సాధారణ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్నది. నష్టాలను నివారించడానికి ఇటువంటి ట్రేడింగ్ యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం, ముఖ్యంగా కొత్తగా ట్రేడింగ్ చెసేవారు. వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా నష్టపోయే స్థోమత మొత్తాన్ని మాత్రమే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
పెట్టుబడిదారుల కోసం మా ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూహాల గురించి మరింత చదవండి.
ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చిట్కాలు
- ఇండియన్ షేర్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కొన్ని చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి, ఇవి సరైన నిర్ణయం తీసుకోవడంలో పెట్టుబడిదారులకు సహాయపడతాయి:
- రెండు లేదా మూడు లిక్విడ్ షేర్లను ఎంచుకోండి
- ప్రవేశ మరియు టార్గెట్ ధరలను నిర్ణయించండి
- తక్కువ ప్రభావం కోసం స్టాప్-లాస్ను ఉపయోగించడం
- మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ లాభాలను బుక్ చేసుకోండి
- పెట్టుబడిదారుడు గా కాకుండా ట్రేడర్ గా ఉండండి
- మీ కోరికల జాబితాను పూర్తిగా పరిశోధించండి
- మార్కెట్‌కు వ్యతిరేకంగా వెళ్లవద్దు
- ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రాథమిక నియమాలు
- ఇంట్రాడే ట్రేడింగ్ ఇండికేటర్స్
- ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో లాభం ఎలా పొందాలి
- ఇంట్రాడే టైమ్ విశ్లేషణ
- ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి
రెండు లేదా మూడు లిక్విడ్ షేర్లను ఎంచుకోండి
ఇంట్రాడే ట్రేడింగ్ లో ట్రేడింగ్ సెషన్ ముగిసేలోపు ఓపెన్ పొజిషన్లను మూసివేయడం జరుగుతుంది. అందువల్ల అధిక లిక్విడిటీ కలిగిన రెండు లేదా మూడు పెద్ద క్యాప్ షేర్లను ఎంచుకోవాలని సిఫార్సు చేయబడుతుంది. తక్కువ ట్రేడింగ్ పరిమాణాల కారణంగా మిడ్-సైజ్ లేదా స్మాల్ కాప్స్ లో పెట్టుబడి పెట్టడం వలన పెట్టుబడిదారులు ఈ షేర్లను ఉంచుకోవలసి వచ్చును.
ప్రవేశ మరియు టార్గెట్ ధరలను నిర్ణయించండి
కొనుగోలు ఆర్డర్ చేయడానికి ముందు, మీరు మీ ప్రవేశ మరియు టార్గెట్ ధరను నిర్ణయించాలి. షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మారడం సహజం, ఫలితంగా, ధర నామమాత్రపు పెరుగుదలను చూస్తే కూడా మీరు అమ్మవచ్చు. ఈ కారణంగా, ధర పెరుగుదల కారణంగా వచ్చే అధిక లాభాలను పొందే అవకాశాన్ని కోల్పోవచ్చు.
తక్కువ ప్రభావం కోసం స్టాప్– లాస్ను ఉపయోగించడం
స్టాప్ లాస్ అనేది ఒక ట్రిగ్గర్, ఇది ధర పేర్కొన్న పరిమితి కంటే తక్కువగా ఉంటే షేర్లను ఆటోమేటిగ్గా విక్రయించడానికి ఉపయోగించబడుతుంది. స్టాక్ ధరలు తగ్గడం వల్ల పెట్టుబడిదారులకు కలిగే నష్టాన్ని పరిమితం చేయడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. షార్ట్-సెల్లింగ్ చేసే పెట్టుబడిదారులకు, తమ అంచనాలకు మించి ధర పెరిగితే నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూహం మీ నిర్ణయాలనుండి భావోద్వేగాలు తొలగింపబడటానికి దోహదపడుతుంది.
మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ లాభాలను బుక్ చేసుకోండి
ఎక్కువ సమయం ట్రేడర్స్ భయం లేదా అత్యాశకు లోనవుతారు. పెట్టుబడిదారులు తమ నష్టాలను తగ్గించుకోవడమే కాకుండా, లక్ష్య ధరను చేరుకున్న తర్వాత వారి లాభాలను బుక్ చేసుకోవడం కూడా ముఖ్యం. ఒకవేళ స్టాక్ ధర పెరిగే అవకాశం ఉందని వ్యక్తి భావిస్తే, స్టాప్ లాస్ ట్రిగ్గర్ ను ఈ అంచనాకు సరిపోయే విధంగా తిరిగి సర్దుబాటు చేయబడాలి.
పెట్టుబడిదారుడు గా కాకుండా ట్రేడర్ గా ఉండండి
ఇంట్రాడే ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం కోసం వ్యక్తులు షేర్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది. అయితే, ఈ రెండు వ్యూహాలకు కారకాలు భిన్నంగా ఉంటాయి. ఒకటి సాంకేతిక వివరాలను పరిగణనలోకి తీసుకోగా మరొకటి ప్రాథమిక అంశాలను అనుసరిస్తుంది. లక్ష్య ధరను చేరుకోకపోతే రోజువారీ ట్రేడర్స్ షేర్లను డెలివరీ తీసుకోవడం సాధారణమైనది. అతను లేదా ఆమె తన డబ్బును తిరిగి పొందడానికి ధర కోలుకోవడానికి వేచి ఉంటాడు. ఇది పెట్టుబడి చేయడం కోసం తగినది కాకపోవచ్చు ఎందుకంటే ఇది తక్కువ వ్యవధి కోసం మాత్రమే కొనుగోలు చేయబడింది కాబట్టి ఇది సిఫార్సు చేయబడదు.
మీ కోరికల జాబితాను పూర్తిగా పరిశోధించండి
పెట్టుబడిదారులు తమ కోరికల జాబితాలొ 8 నుండి 10 షేర్లను చేర్చాలని మరియు వీటిని లోతుగా పరిశోధించాలని సూచిస్తున్నారు. మెర్జెర్స్, బోనస్ తేదీలు, స్టాక్ స్ప్లిట్లు, డివిడెండ్ చెల్లింపులు మొదలైన కార్పొరేట్ సంఘటనలు మొదలైన వాటి గురించి వాటి సాంకేతిక స్థాయిలతో పాటు తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిరోధక మరియు మద్దతు స్థాయిలను కనుగొనడానికి ఇంటర్నెట్ ను ఉపయోగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
మార్కెట్ కు వ్యతిరేకంగా వెళ్లవద్దు
అధునాతన సాధనాలతో అనుభవజ్ఞులైన నిపుణులు కూడా మార్కెట్ కదలికలను అంచనా వేయలేరు. అన్ని సాంకేతిక కారకాలు ఒక బుల్ మార్కెట్ ని చిత్రీకరించిన కొన్ని సందర్భాలు ఉన్నను, మార్కెట్ కింద పడవచ్చు. ఈ కారకాలు సూచిక మాత్రమే మరియు ఎటువంటి హామీలు ఇవ్వవు. మార్కెట్ మీ అంచనాలకు వ్యతిరేకంగా కదులుతుంటే, భారీ నష్టాలను నివారించడానికి మీ పొజిషన్ నుండి నిష్క్రమించడం చాలా ముఖ్యం.
స్టాక్ రాబడులు భారీగా ఉండవచ్చు; అయితే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చిట్కాలు మరియు వ్యూహాలను అనుసరించడం ద్వారా చిన్న లాభాలను సంపాదించడం సంతృప్తికరంగా ఉండాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అధిక పరపతిని అందిస్తుంది, ఇది ఒక రోజులో మంచి రాబడులను సమర్థవంతంగా అందిస్తుంది. ఒక రోజువారీ ట్రేడర్ గా విజయం సాధించడానికి సంతృప్తిగా ఉండటం చాలా ముఖ్యం.
ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నియమాలు
చాలామంది ట్రేడర్స్, ముఖ్యంగా కొత్తగా ప్రారంభించినవారు, స్టాక్ మార్కెట్ల అధిక అస్థిరత కారణంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో డబ్బును కోల్పోతారు. సాధారణంగా, భయం లేదా అత్యాశ వల్ల నష్టాలు సంభవిస్తాయి, ఎందుకంటే పెట్టుబడి ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ, విషయ పరిజ్ఞానము లేకపోవడం ప్రమాదకరం.
ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రాథమిక నియమాలు
ఇంట్రాడేలో ట్రేడింగ్ కోసం కొన్ని ప్రాథమిక నియమాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- మార్కెట్ ను సరిగ్గా టైం చేయడం
- పెట్టుబడి వ్యూహాన్ని ప్లాన్ చేయండి మరియు దానికి కట్టుబడి ఉండండి
- ప్రతికూల పరిస్థితులలో పొజిషన్ వదిలేయడం
- ఇబ్బంది పెట్టని చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం
- పరిశొధించి లిక్విడ్ స్టాక్స్ ఎంచుకోండి
- ఎల్లప్పుడూ అన్ని ఓపెన్ పోజిషన్లను మూసివేయండి
- సమయం వెచ్చించండి
మార్కెట్ ను సరిగ్గా టైం చేయడం:
మార్కెట్లు తెరిచిన తర్వాత మొదటి గంటలో ట్రేడింగ్ చేయకుండా ఉండాలని నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తారు. మధ్యాహ్నం 12 – 1 గంటల మధ్య పొజిషన్స్ తీసుకోవడం వలన లాభాలను ఆర్జించే అవకాశాన్ని పెంచుకోవచ్చు.
పెట్టుబడి వ్యూహాన్ని ప్లాన్ చేయండి మరియు దానికి కట్టుబడి ఉండండి:
ట్రేడర్స్, ట్రేడింగ్ ప్రారంభించినప్పుడు, ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండటం ముఖ్యం. ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు ప్రవేశ మరియు నిష్క్రమణ ధరలను నిర్ణయించడం చాలా ముఖ్యం. మీ పొజిషన్ సంభావ్య నష్టాన్ని తగ్గించడానికి స్టాప్ లాస్ ట్రిగ్గర్ ఉపయోగించడం అత్యంత ముఖ్యమైన ఇంట్రాడే ట్రేడింగ్ చిట్కాల్లో ఒకటి. అంతేకాకుండా, స్టాక్ లక్ష్య ధరను సాధించిన తర్వాత ట్రేడర్స్, తమ పొజిషన్ మూసివేయడం శ్రేయస్కరం మరియు అత్యాశకు పొయి అధిక లాభాలను ఆశించకూడదు.
ప్రతికూల పరిస్థితులలో పొజిషన్ వదిలేయడం:
లాభంలో ఉండి మరియు ప్రైస్-గివ్ రివర్సల్ (రివర్స్ ట్రెండ్స్ చూపించే ధర) అందించే ట్రేడ్స్ కోసం, లాభాలను బుక్ చేసుకొని ఓపెన్ పొజిషన్ నుండి నిష్క్రమించడం మంచిది. అదనంగా, పరిస్థితులు పొజిషన్ కి అనుకూలమైనవి కాకపోతే, వెంటనే నిష్క్రమించడం మంచిది మరియు స్టాప్–లాస్ ట్రిగ్గర్ కావడానికి వేచి ఉండకూడదు. ఇది ట్రేడర్స్,వారి నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇబ్బంది పెట్టని చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం:
రోజువారీ ట్రేడింగ్ సమయంలో కొన్ని లాభాలు పొందిన తరువాత కొత్త ట్రేడర్స్ అత్యుత్సాహం చూపించడం సహజం. అయితే, మార్కెట్లు అస్థిరమైనవి మరియు అనుభవజ్ఞులైన నిపుణులకు కూడా ట్రెండ్స్ అంచనా వేయడం సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో, కొత్త ట్రేడర్స్ వారి పెట్టుబడులన్నీ సులభంగా కోల్పోవచ్చు. అందువల్లనే ఒక ట్రేడర్ పోగొట్టుకోగలిగే చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ఒక ముఖ్యమైన ఇంట్రాడే చిట్కా. ఒకవేళ మార్కెట్లు తమకు అనుకూలంగా లేనట్లయితే ట్రేడర్స్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలాగా ఇది నిర్ధారిస్తుంది.
పరిశొధించి లిక్విడ్ స్టాక్స్ ఎంచుకోండి:
ఇంట్రాడే ట్రేడింగ్ ప్రారంభించే ముందు, స్టాక్ మార్కెట్ యొక్క ప్రాథమిక అంశాలను మరియు ప్రాథమిక మరియు సాంకేతిక విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి సిఫార్సు చేయబడింది. ఇంటర్నెట్‌లో పలు పరిశోధనలు అందుబాటులో ఉన్నాయి మరియు దానిని చదవడానికి సమయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే వందలాది స్టాక్స్ ఉన్నాయి కాని ట్రేడర్స్ రెండు లేదా మూడు లిక్విడ్ స్టాక్లను మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇంట్రాడే మార్కెట్లో అధిక పరిమాణాలు కలిగి ఉన్న షేర్లు లిక్విడ్ స్టాక్స్. ట్రేడింగ్ సెషన్లు ముగిసేలోపు ట్రేడర్స్ ఓపెన్ పోజిషన్ల నుండి నిష్క్రమించడానికి ఇది అనుమతిస్తుంది
ఎల్లప్పుడూ అన్ని ఓపెన్ పోజిషన్లను మూసివేయండి:
కొంతమంది ట్రేడర్స్ తమ లక్ష్యాలను సాధించలేకపోతే వారి పోజిషన్లను డెలివరీ చేయాలనే ప్రలొభానికి లోనవుతారు. ఇది అతిపెద్ద లోపాలలో ఒకటి మరియు ట్రేడర్స్ నష్టాన్ని బుక్ చేసుకోవలసి వచ్చినప్పటికీ అన్ని ఓపెన్ పోజిషన్లను మూసివేయడం చాలా ముఖ్యం.
సమయం వెచ్చించండి:
ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనల్స్ కోసం డే ట్రేడింగ్ సరి కాదు. ట్రేడర్స్ మార్కెట్ సెషన్ (ఓపెనింగ్ బెల్ నుండి క్లోజింగ్ వరకు) అంతటా మార్కెట్ కదలికలను పర్యవేక్షించగలగాలి, అవసరమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వారికి వీలుండాలి.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇండికేటర్లు
ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలను బుక్ చేసుకునే విషయానికి వస్తే, మీరు చాలా పరిశోధన చేయవలసి ఉంటుంది. దాని కోసం, మీరు కొన్ని ఇండికేటర్లు అనుసరించాలి. తరచుగా ఇంట్రాడే చిట్కాలు హోలీ గ్రెయిల్ అని నమ్ముతారు; అయితే ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. రాబడులు గరిష్టంగా పెంచుకోవడానికి ఒక సమగ్ర వ్యూహం ఉపయోగించినప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఇండికేటర్లు ప్రయోజనకరమైన సాధనాలు.
ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో లాభం ఎలా పొందాలి
స్టాక్ మార్కెట్లలో ఉన్న అంతర్గత ప్రమాదాలను ఇంట్రాడే ట్రేడర్స్ ఎల్లప్పుడూ ఎదుర్కొంటారు. ధరల అస్థిరత మరియు రోజువారీ పరిమాణాలు అనేవి రోజువారీ ట్రేడింగ్ కోసం ఎంపిక చేసుకున్న స్టాకులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కొన్ని కారకాలు. సరైన రిస్క్ నిర్వహణ నిర్ధారించడానికి ట్రేడర్స్ ఒకే ట్రేడ్ పై వారి మొత్తం ట్రేడింగ్ పెట్టుబడిలో రెండు శాతానికి పైగా రిస్క్ చేయకూడదు. అందువల్ల ఇంట్రాడే ట్రేడింగ్లో లాభం పొందడానికి పంచుకోబడిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఇంట్రాడే టైమ్ విశ్లేషణ
ఇంట్రాడే ట్రేడింగ్ విషయానికి వస్తే, రోజువారీ చార్ట్స్ అత్యంత సాధారణంగా ఉపయోగించబడే చార్ట్స్, ఒక రోజు వ్యవధిలో ధర కదలికలను ప్రతినిధిస్తుంది. ఈ చార్ట్స్ ఒక ప్రముఖ ఇంట్రాడే ట్రేడింగ్ టెక్నిక్ మరియు ఓపెనింగ్ బెల్ మరియు క్లోసింగ్ బెల్ మధ్య రోజువారీ ట్రేడింగ్ సెషన్ ధరల కదలికను వివరించడంలో సహాయపడతాయి. ఇంట్రాడే ట్రేడింగ్ చార్ట్స్ ఉపయోగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఉపయోగించబడే చార్ట్స్ క్రింద ఇవ్వబడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్ టైమ్ విశ్లేషణ గురించి మరింత తెలుసుకోండి.
ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి
ఒక రోజువారీ ట్రేడర్ గా విజయం సాధించడానికి, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. తరచుగా ప్రజలు తగిన స్టాక్‌లను ఎంచుకోవడంలో విఫలమవుతారు కనుక లాభాలను ఆర్జించలేరు. డే ట్రేడింగ్, సరిగ్గా నిర్వహించకపోతే, ట్రేడర్ల ఆర్థిక శ్రేయస్సు పై తీవ్రమైన ఫలితాలు పొందవచ్చు. తక్కువ వ్యవధిలో భారీ లాభాలు సంపాదించాలనే ప్రలోభం ట్రేడర్లను ఆశపెట్టవచ్చు. అయితే, అసంపూర్ణ అవగాహన మరియు జ్ఞానంతో, ఇంట్రాడే ట్రేడింగ్ హానికరం.
స్టాక్ మార్కెట్లలో ఉన్న అంతర్గత ప్రమాదాలను ఇంట్రాడే ట్రేడర్స్ ఎల్లప్పుడూ ఎదుర్కొంటారు. ధరల అస్థిరత మరియు రోజువారీ పరిమాణాలు అనేవి రోజువారీ ట్రేడింగ్ కోసం ఎంపిక చేసుకున్న స్టాకులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కొన్ని కారకాలు. సరైన రిస్క్ నిర్వహణను నిర్ధారించడానికి ట్రేడర్స్ ఒకే ట్రేడ్ పై వారి మొత్తం ట్రేడింగ్ పెట్టుబడి లో రెండు శాతానికి పైగా రిస్క్ చేయకూడదు. అందువల్ల ఇంట్రాడే ట్రేడింగ్లో లాభం పొందడానికి పంచుకోబడిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలు ఎలా సంపాదించాలి
లాభాలను సంపాదించడానికి, నిరూపించబడిన ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూహాల్లో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ ఔట్ (ఓఆర్ బి)
2. నిరోధక మరియు మద్దతు స్థాయిలను కనుగొనుట
3. డిమాండ్-సప్ప్లై అసమతుల్యత
4. 3:1 రిస్క్ రివార్డ్ రేషియో ఎంచుకొనుట
5. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (RSI) మరియు ఏవెరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ (ADX)
ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ ఔట్ (ఓఆర్ బి):
ఈ ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూహం వృత్తిపరమైన ట్రేడర్స్ మరియు అంతగా అనుభవం లేనివారి ద్వారా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ వ్యూహం యొక్క సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచడానికి, సూచనల యొక్క ఉత్తమ ఉపయోగంతో దానిని కలపడం, మార్కెట్ సెంటిమెంట్ యొక్క ఖచ్చితమైన అంచనా మరియు కఠినమైన నియమాలను సిఫార్సు చేస్తారు. ఓఆర్ బి అనేక వైవిధ్యాలను కలిగి ఉంది; కొంతమంది ట్రేడర్స్ ప్రారంభ పరిధి నుండి పెద్ద బ్రేక్అవుట్లపై ట్రేడింగ్ ఎంచుకోవచ్చు మరియు ఇతరులు ప్రారంభ పరిధిలో బ్రేక్అవుట్ పై వారి ట్రేడ్‌లను ఉంచడానికి ఎంచుకోవచ్చు. ట్రేడింగ్ టైమ్ పరిధి 30 నిమిషాలు నుండి మూడు గంటల మధ్య ఉంటుంది.
నిరోధక మరియు మద్దతు స్థాయిలను కనుగొనుట:
ప్రతి స్టాక్ ధర ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన 30 నిమిషాల్లో ఒక రేంజ్ లో హెచ్చుతగ్గులకు లోనవుతుంది, దీనిని ఓపెనింగ్ రేంజ్ అని పిలుస్తారు. ఈ కాలంలో అత్యధిక మరియు అత్యల్ప ధరలు నిరోధక మరియు మద్దతు స్థాయులుగా భావించబడతాయి. షేర్ ధర ఓపెనింగ్ రేంజ్ మించి కదిలినప్పుడు కొనుగోలు చేయడం మరియు ధర ఓపెనింగ్ రేంజ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు అమ్మడం మంచిది.
డిమాండ్-సప్ప్లై అసమతుల్యత:
కొత్తగా ట్రేడింగ్ చేసే వారి కోసం ముఖ్యమైన ఇంట్రాడే ట్రేడింగ్ చిట్కా ఏమిటంటే, తీవ్రమైన డిమాండ్-సప్ప్లై అసమతుల్యత ఉన్న స్టాక్‌ల కోసం చూడటం మరియు వీటిని ప్రవేశ పాయింట్లుగా ఎంచుకోవడం. ఆర్థిక మార్కెట్లు సాధారణ డిమాండ్ మరియు సప్ప్లై నియమాలను అనుసరిస్తాయి-అధిక సప్ప్లై కోసం ఎటువంటి డిమాండ్ లేనప్పుడు ధర తగ్గుతుంది మరియు అదేవిధంగా డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. ట్రేడర్స్ పరిశోధన మరియు చారిత్రక కదలికలను అధ్యయనం చేయడం ద్వారా ధర చార్టులో ఇటువంటి అంశాలను గుర్తించడం నేర్చుకోవాలి.
3:1 రిస్క్ రివార్డ్ రేషియో ఎంచుకొనుట:
ట్రేడర్స్, ముఖ్యంగా కొత్తగా ట్రేడింగ్ చేసేవారు , తగిన రిస్క్-రివార్డ్ రేషియో అర్థం చేసుకోవాలి. ప్రారంభంలో, కనీసం 3: 1 రిస్క్-రివార్డ్ రేషియో అందించే స్టాక్‌లను కనుగొనడం షేర్ మార్కెట్ పెట్టుబడిలో లాభాలను సంపాదించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యూహం వారి ఎక్కువ ట్రేడింగ్లపై నష్టాలు జరిగినప్పటికీ నష్టాలు కొద్దిగా ఉండేటట్లు లాభాలు వచ్చినప్పుడు ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది.
రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (RSI) మరియు ఏవెరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ (ADX):
కొనుగోలు మరియు అమ్మకం అవకాశాలను కనుగొనడానికి ఈ రెండు ఇంట్రడే ట్రేడింగ్ వ్యూహాలను కలపడం వలన ట్రేడర్స్ లాభాలను సంపాదించడానికి సహాయపడుతుంది. ఆర్ఎస్ఐ అనేది టెక్నికల్ మోమెంటమ్ ఇండికేటర్, ఇది ఇటీవలి నష్టాలు మరియు లాభాలను, అధికంగా కొనుగోలు మరియు అమ్ముడైన స్టాక్‌లను పోల్చేది. ఎడిఎక్స్ ప్రయోజనకరంగా ఉంటుంది మరియు ధరలు ఎప్పుడు బలమైన పోకడలను చూపుతున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. చాలా సందర్భాల్లో, ఆర్ఎస్ఐ ఎగువ పరిమితిని దాటినట్లయితే, అది ఒక అమ్మకపు ట్రేడ్ సూచిస్తుంది మరియు దిగువ పరిమితిని దాటినట్లయితే కొనుగోలు ట్రేడ్ సూచిస్తుంది. అయితే, మీరు ఆర్ఎస్ఐ మరియు ఎడిఎక్స్ కలయిక చేసినప్పుడు, ఆర్ఎస్ఐ ఎగువ పరిమితిని దాటినప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ కొనుగోలు చేస్తారు మరియు దిగువ పరిమితిని దాటినట్లయితే అమ్మకం చేస్తారు . ట్రేడర్స్ వారి కొనుగోలు లేదా అమ్మకపు నిర్ణయాలను తీసుకోవడానికి ట్రెండ్ ఐడెంటిఫైయర్ గా ADX ఉపయోగించబడుతుంది.
ఇంట్రాడే ట్రేడింగ్ రొజువారీ ట్రేడింగ్ సెటిల్మెంట్స్ కలిగి ఉంటుంది. చాలామంది ట్రేడర్స్ వారి ట్రేడింగ్ ద్వారా చిన్న లాభాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. లాభాలను పొందడానికి మార్కెట్ ట్రెండ్‌తో ప్రయాణించడం బంగారం లాంటి ఇంట్రాడే చిట్కా.
ఏంజెల్ బ్రోకింగ్ యొక్క ఏంజెల్ ఐ చార్ట్స్ మరియు పోర్ట్ఫోలియో వాచ్ టూల్స్ కలిగి ఉంది, ఇది ట్రెండ్స్ గుర్తించడంలో సహాయపడుతుంది, మరియు తద్వారా ట్రేడర్స్ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ నుండి లాభాలను సంపాదించడానికి ఇది ట్రేడర్స్ కు సహాయపడుతుంది.
మీరు తెలుసుకొదగిన విషయాలు
హైపర్ లింక్
ఇంట్రాడే ట్రేడింగ్ లాభదాయకమా?
అవును, కానీ మీరు ఒక కొత్త ట్రేడర్అయితే, నష్టాలను నివారించడానికి ప్రాథమిక ఇంట్రాడే ట్రేడింగ్ నియమాలను అనుసరించాలి.
ఇంట్రాడే ట్రేడింగ్ నుండి లాభం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది, కానీ ముఖ్యంగా, అధిక లిక్విడిటీ కలిగిన స్టాక్స్ యొక్క సరైన ఎంపికపై. సరైన ప్రవేశ సమయం ప్లాన్ చేయడంలో మీకు సహాయపడటానికి అధునాతనమైనవి ఆధునిక స్టాక్ మార్కెట్ సాధనాలు. మూడవదిగా, నష్టాన్ని అల్ప స్థాయిలో ఉంచడానికి స్టాప్ లాస్‌ను ఎంచుకోండి.
హైపర్ లింక్
కొత్త ట్రేడెర్స్ కు ఇంట్రాడే ట్రేడింగ్ మంచిదా?
మార్కెట్లో ఒక అనుభవం ఉన్న ట్రేడర్ లాగా ట్రేడ్ చేయడానికి మీకు కొంత సమయం పడుతుంది. కానీ మీరు ఈ సులభమైన చిట్కాలను దృష్టిలో ఉంచుకుంటే మీరు ఇప్పటికీ లాభాన్ని సంపాదించవచ్చు.
1. మార్కెట్ను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి
2. జ్ఞానం శక్తి కాబట్టి మీ పరిశోధన చేయండి
3. అవసరమైనప్పుడు ఉపయోగించడానికి ఒక ఫండ్ ను పక్కన పెట్టండి
4. చిన్నదిగా ప్రారంభించండి; ప్రారంభంలో ఒకటి లేదా రెండు స్టాకులు ట్రేడ్ చెయ్యండి
5. సరైన అవకాశాల కోసం మార్కెట్ను ట్రాక్ చేయడానికి సమయం వెచ్చించండి
6. లాభం గురించి వాస్తవిక దృక్పథాన్నిఉంచండి
7. మార్కెట్లో అత్యంత రద్దీగా ఉండే సమయంలో ఇంట్రాడే ట్రేడింగ్ జరుగుతుంది; మార్కెట్ తెరవబడిన కనీసం ఒక గంట తర్వాత మీ పొజిషన్ తీసుకోండి
8. పరిమిత ఆర్డర్లతో మీ నష్టాలను తగ్గించుకోండి. ఇది మరింత ఖచ్చితత్వంతో ట్రేడింగ్ చేయడానికి అనుమతిస్తుంది
9. ఒక వ్యూహాన్ని రూపొందించండి మరియు దానికి కట్టుబడి ఉండండి
హైపర్ లింక్
ఇంట్రాడే ట్రేడింగ్ సాధారణ ట్రేడింగ్‌కు ఎలా భిన్నంగా ఉంటుంది?
ఇంట్రాడే ట్రేడింగ్ నిబంధనలలో అదే రోజు స్టాక్స్ కొనుగోలు మరియు అమ్మకం ఉంటుంది. ఆ విధంగా, షేర్ల యాజమాన్యం బదిలీ చేయబడదు. మీ స్టాక్స్ కొనుగోలు, అమ్మకం ద్వారా రద్దు చేయబడుతుంది.
రెగ్యులర్ ట్రేడింగ్‌లో, ట్రేడింగ్ ఒక సమయ వ్యవధిలో జరుగుతుంది, అంటే మీ డిమాట్ అకౌంట్లో స్టాక్స్ డెలివరీ చేయబడతాయి మరియు, మీరు అమ్మినప్పుడు, ఈ స్టాక్స్ మీ అకౌంట్ నుండి బయటకు తరలించబడతాయి.
ఇంట్రాడే ట్రేడ్స్ ఎక్కడ ఉంచాలి?
సరైన పరిశోధన మరియు సాంకేతిక సహకారంతో ఇంట్రాడే ట్రేడర్స్ కు సహాయం చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్న సరైన బ్రోకర్‌తో మీరు భాగస్వామ్యం చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అకౌంట్స్ అధిక పరిమాణంలో లావాదేవీలు కలిగి ఉన్నందున, తక్కువ బ్రోకరేజ్ మరియు వేగవంతమైన అమలుతో ట్రేడింగ్ అకౌంట్ ఎంచుకోండి. ఏంజెల్ బ్రోకింగ్తో ఇంట్రాడే ట్రేడింగ్ అకౌంట్ను తెరవడం మరియు జీవితకాలం జీరో–కాస్ట్ ఈక్విటీ డెలివరీని పొందడం ఒక ఎంపిక.
నేను ఇంట్రాడే నుండి డబ్బును ఎలా సంపాదించగలను?
స్టాక్ మార్కెట్లో త్వరగా డబ్బు సంపాదించడానికి తరచుగా ఇంట్రాడే ట్రేడింగ్ ఒక మార్గంగా భావించబడుతుంది. ఇది నిజమైనది ఎందుకంటే ట్రేడర్స్ వేగంగా, క్రమబద్ధంగా ధరల అస్థిరత నుండి నగదు పొందడానికి ప్రయత్నిస్తారు. గుర్తుంచుకోండి, ఇంట్రాడేలో, మీరు మార్కెట్ మూసివేయడానికి ముందే మీ పొజిషన్ను మూసివేయాలి, కనుక, మీరు అధిక పరిమాణం మరియు లిక్విడిటీ కలిగి ఉన్న స్టాక్స్ ను ఎంచుకోవాలి. అలాగే, మార్కెట్ ప్రవేశం ప్లాన్ చేయండి మరియు జాగ్రత్తగా నిష్క్రమించండి మరియు నష్టాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టాప్ లాస్ ఉంచండి.
ఇంట్రాడే ట్రేడ్‌లను ఎప్పుడు అమలు చేయాలి?
మార్కెట్ అత్యంత చురుకుగా ఉన్నప్పుడు మరియు ధరల కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రేడ్ చేయడానికి ఉత్తమ సమయం. రోజువారీ ట్రేడింగ్ ప్రారంభమైన 30 నిమిషాల్లో, ప్రతీ స్టాక్ ఒక పరిధిని సృష్టిస్తుంది. దీనిని ఓపెనింగ్ రేంజ్ అంటారు. ఓపెనింగ్ రేంజ్ పైన స్టాక్ ధర ఉంటే ‘కొనండి’. అదేవిధంగా, ఓపెనింగ్ రేంజ్ దిగువన ఉన్న స్టాక్ ధర ‘అమ్మకం’ అని సూచిస్తుంది.
సులభమైన ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూహం ఏమిటి?
ఇంట్రాడే వ్యాపారులు మార్కెట్ అస్థిరత నుండి లాభం పొందుతారు, కాని వారు తమ కదలికలను ప్లాన్ చేయడానికి కొంతకాలం మార్కెట్ పోకడలను కూడా గమనిస్తార. ట్రేడింగ్ మొదటి గంటలో ట్రేడ్ చేయకండి; ఈ సమయం మార్కెట్ మరింత అస్థిరంగా ఉంటుంది. ఓపెనింగ్ రేంజ్ గురించి మీరు సరైన ఆలోచనను పొందిన తర్వాత ట్రేడింగ్ ప్రారంభించండి.