దీర్ఘకాల ప్రయోజనాల కోసం మ్యూచువల్ ఫండ్ మధనం మంచిదా

మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని తిరిగి సమలేఖనం చేయడానికి మీకు ఉత్సాహం అనిపిస్తే, మీరు ఒంటరిగా లేరు. మ్యూచువల్ ఫండ్స్ ను మార్పు చేసే ప్రక్రియను సాధారణంగా ‘మధనం’ అని పిలుస్తారు. మీ ప్రస్తుత పెట్టుబడులను తిరిగి సమలేఖనం చేయడానికి మధనం సహాయపడినప్పటికి, నిపుణులు సాధారణంగా పెట్టుబడిదారులను ఎక్కువగా మధనం చేయకుండా నిరుత్సాహపరుస్తారు. ఈ వ్యాసంలో, మధనం అంటే ఏమిటి మరియు అది మీ పెట్టుబడి వ్యూహాన్ని ఎలా ప్రభావితం చేయగలదో మేము చర్చిస్తాము.

మధనం అంటే ఏమిటి?

మధనం అనేది వినియోగదారుల అకౌంట్ లలో అధికంగా ట్రేడ్ చేయడాన్ని సూచిస్తుంది, దీనిని తరచుగా అనైతిక బ్రోకర్లు ఆచరిస్తారు. వారు తమ కమీషన్‌ ను పెంచడానికి పెట్టుబడిదారుల లక్ష్యాలతో సరిపడని పేలవమైన-పెట్టుబడిని నెట్టివేస్తారు. ఈ ప్రక్రియ బ్రోకర్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది, అయితే ఇది పెట్టుబడిదారుడికి పెట్టుబడి ఖర్చులను పెంచుతుంది మరియు వారి రాబడిని తగ్గిస్తుంది. కాబట్టి, పెట్టుబడిదారునికి సహాయపడని ఏదైనా ట్రేడింగ్ ఉంటే అది మధనం.

మీరు బ్రోకర్ ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు, వారు తరచూ మీకు వివిధ పెట్టుబడి పథకాలను సిఫారసు చేయవచ్చు. కానీ వారు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వాలి మరియు మెరుగైన రాబడులను పొందడంలో మీకు సహాయపడాలి. బ్రోకర్లు సూచనలు చేయడానికి ముందు మీ పెట్టుబడి లక్ష్యాలను గుర్తించడానికి బ్రోకర్లు విధిగా ఉండాలి.

పెట్టుబడిదారునిగా మధనం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

మ్యూచువల్ ఫండ్‌ లు పోర్ట్‌ఫోలియో వైవిధ్యం కోసం సులభమైన ఎంపికలను అందిస్తాయి. అయితే ఇందులో ఖర్చులు కూడా ఉంటాయి. ఫండ్స్ ను కొనుగోలు చేయడానికి ఖర్చులు మరియు కొన్ని సందర్భాల్లో నిష్క్రమణ లోడ్ ఉంటాయి. పెట్టుబడిదారులు నిర్దేశించిన ఖర్చులు మరియు వ్యయ నిష్పత్తులను కూడా భరించాలి. ఈ రుసుములు రాబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పెట్టుబడిదారులు రుసుములు చెల్లించకుండా ఉండలేరు, కానీ మొత్తం ఖర్చులను తగ్గించడానికి వారు ఈ ఖర్చులను హేతుబద్ధం చేయవచ్చు. చాలా తరచుగా మార్పు చేయడాన్ని నివారించడం ఒక పద్ధతి. మంచి రాబడుల కోసం ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టడానికి సిఫార్సు చేయబడిన పద్ధతికి వ్యతిరేకంగా మధనం ఉంటుంది.

మధనం ప్రభావం

మీరు తరచుగా మధనం చేయాలా వద్దా అనేది మీ పెట్టుబడిదారుని వ్యక్తిత్వంపై ఆధారాపడే నిర్ణయం. అయితే మీ రాబడులపై ప్రభావం చూపడం నేర్చుకోవడం మంచి నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుంది. ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని లెక్కలతో కూడిన ఒక సాధారణ వ్యాయామం.

మొదట వ్యాయామం కోసం ప్రాథమిక నియమాలను ఏర్పాటు చేద్దాం.

పెట్టుబడి మొత్తం

ప్రారంభించడానికి ముందు, పెట్టుబడి మొత్తం మరియు వ్యవధిని నిర్ణయించాలి. ఐదేళ్లపాటు రూ. 100,000 పెట్టుబడి పెట్టడం అనుకోండి.

అంచనాలను ఏర్పాటు చేయండి

పెట్టుబడి నుండి మీ రాబడి అంచనాను ఏర్పాటు చేయండి. ఈ దృష్టాంతంలో, ఇది 15 శాతం అని అనుకుందాం.

నిష్క్రమణ లోడ్ రుసుములను లెక్కించండి

మీరు ఒక పెట్టుబడి నుండి మరొక పెట్టుబడికి ఫండ్స్ తరలించడానికి ప్రయత్నించినప్పుడు మీరు నిష్క్రమణ లోడ్ రుసుములను భరించాల్సి ఉంటుంది. ఇది 1 శాతం అనుకుందాం.

ఫలితాలను సరిపోల్చడానికి మనం రెండు పరిస్థితులను పరిశీలిస్తాము.

పెట్టుబడిదారుడు ఐదేళ్లపాటు ఒకే పెట్టుబడిలో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అతనికి రూ. 100 (1 శాతం) లావాదేవీ ఖర్చు అవుతుంది. పెట్టుబడి వ్యవధి ముగింపులో, పోర్ట్‌ఫోలియో రూ. 200,935 రాబడిని పొందుతుంది.

ఇప్పుడు పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం తన పెట్టుబడులను మధనం చేసి మరియు ప్రతి మధనం కోసం ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితిని ఊహించుకుందాం. మిగిలినవి అన్నీ అలాగే ఉంటే, పెట్టుబడిదారుడు పదవీకాలం ముగిసే సమయానికి రూ. 192,425 రాబడి పొందుతాడు.

పైన పేర్కొన్న ఉదాహరణ తుది రాబడులపై ప్రభావం చూపుతుంది. పెట్టుబడిదారు తన ఫండ్స్ ను మార్పు చేయనప్పుడు ఎక్కువ రాబడిని పొందుతాడు. అయితే, ఇది ఊహాజనిత దృష్టాంతం మాత్రమే. వాస్తవానికి, వివిధ పెట్టుబడుల నుండి రాబడి మారుతుంది మరియు నిష్క్రమణ లోడ్ రుసుములు కూడా మారుతూ ఉంటాయి.

కొన్నిసార్లు మార్కెట్ అస్థిరత పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ ఫండ్స్ ను మధనం చేయడానికి  ప్రలోభ పడతారు.

అస్థిరత మధనం

మార్కెట్ అస్థిరత పెరిగినప్పుడు, ఒకరి పెట్టుబడులను కాపాడటానికి మధనం ఒక ఎంపిక అవుతుంది. ఎక్కువగా అస్థిరత ఉండే కాలంలో, మార్కెట్ తరచుగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో టర్నోవర్ నిష్పత్తిలో పెరుగుదలను నమోదు చేస్తుంది, ఇది సగటు నికర ఆస్తులకు వ్యతిరేకంగా కొనుగోలు చేయబడిన మరియు అమ్మిన కనీస సెక్యూరిటీ ల నిష్పత్తి.

మీ నిర్ణయాన్ని నియంత్రించే కొన్ని అంశాలు.

– మీ పోర్ట్‌ఫోలియోలో ఆదర్శ రుణ-ఈక్విటీ నిష్పత్తిని పరిశీలించడం

– చురుకైన లేదా నిష్క్రియాత్మక పెట్టుబడిదారుగా ఉండాలా

– మీ రిస్క్ ఆకలి

దీర్ఘకాలిక పన్ను చిక్కులు

ప్రభుత్వం సంవత్సరానికి రూ. 100,000 కంటే ఎక్కువ రాబడి మొత్తంపై 10 శాతం LTCG పన్నును ప్రవేశపెట్టినందున, అనేక మంది పెట్టుబడిదారులు పన్ను చెల్లించకుండా ఉండటానికి ఫండ్స్ ను మధింపు చేస్తారు. కానీ ఇది ఖర్చులను కూడా కలిగి ఉంటుంది కాబట్టి, ఇది పెట్టుబడి నుండి దీర్ఘకాలిక లాభాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ పన్ను ఆదా చేయడం అనేది మీ లక్ష్యం అయితే, దీర్ఘకాలిక లాభం లేదా పన్ను ఆదా ఏది మీ ప్రాధాన్యత అని ఆలోచించండి. మధనం పన్నును నివారించడంలో సహాయపడవచ్చు కానీ అదే సమయంలో తక్కువ లాభానికి వ్యయాన్ని పెంచుతుంది.

ముగింపు

దీర్ఘకాల పెట్టుబడుల యొక్క అత్యంత ప్రబలమైన సిద్ధాంతానికి వ్యతిరేకంగా మధనం నిలుస్తుంది. మారుతున్న ప్రాధాన్యతలు, స్థూల ఆర్థిక కారకాలు లేదా పన్ను రేట్ల ఆధారంగా పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియో లను తిరిగి సమతుల్యం చేసుకోవడాన్ని పరిగణించవచ్చు, కానీ ఇది ఎల్లప్పుడూ తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఎవరైనా స్వల్పకాలిక ప్రయోజనాలను విస్మరించి, దీర్ఘకాలిక లాభాలపై దృష్టి పెట్టగలిగితే, రాబడి ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది.