిన నిజమైన నకలును సమర్పించండి)
- పేరు మార్పు ఆమోదం కోసం బోర్డు తీర్మానం (ధృవీకరించబడిన నిజమైన నకలును సమర్పించండి)
- నమూనా సంతకం (లు) మరియు కంపెనీ ముద్రతో పాటు కంపెనీ యొక్క కొత్త లెటర్‌హెడ్ లో (నవీకరించబడిన పేరుతో) అధీకృత సంతకం (లు) జాబితాను కలిగి ఉన్న పత్రం.
అన్ని ఇతర కార్పొరేట్ సంస్థల కోసం, కింది పత్రాలను మీ డిపి ద్వారా ఎన్‌ఎస్‌డిఎల్‌కు పంపాలి:
- మీ సంస్థ యొక్క అధీకృత సంతకందారులు సంతకం చేసిన పేరు మార్పు అభ్యర్థన కోసం లేఖ
- పేరు మార్పు ఆమోదం కోసం బోర్డు తీర్మానం (ధృవీకరించబడిన నిజమైన నకలును సమర్పించండి)
- నమూనా సంతకం (లు) మరియు కంపెనీ ముద్రతో పాటు కంపెనీ యొక్క కొత్త లెటర్‌హెడ్ లో (నవీకరించబడిన పేరుతో) అధీకృత సంతకం (లు) జాబితాను కలిగి ఉన్న పత్రం.
- ఎస్ఇబిఐ/సంబంధిత చట్టబద్దమైన అధికారుల ద్వారా జారీ చేయబడిన వర్తించే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
సిడిఎస్ఎల్ తో పేరు మార్పు కోసం విధానం:
ఒకవేళ ఎస్ఇబిఐ రిజిస్ట్రేషన్ సంఖ్య/సిఎమ్ఐడి/ట్రేడింగ్ ఐడి ఒక సిఎమ్ పరిష్కార సంబంధిత అకౌంట్ల కోసం మార్పు చేయబడితే, ఒక కొత్త అకౌంట్ తెరవవలసి ఉంటుంది. పేరు మార్పు ఇప్పటికే ఉన్న అకౌంట్ లో నిర్వహించబడకూడదు.
అయితే, ఇతర కార్పొరేట్లు, ఎఫ్ఐఐ లు మరియు సిఎమ్ లు పేరును సిడిఎస్ఎల్ ద్వారా సవరించవచ్చు. ఈ క్రింది పత్రాలను సిడిఎస్ఎల్ కు మీ డిపి ద్వారా పంపవలసి ఉంటుంది:
- కార్పరేట్, ఎఫ్ఐఐ, లేదా సిఎమ్ యొక్క అధీకృత సంతకందారులు సంతకం చేసిన పేరు మార్పు అభ్యర్థన కోసం లేఖ
- పేరు మార్పు ఆమోదం కోసం బోర్డు తీర్మానం (ధృవీకరించబడిన నిజమైన కాపీని సమర్పించండి)
- కంపెనీల రిజిస్ట్రార్ జారీ చేసిన పేరు మార్చబడిన తరువాత నవీకరించిన/తాజా వ్యవస్థాపన ధృవీకరణ పత్రం (ధృవీకరించబడిన నిజమైన కాపీని సమర్పించండి)
లేదా
- ఎఫ్‌ఐఐలు మరియు సిఎమ్ ల విషయంలో, ఎస్ఇబిఐ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ధృవీకరించబడిన నిజమైన నకలును సమర్పించండి)
- కంపెనీ సెక్రటరీ/మేనేజింగ్ డైరెక్టర్ చేత ధృవీకరించబడిన నమూనా సంతకం (ల) తో పాటు అధీకృత సంతకందారు/ల జాబితాను కలిగి ఉన్న పత్రం
- సిఎమ్ విషయంలో, సిఎమ్ సభ్యుడిగా ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి పేరు మార్పును అంగీకరించే లేఖ కాపీ
ఏంజెల్ బ్రోకింగ్‌తో నేను డీమాట్ ఖాతాను ఎందుకు తెరవాలి?
ఏంజెల్ బ్రోకింగ్ యొక్క సాంకేతిక-క్రియాశీల డీమాట్ అకౌంట్ భారతీయ మార్కెట్లో ఉత్తమమైన డీమాట్ అకౌంట్ లలో ఒకటి. డీమాట్ అకౌంట్ ల ద్వారా, మీరు బ్రోకర్ లేకుండా ఆన్‌లైన్ లావాదేవీలను మీ స్వంతంగా చేసుకోవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్‌తో డీమాట్ అకౌంట్ ను కలిగి ఉండటం దొంగతనం, నష్టం, ఫోర్జరీ వంటి భౌతిక షేర్/స్టాక్ ధృవీకరణ పత్రాలతో సంబంధం ఉన్న నష్టాలను తొలగించడానికి సహాయపడుతుంది. షేర్ లను ట్రాక్ చేయడానికి డీమెటీరియలైజేషన్ ఒక సురక్షితమైన మరియు అనుకూలమైన మార్గం. మ్యూచువల్ ఫండ్స్, ఇటిఎఫ్, కమోడిటీస్ మరియు ఇతర విలువైన ఆర్థిక సాధనాలను కలిగి ఉండటానికి కూడా డీమాట్ అకౌంట్ అనుమతిస్తుంది. లావాదేవీలు స్మార్ట్ ఫోన్‌లు లేదా వెబ్ ద్వారా చేయవచ్చు. ఏంజెల్ స్విఫ్ట్ అనేది స్మార్ట్ ఫోన్‌లు మరియు టాబ్లెట్ ల కోసం ఒక ట్రేడింగ్ అప్లికేషన్, ఇది ట్రేడ్ ని అందించేటప్పుడు మీ హోల్డింగ్ యొక్క అవలోకనాన్ని ఇస్తుంది.