ఆయిల్ ఫ్యూచర్స్ మరియు వాటిలో ఎలా ట్రేడ్ చేయాలి
క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచ ఆర్థిక ఇంజన్ ను పెరుగుతూ ఉంచేది. ఇది లక్షల సంవత్సరాల క్రితం భూమిలో పూడ్చబడిన సేంద్రీయ పదార్ధం కుళ్ళడం కారణంగా ఏర్పడుతుంది, దీనిని ఒక ఫాసిల్ ఇంధనం అని పిలుస్తారు. మధ్య-19వ శతాబ్దం వరకు, పెట్రోలియం కనుగొనబడే వరకు, ఫాసిల్ ఇంధనం యొక్క ఏకైక వనరు కోల్ గా ఉండేది. నేడు, దాదాపుగా 40 శాతం ఫాజిల్ శక్తిని కలిగి, పెట్రోలియం అనేది ప్రపంచంలో అతిపెద్ద శక్తి వనరుగా ఉంది. ఫాసిల్ ఇంధనం తగలబెట్టడం గ్లోబల్ వార్మింగ్ కు దోహదపడినప్పటికీ, అది మన శక్తి యొక్క ప్రాథమిక వనరుగా ఉండటం కొనసాగుతుంది. ఎంతగానంటే దాని ప్రాముఖ్యత ఆయిల్ ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ పెంచడాన్ని కొనసాగిస్తుంది.
క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మరియు ధరలు
క్రూడ్ ఆయిల్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారులు ఎవరంటే పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఓపెక్) గా రూపొందిన దేశాలు, వీరి సభ్యుల్లో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైత్ మరియు వెనిజులా ఉంటాయి. అయితే, ఫ్రాకింగ్ టెక్నాలజీ యుఎస్ఎ ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారుగా చేయడానికి వీలు కల్పించింది, ఇది ఒక నిర్దిష్ట పరిధి వరకు ఓపెక్ ప్రభావాన్ని తగ్గించింది. రష్యా, చైనా మరియు కెనడా వంటి ఇతర పెద్ద ఉత్పత్తిదారులు కూడా ఉన్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి మరియు చాలా అస్థిరమైనవి. అయితే, ప్రధాన కారకాలు సరఫరా మరియు డిమాండ్. ఓపెక్ అనేది ఒక ఆయిల్ కార్టెల్ మరియు ఆయిల్ ధరలు ఎలా ప్రవర్తిస్తాయి అనేదానికి అనుగుణంగా ఉత్పత్తి మార్పు చేస్తుంది. ఉదాహరణకు, ధరలు చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఉత్పత్తిని అది కట్ చేయవచ్చు. పెట్రోలియం ఎగుమతుల్లో 60 శాతం వరకు అది లెక్కకి వస్తుంది కాబట్టి, ఆయిల్ ధరలపై ఓపెక్ ఒక ముఖ్యమైన ప్రభావాన్ని కలిగి ఉంది, మరియు భవిష్యత్తులో ధర పోకడలను తెలుసుకోవడానికి ఆయిల్ నిపుణులు ఓపెక్ సమావేశాలను దగ్గరగా గమనిస్తారు.
డిమాండ్ వైపున, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, చైనా మరియు భారతదేశం వంటి పెద్ద ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఆర్థిక మందగింపు ఉంటే, క్రూడ్ ఆయిల్ కోసం డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ రెండు దేశాలు క్రూడ్ ఆయిల్ యొక్క అతిపెద్ద వినియోగదారులు, రోజుకు 101 మిలియన్లకు పైగా బ్యారెల్స్ ఉండే ప్రపంచ మొత్తంలో సగం వినియోగాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రెండు దేశాలలో డిమాండ్లో ఏమాత్రం మందగింపు అయినా ఆయిల్ ధరలు లోతుగా పడిపోవడానికి దారితీస్తుంది. కొత్త ఆయిల్ రిజర్వ్స్ కనుగొనబడడాలు అదే ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు, సరఫరాను పెంచడం మరియు ఖర్చులు తగ్గిస్తూ ఉండటం.
ఇటీవలి సంవత్సరాల్లో, వాతావరణ సంక్షోభం మరియు గ్లోబల్ వార్మింగ్ కారణంగా క్రూడ్ ఆయిల్ నుండి దూరంగా శక్తి యొక్క శుభ్రమైన వనరులకు ఒక మళ్ళింపు ఉంది. అయితే, వాటి మధ్య ప్రపంచ శక్తి వినియోగంలో క్రూడ్ ఆయిల్ మరియు సహజ గ్యాస్ 50 శాతం, బొగ్గు మరొక 30 శాతం మరియు పునరుత్పాదక శక్తి 10 శాతం కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ దాని ఘనమైనది అయినా కానీ మురికి సింహాసనం నుండి తొలగించబడటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.
క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్
ధర అస్థిరతకు వ్యతిరేకంగా నివారణ కోసం ఈ ఫ్యూచర్స్ ను దేశాలు మరియు పెద్ద కార్పొరేషన్లు విస్తృతంగా ఉపయోగించడం జరిగింది. ధరలు ఎలా కదులుతాయని ఆశించబడుతోంది అనేదాని ఆధారంగా వీటి ధరలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఆయిల్ ధరలు భవిష్యత్తులో పెరుగుతాయని భావిస్తే, ఇవి స్పాట్ మార్కెట్ల కంటే ఎక్కువగా ధర కలిగి ఉంటాయి. అదేవిధంగా, ఆయిల్ ధరలు తగ్గవచ్చని ప్రజలు భావిస్తే, ఫ్యూచర్స్ ధరలు స్పాట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి.
పెద్ద పరిమాణాల ప్రమేయం ఉన్నందున ఈ ఫ్యూచర్స్ చాలా అవసరం. చాలా దేశాలు ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆయిల్ ధరలు పెరిగితే, వారు గణనీయమైన మొత్తాలను చెల్లించవలసి ఉంటుంది, ఇది వారి ఫైనాన్సెస్ పై ఒక ఒత్తిడిని తెస్తుంది. ధర పెరుగుదలకు వ్యతిరేకంగా నిలిచేందుకు, వీటి పై దేశాలు భారీగా ఆధారపడి ఉంటాయి. ధర కదలికల నుండి డబ్బు సంపాదించడానికి స్పెక్యులేటర్లు కూడా అవకాశం తీసుకుంటారు.
క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ లో ట్రేడింగ్
అంతర్జాతీయంగా, ఈ ఫ్యూచర్స్ కోసం రెండు బెంచ్ మార్కులు ఉన్నాయి. ఇవి నార్త్ సీ బ్రెంట్ క్రూడ్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యుటిఐ). నార్త్ సీ బ్రెంట్ క్రూడ్ అనేది యురోప్, ఆఫ్రికా మరియు మిడల్ ఈస్ట్ లోని దేశాల ద్వారా ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో ట్రేడ్ చేయబడుతుంది, అయితే ఉత్తర అమెరికాలో న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లేదా నైమెక్స్ పై డబ్ల్యుటిఐ ట్రేడ్ చేయబడుతుంది. రెండు ధరలు సాధారణంగా ముందు వెనకగా ఉంటూ ఉంటాయి.
భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ను ఎలా ట్రేడ్ చేయాలి? మీరు భారతదేశంలోని ఈ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు దానిని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లేదా ఎంసిఎక్స్ పై చేయాలి. ఈ రకాల ఫ్యూచర్స్ అనేక పెట్టుబడిదారులలో ఇష్టమైనవి ఎందుకంటే మార్జిన్లు, అలాగే లాట్ పరిమాణాలు చిన్నవి. మీరు 5 శాతం కంటే తక్కువ మార్జిన్లు చెల్లించవలసి రావచ్చు, అంటే గణనీయమైన లివరేజ్ కు అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు రూ. 50 లక్షల విలువలో వ్యాపారం చేయాలనుకుంటే, మీరు మార్జిన్లలో రూ. 2.5 లక్షలను మాత్రమే జమ చేయాలి. అదనంగా, క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా చాలా లిక్విడ్ గా ఉంటుంది (ఆర్ధిక పరంగా) మరియు సుమారు రూ10,000-15,000 కోట్ల విలువగల వ్యాపారం ప్రతి రోజు జరుగుతుంది. కాబట్టి మీరు ఎంచుకున్నప్పుడు కొనుగోలు మరియు విక్రయించడంలో ఏ సమస్య ఉండదు.
ఈ ఫ్యూచర్స్ లో వ్యాపారం చేయడం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే లాట్ సైజు చాలా చిన్నది. దీని కోసం రెండు లాట్ పరిమాణాలు అందుబాటులో ఉన్నాయి – క్రూడ్ ఆయిల్ మరియు క్రూడ్ ఆయిల్ మినీ. క్రూడ్ ఆయిల్ కోసం లాట్ సైజు 100 బ్యారెల్స్ అయితే, క్రూడ్ ఆయిల్ మినీ సైజు 10 బ్యారెల్స్. ఒక బ్యారెల్ 162 లీటర్ల ఆయిల్ కలిగి ఉంటుంది. అందువల్ల బ్రెంట్ క్రూడ్ కోసం ఒక బ్యారెల్ స్పాట్ ధర $66 అని ఊహిస్తే (ఇది స్పాట్ ధర; ఫ్యూచర్స్ ధరలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు) మరియు 5 శాతం మార్జిన్ తో, మరియు ఒక సాధారణ పెట్టుబడిదారుడు కేవలం రూ 225 కే ఒక మినీ ఆయిల్ ఒప్పందానికి ఎక్స్పోజర్ పొందుతారు. టిక్ సైజు ప్రతి బ్యారెల్ కు రూ 1.
అయితే, ఫ్యూచర్స్ మార్కెట్లో అపారమైన ధర అస్థిరత గురించి పెట్టుబడిదారులు ఏం తెలుసుకోవాలి అంటే. ధరలు పైకి కిందికి కదలవచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనుకోని అంశాల పై ఆధారపడి ఉంటాయి అని.
భారతదేశంలో పెద్ద ఆయిల్ కంపెనీలు ఆయిల్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఆధిపత్యం వహిస్తాయి. కొన్నింటి పేరు చెప్పాలంటే, మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాయి. కానీ ఒక చిన్న పెట్టుబడిదారు ఎందుకు లాభం పొందలేరు అనేదానికి ఎటువంటి కారణం లేదు. అటువంటి పెట్టుబడిదారుల కోసం విజయవంతమైన వాణిజ్యానికి పరిమితుల్లో లివరేజ్ ఉంచుకోవడం కీలకం.
క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ అనేది ఒక జీరో-సమ్ గేమ్, విన్-విన్ గేమ్ కాదు. మీరు లాభం పొందినట్లయితే, మరొకరు నష్టపోతారు. ఇది అంతా ఆయిల్ ధరల కదలిక గురించి అవగాహనలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎంతగానో అంచనా వేయలేని విధంగా ఉన్న కారణంగా, అవి ఏ దిశలో కదులుతాయి అనేది ఖచ్ఛితంగా ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఏ ఇద్దరికీ ఒకే అవగాహన ఉండదు. మీరు గెలుస్తారా లేదా అనేది, మీ పూర్వానుమానం సరైనదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.