డీమాట్ అకౌంట్ పై ఇన్కమ్ టాక్స్

1 min read
by Angel One

స్టాక్ మార్కెట్లో మీ సంపాదనలను పెట్టుబడి పెట్టడం అనేది కొంత కాలంలో మీ సంపదను పెంచుకోవడానికి ఒక గొప్ప మార్గం. అది తన స్వంత రిస్క్ లతో కుడి ఉంటుంది, ఇటువంటి పెట్టుబడులు దీర్ఘకాలంలో అధిక రాబడులను అందిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, డీమాట్ అకౌంట్ లో ఇన్కమ్ టాక్స్. ఇన్కమ్ టాక్స్ చట్టం, 1961 ప్రకారం, మీ డిమాట్ అకౌంట్లో మీరు కలిగి ఉన్న షేర్లను అమ్మడం నుండి మీరు పొందే లాభాలు టాక్స్ విధించబడటానికి బాధ్యత వహిస్తాయి. ఒక డిమాట్ అకౌంట్పై ఇన్కమ్ టాక్స్ యొక్క వివిధ ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

డిమాట్ అకౌంట్ పై టాక్స్ ప్రభావాలు ఏమిటి?

డిమాట్ అకౌంట్ పై టాక్స్ ప్రభావాలకు సంబంధించి, మీరు తెలుసుకోవాల్సిన నాలుగు ప్రాథమిక అంశాలు ఉన్నాయి.

షార్ట్-టర్మ్ కాపిటల్ గెయిన్స్ (STCG)

ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం, 12 నెలలు లేదా అంతకంటే తక్కువ వరకు కలిగి ఉన్న ఆస్తులు షార్ట్ టర్మ్ కాపిటల్ ఆస్తులుగా వర్గీకరించబడతాయి. ఈ ఆస్తులలో ఈక్విటీ షేర్లు, ప్రేఫెరేన్సు షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. 12 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలంలో ఈ ఆస్తులను అమ్మడం నుండి మీరు పొందే ఏదైనా లాభం అయినా షార్ట్-టర్మ్ కాపిటల్ గెయిన్స్ (STCG) అని పిలుస్తారు మరియు తదనుగుణంగా టాక్స్ విధించబడతాయి. 

అందువల్ల, మీరు మీ డిమాట్ అకౌంట్లో పైన పేర్కొన్న ఆస్తుల్లో దేనినైనా కలిగి ఉంటే మరియు తరువాత మీరు వాటిని నిర్దిష్ట వ్యవధిలో అమ్మినట్లయితే, మీరు స్వయంచాలకంగా షార్ట్-టర్మ్ కాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించడానికి బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) వర్తించే ట్రేడ్‌లపై లాభాల STGపై వసూలు చేసే టాక్స్ రేటు 15%. STT వర్తించని ప్రత్యేక సందర్భాలలో, STCG మీ మొత్తం టాక్స్ విధించదగిన ఆదాయంతో కలపబడుతుంది మరియు తరువాత మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం టాక్స్ విధించబడుతుంది.

లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)

ఈక్విటీ షేర్లు, ప్రేఫెరేన్సు షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్ మరియు 12 నెలలకు పైగా నిర్వహించబడే ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి క్యాపిటల్ ఆస్తులను ఇన్కమ్ టాక్స్ చట్టం, 1961 ద్వారా లాంగ్-టర్మ్ క్యాపిటల్ అసెట్స్ గ వర్గీకరించబడతాయి. ఈ లాంగ్-టర్మ్ క్యాపిటల్ అసెట్స్ను అమ్మడం ద్వారా మీరు పొందే లాభాలు లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా భావించబడతాయి.

STCG కు సంబంధించి ఒక డిమాట్ అకౌంట్పై ఇన్కమ్ టాక్స్ నిబంధనల పోలి, మీరు మీ డిమాట్ అకౌంట్లో పైన పేర్కొన్న లాంగ్-టర్మ్ క్యాపిటల్ అసెట్స్ అమ్మినట్లయితే మీరు లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం, ఒక ఆర్థిక సంవత్సరంలో ₹. 1 లక్షల వరకు LTCG పూర్తిగా టాక్స్ విధింపు నుండి మినహాయించబడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ₹. 1 లక్షల కంటే ఎక్కువ మరియు మించిన LTCG 10% ఫ్లాట్ రేటును ఆకర్షిస్తుంది.

షార్ట్-టర్మ్ క్యాపిటల్ లాస్ (STCL)

మీరు కొనుగోలు ధర కంటే తక్కువ ధరలో మీ షార్ట్-టర్మ్ క్యాపిటల్ అసెట్లను అమ్మినప్పుడు, మీకు తప్పనిసరిగా ఒక క్యాపిటల్ లాస్ ఉంటుంది. ఈ క్యాపిటల్ లాస్ షాట్-టర్మ్ క్యాపిటల్ లాస్గా వర్గీకరించబడుతుంది. ఇన్కమ్ టాక్స్ చట్టం అదే ఆర్థిక సంవత్సరంలో అయిన STCG లేదా LTCG కు వ్యతిరేకంగా అటువంటి క్యాపిటల్ లాస్ ని సెట్-ఆఫ్ చేయడానికి అనుమతిస్తుంది.

సంవత్సరంలో మీ STCL మొత్తం సెట్-ఆఫ్ కాని సందర్భంలో, ఇన్కమ్ టాక్స్ చట్టం యొక్క నిబంధనలు మీకు 8 ఫైనాన్షియల్ సంవత్సరాల వరకు నష్టాన్ని ఫార్వర్డ్ చేయడానికి అనుమతినిస్తుంది. క్యారీ ఫార్వర్డ్ చేసిన నష్టాన్ని ఆ సంవత్సరంలో LTCG లేదా STCG లని సెట్-ఆఫ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

లాంగ్-టర్మ్ కాపిటల్ లాస్ (LTCL)

మీరు కొనుగోలు ధర క్రింద మీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ అసెట్లను అమ్మినప్పుడు మీకు అయిన ఏదైనా క్యాపిటల్ లాస్ లాంగ్-టర్మ్ క్యాపిటల్ లాస్గా పరిగణించబడుతుంది. ఇటీవల వరకు, ఇన్కమ్ టాక్స్ చట్టం LTCLను సెట్-ఆఫ్ చేయడానికి మరియు క్యారీ ఫార్వర్డ్ చెయ్యడానికి అనుమతించలేదు. అయితే, 4 ఫిబ్రవరి 2018 తేదీనాడు ఒక నోటిఫికేషన్ ద్వారా, ఇప్పుడు 1 ఏప్రిల్ 2018 నాడు లేదా తర్వాత చేసిన ట్రాన్స్ఫర్ల LTCG కు వ్యతిరేకంగా లాంగ్-టర్మ్ క్యాపిటల్ లాస్ సెట్-ఆఫ్ చేయడానికి అనుమతించబడుతుంది.

STCL యొక్క నిబంధనల లాగా, పూర్తిగా సెట్-ఆఫ్ కాని ఏదైనా లాంగ్-టర్మ్ క్యాపిటల్ లాస్ 8 తదుపరి ఆర్థిక సంవత్సరాల వరకు ఫార్వర్డ్ చేయవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేసిన LTCL ఆ సంవత్సరంలో చేసిన లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లను సెట్-ఆఫ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

డిమాట్ అకౌంట్ ఉపయోగించి టాక్స్ను ఎలా ఆదా చేయాలి?

ఒక డిమాట్ అకౌంట్ను ఉపయోగించి టాక్స్ను ఎలా ఆదా చేయాలో మీరు ఆశ్చర్యపోతున్నట్లయితే, దీనిని ఉపయోగించి మీరు గణనీయంగా మీ టాక్స్ బాధ్యతను తగ్గించుకోవచ్చు.

ULIP లలో పెట్టుబడి

యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ (ULIP) అనేది ఇన్స్యూరెన్స్ కవర్ మరియు వెల్త్ క్రియేషన్ యొక్క డ్యూయల్ ప్రయోజనాలను అందించే ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ వాహనం. మీరు ULIPలో చేసే పెట్టుబడిలో ఒక భాగం మీకు లైఫ్ కవర్ అందించడానికి వెళ్తుంది, అయితే ఇతర భాగం ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడులు మీ డిమాట్ అకౌంట్కు జమ చేయబడతాయి, ఇందులో వాటిని మీరు తప్పనిసరి లాక్-ఇన్ వ్యవధిలో భాగంగా కనీసం 5 సంవత్సరాలు నిలిపి ఉంచవలసి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరంలో ₹ 1.5 లక్షల వరకు ఉన్న ULIP పెట్టుబడులు ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి కింద టాక్స్ నుండి పూర్తిగా మినహాయించబడ్డాయి. అదనంగా, హోల్డింగ్ వ్యవధి చివరిలో మీరు అందుకునే మెచ్యూరిటీ మొత్తం కూడా టాక్స్ మినహాయించబడ్తుంది. ULIP ల యొక్క ఈ రెండు రెట్లు టాక్స్ ఆదా లక్షణం డీమాట్ అకౌంట్ లో ఇన్కమ్ టాక్స్ ప్రభావాలను రద్దు చేయడానికి మీకు సహాయపడుతుంది.

ELSS లో పెట్టుబడి

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ELSS) అనేది మరొక గొప్ప టాక్స్ ఆదా పెట్టుబడి ఎంపిక. ఇతర సాంప్రదాయక పెట్టుబడి రూపాలతో పోలిస్తే, ELSS లో కేవలం 3 సంవత్సరాల అతి తక్కువ లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఈ పథకం అందించే రాబడులు ఇతర పెట్టుబడుల కంటే సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి.

డీమాట్ అకౌంట్ ను ఉపయోగించి టాక్స్ ఎలా ఆదా చేయాలి అనే ప్రశ్నకు ELSS సమాధానం, ఎందుకు అంటే ఈ పథకంలో పెట్టుబడి మొత్తాన్ని ఆర్థిక సంవత్సరంలో ₹ 1.5 లక్షల వరకు పూర్తిగా మినహాయించారు. అంతేకాకుండా, మీరు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ముగింపు వద్ద అందుకునే LTCG అది ₹1 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే టాక్స్ విధించదగినది.

ముగింపు

ఇప్పుడు డిమాట్ అకౌంట్ పై ఇన్కమ్ టాక్స్ యొక్క వివిధ ప్రభావాల గురించి మీకు తెలుసు కాబట్టి, మీరు మీ పెట్టుబడి వ్యూహాలకు కేవలం కొన్ని వేగవంతమైన మరియు సాధారణ ట్వీక్స్ తో మీ టాక్స్ బాధ్యతను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టెక్నిక్ తో, మీరు మీ టాక్స్ భారం గురించి ఆందోళన చెందకుండా ఒక డిమాట్ అకౌంట్ ద్వారా అందించబడే ప్రయోజనాలను కొనసాగించవచ్చు.