ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా, ఎఫ్&ఓ అత్యధికంగా అమ్ముడవుతున్న స్టాక్ విభాగాన్ని సూచిస్తుంది. ట్రేడర్స్ స్టాక్ యొక్క వాస్తవ ధరలో కొంత భాగాన్ని మాత్రమే చెల్లించాలనే ఆలోచనను ఇష్టపడతారు. మీ రిస్క్ ఎలా తగ్గించాలో మీరు అర్థం చేసుకున్న తర్వాత, ఎఫ్&ఓ ఒక ప్రతిఫలమిచ్చే పెట్టుబడి ఎంపికగా ప్రమాణీకరించే చాలామంది పెట్టుబడిదారులతో మీరు చేరవచ్చు.
ఎఫ్&ఓ స్టాక్స్ అంటే ఏమిటి?
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ స్టాక్స్, ఎఫ్&ఓ స్టాక్స్ అని సంక్షిప్తీకరించబడ్డాయి, ఇవి డెరివేటివ్స్ వర్గంలోకి వస్తాయి. దీని అర్థం వాటికి ఏ స్వతంత్ర విలువ లేదని, కానీ ఒక ఇవ్వబడిన తేదీ నాటికి ఎంచుకున్న స్టాక్ యొక్క స్టాక్ ధర నుండి వాటి విలువను పొందవచ్చు. ఉదాహరణకు, ఫ్యూచర్లో స్టాక్ ఈరోజు రూ 1000 విలువ కలిగి ఉండి మరియు మార్చి 2020 నాటికి దాని విలువ రూ 1200 కలిగి ఉంటుందని మీరు భావించినట్లైతే, మీరు స్టాక్ లో రూ 1000 తో ఫ్యూచర్ ఒప్పందాన్ని (100 షేర్ల కోసం) కొనుగోలు చేయడానికి నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఊహించిన విధంగా రూ.1200 కు ధర పెరిగితే, అప్పుడు మీరు మీ ఫ్యూచర్ ఒప్పందంపై రూ 20,000 సంపాదించి ఉంటారు. విషయం ఏంటంటే మీరు ఎంచుకున్న అమ్మకం లేదా కొనుగోలు, ఒప్పంద వ్యవధిలో తప్పనిసరిగా జరుగుతుంది.
ఆప్షన్స్ విషయానికి వస్తే, ఫ్యూచర్స్ విధంగానే అన్నీ ఉంటాయి, కాని కొనుగోలు చేయడానికి (కాల్ ఆప్షన్ గా సూచించబడుతుంది) ఎటువంటి నిర్బంధం ఉండదు. ఆప్షన్స్ సురక్షితమైనవి కానీ ప్రవీణులైన ఎఫ్&ఓ ట్రేడర్స్ ప్రకారం తక్కువ లాభదాయకమైన ఎంపిక.
నా మొదటి కదలిక నేను ఎలా చేయగలను?
ఎఫ్&ఓ స్టాక్స్ లో ట్రేడింగ్ ప్రారంభించడానికి మీకు ఒక డిమాట్ అకౌంట్ అవసరం లేదు. మీ ప్రారంభ మార్జిన్‌ను విశ్వసనీయమైన, బాగా-అనుభవజ్ఞులైన బ్రోకర్ లేదా ఏంజెల్ బ్రోకింగ్ వంటి ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ తో ఉంచడానికి మీరు కేవలం ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవవలసి ఉంటుంది.
ప్రారంభ మార్జిన్‌కు ఏమి జరుగుతుంది? అది ఎంతకాలం పాటు ముడిపడి వుంటుంది?
ప్రారంభ మార్జిన్ మీ ఎఫ్&ఓ ఒప్పందానికి అనుసంధానించబడుతుంది. ఏంజెల్ బ్రోకింగ్ ఎఫ్&ఓ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ పై అందుబాటులో ఉన్న ఒప్పందాలు సాధారణంగా ఒక నెల, రెండు-నెలల మరియు మూడు-నెలల వ్యవధి కోసం అందుబాటులో ఉంటాయి.
ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో వర్తకం చేయడానికి ఒక కొత్తవాడినైన నేను ఏమి తెలుసుకోవాలి?
– ముందుగానే కొనుగోలు చేయండి: బిగినర్స్ తరచుగా డెరివేటివిస్ ను ఆఖరి తేదీకి దగ్గరగా, అంటే ఈ సందర్భంలో ఫలితాలు ప్రకటించిన రోజు, కొనుగోలు చేసి తప్పు చేస్తారు. ఏదేమైనా, ఈ అస్థిర కాలంలో కొనుగోలు చేసిన ఒప్పందాలపై మీరు ఒక్కో షేరుకు ఎక్కువ ధర చెల్లిస్తారు, కాబట్టి ధరలు తగ్గినప్పుడు ముందుగా కొనడం ఉత్తమం. ఏంజెల్ బ్రోకింగ్ ఎఫ్&ఓ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ పై కనీసం ఒక నెల కోసం అందుబాటులో ఉండే ఫ్యూచర్స్ ఒప్పందాలను కొనుగోలు చేయడం మంచిది.
– కాంట్రాక్ట్ వ్యవధి: కాంట్రాక్ట్ వ్యవధి: మీ ఒప్పందం యొక్క గడువు తేదీ ఒప్పందం నెల చివరి గురువారం. మీ ఒప్పందం వ్యవధిలో మీరు ఎప్పుడైనా మీ స్థానాన్ని మూసివేయకపోతే లేదా మీ లాభాలను ఉపసంహరించుకోకపోతే (డెరివేటివ్ ట్రేడర్స్ దీనిని స్క్వేరింగ్ ఆఫ్ అని పిలుస్తారు), మీ ఒప్పందం సహజంగా ముగుస్తుంది మరియు మీ లాభాల గురించి మీ బ్రోకర్ మీకు తెలియజేస్తారు.
– మీ ఖర్చులు, లాభాలు మరియు నష్టాలను ట్రాక్ చేస్తూ ఉండండి: మీ లాభాలకు వ్యతిరేకంగా బ్రోకరేజ్ మరియు జి.ఎస్.టి., స్టాంప్ డ్యూటీ వంటి ప్రభుత్వ-విధింపబడే ఛార్జీలను ఖచ్చితంగా లెక్క వేసుకోని మీరు నిజంగా లాభాలు పొందుతున్నారని నిర్ధారించుకోండి. లాభాలు మరియు నష్టాలకు ఒక జర్నల్ నిర్వహించండి, లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ఎప్పుడు ఉపసంహరించుకోవాలో తెలుసుకోండి.
– సురక్షితంగా ఆడండి: డెరివేటివ్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు పెద్ద మొత్తాలను సంపాదించవచ్చు కాని ప్రారంభంలో చిన్న మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది, ఎందుకంటే స్టాక్ ధర మీరు అంచనా వేసిన దిశలో వెళ్ళకపోతే మీరు కూడా సమానమైన మొత్తాన్ని కోల్పోతారు.
– కొనుగోలుదారు వెర్సస్ అమ్మకందారు: ఏంజెల్ బ్రోకింగ్ ఎఫ్&ఓ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ లో ఫ్యూచర్స్ కాంట్రాక్టును రూ. 9000 కు నిషా అమ్ముతుంది, యష్ కొనుగోలు చేసారు, ఫలితాలు ప్రకటించినప్పుడు, స్టాక్ విలువ 10,000. కాబట్టి యష్ షేరుకు 1000 లాభం సాధించగా, నిషా షేరుకు 1000 రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆప్షన్స్ విషయంలో ఈ కొనుగోలుదారు-అమ్మకందారు సమీకరణం తీవ్రంగా మారుతుంది, ఇక్కడ కొనుగోలుదారు యొక్క నష్టాన్ని చెల్లించిన ప్రీమియం వరకే ఉంటుంది, కానీ అమ్మకందారు యొక్క రిస్క్ అపరిమితంగా ఉంటుంది.
– మీవద్ద తగినంత డబ్బులు ఉన్నాయా? ఫలితాలను ప్రకటించడానికి ముందు గరిష్ట అస్థిరత కాలంలో, స్టాక్స్ పై మార్జిన్లు గణనీయంగా పెరుగుతాయి. మీరు 10% మార్జిన్ ఉండవచ్చునని పందెం వేయవచ్చు కానీ నేడు మార్జిన్లు 30% ఉంటాయి. మీ మార్జిన్లను పెంచడానికి మీ బ్రోకర్ మిమ్మల్ని కాల్ చేయవచ్చు – ప్రత్యామ్నాయంగా మీ షేర్ల సంఖ్య (లేదా పొజిషన్స్) విస్తరించబడిన మార్జిన్లకు వసతి కల్పించడానికి తగ్గుతాయి.
– ఎఫ్&ఓ నిషేధం: స్టాక్ ఎక్స్చేంజ్ కొన్నిసార్లు ఎఫ్&ఓ పై నిషేదాన్ని విధిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి ఎఫ్&ఓ కదలికలు చేయకపోవడం అత్యవసరం, అటువంటి ఉల్లంఘన కై మీకు రూ. 100,000 వరకు జరిమానా విధించవచ్చు.
ఒక బ్రోకర్ చట్టబద్ధమైనది అని నేను ఎలా తెలుసుకోగలను?
బ్రోకర్ తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజిలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఏంజెల్ బ్రోకింగ్ అనేది ఎన్ఎస్ఇ ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్ మరియు బిఎస్ఇ డెరివేటివ్స్ సెగ్మెంట్ యొక్క ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ సభ్యుడు.
ముగింపు: ఎఫ్&ఓ స్టాక్స్ లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక, అయితే మీరు అవకాశాన్ని అర్థం చేసుకుని మరియు రికార్డులను నిర్వహించడానికి మరియు మీ పొజిషన్స్ ను ఆసక్తిగా గమనించడానికి అవసరమైన సమయం మరియు శ్రద్ధ-పరిశీలన-వివరాలను కలిగి ఉండాలి.