స్టాక్స్ కోసం స్థాన పరిమాణం కాలిక్యులేటర్

పరిమాణం ముఖ్యం మరియు సరైన పరిమాణం మరింత ముఖ్యమైనది. స్టాక్స్ కోసం స్థాన పరిమాణం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి? చాలా మంది ఆర్థిక విశ్లేషకులు ఇప్పుడు చెప్పేది, ఒక పెట్టుబడిదారుడి కోసం, ఒక స్టాక్ యొక్క సరైన స్థాన పరిమాణం, అంటే మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్ లేదా సెక్యూరిటీ యొక్క షేర్ల సంఖ్య, వారు ట్రేడింగ్ లో ప్రవేశించే లేదా నిష్క్రమించే ధరల స్థాయిల కంటే చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా రోజువారి  ట్రేడింగ్‌లో. కారణం సాధారమైనది.

పరిమాణం రిస్క్ ని నిర్ణయిస్తుంది

మీ స్థాన పరిమాణం చాలా పరిమితం అయినా లేదా చాలా విస్తృతమైనది  అయినా, మీరు చాలా రిస్క్ లను తీసుకోవలసి ఉంటుంది లేదా ట్రేడింగ్ నుండి కావలసినంత లాభం పొందలేకపోవచ్చు. అంతేకాక, మీ వద్ద ఉన్న షేర్ల సంఖ్య అనుకూలమైన ఒప్పందానికి చాలా ప్రాథమికమైనది. మీ పందెం సరైనది అయినప్పటికీ, మీకు తగినంత షేర్లు లేకపోయినా, మీరు ఓడిపోతారు. కాబట్టి మీకు స్థాన పరిమాణ కాలిక్యులేటర్ అవసరం.

తగిన స్థాన పరిమాణం కుదర్చడం ద్వారా రెండు రకాల రిస్క్ లను నియంత్రించాలి  -ట్రేడ్ మరియు అకౌంట్ రిస్క్ లను.

అకౌంట్ రిస్క్ పరిమితి అంటే ఏమిటి?

ఇక్కడ, ప్రతి ట్రేడ్ కి, మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న రిస్క్ పరిమితిగా శాతాన్ని లేదా నిర్దిష్ట మొత్తాన్ని కుదురుస్తారు. కాబట్టి, ఉదాహరణకు, మీరు శాతం రిస్క్ పరిమితిని 1% గా నిర్ణయించి, మీ రోజువారి  ట్రేడింగ్ అకౌంట్లో రూ.50,000 ఉంటే, అప్పుడు మీరు ప్రతి ట్రేడ్‌కు రూ.500 వరకు రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అకౌంట్ రిస్క్ పరిమితిని మార్చకుండా ఉండాలని మరియు అన్ని ఒప్పందాలకు సమానంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రేడ్ రిస్క్ లో ఏమి కలిగి ఉంటుంది?

ట్రేడ్ రిస్క్ అనేది ట్రేడ్ లో మీ ప్రవేశ స్థానం మరియు మీ స్టాప్-లాస్ స్థాయిల మధ్య ఉన్న బ్యాండ్. మీరు ఒక నిర్దిష్ట ధర వద్ద స్టాప్ లాస్ ఏర్పాటు చేసినప్పుడు, ధరలు స్టాప్ లాస్ స్థాయిని ఉల్లంఘించినప్పుడు, స్టాప్ లాస్ ప్రేరేపించబడుతుంది మరియు మీ స్థానం తుంచబడుతుంది. సరైన స్థాన పరిమాణాన్ని కుదర్చడంలో ఇది చాలా ముఖ్యం ఎందుకంటే స్టాప్ లాస్ ని ఎంట్రీ పాయింట్‌కు దగ్గరగా ఉంచినట్లయితే, ధరలు కోలుకున్నప్పుడు మీరు లాభాల అవకాశాలను కోల్పోతారు. స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ నుండి చాలా దూరంగా ఉంచబడితే, ధరలు త్వరగా కోలుకోలేవని మీరు గ్రహించే లోపే మీరు చాలా డబ్బును కోల్పోవచ్చు.

ట్రేడ్ కోసం ఆదర్శ స్థాన పరిమాణం

మీ ట్రేడ్ రిస్క్ ను, డబ్బు రిస్క్ లేదా అకౌంట్ రిస్క్ పరిమితితో విభజించడం ద్వారా ట్రేడింగ్ కి అనువైన స్థాన పరిమాణం నిర్ణయించబడుతుంది.

ట్రేడ్ కి అనువైన స్థాన పరిమాణం = అకౌంట్ రిస్క్ పరిమితి / ట్రేడ్ రిస్క్ మొత్తం

మొదటి విభాగంలో మనం పరిగణించిన ఉదాహరణను తీసుకుంటూ,

మొత్తం అకౌంట్ పరిమాణం రూ. 50,000, మరియు మీరు ట్రేడ్‌కు అకౌంట్ రిస్క్ పరిమితిని 1% గా నిర్ణయించారు. అంటే, ట్రేడింగ్ కి రూ.500 మీ డబ్బు రిస్క్ లో ఉంది.

ఇప్పుడు స్టాక్ XYZ కోసం అనుకుందాం, మీరు ట్రేడ్‌లోకి రూ.30 వద్ద ప్రవేశించారు, మరియు మీరు స్టాప్ లాస్‌ను రూ.20 వద్ద ఏర్పాటు చేసారు, అప్పుడు మీ మొత్తం ట్రేడ్ రిస్క్ రూ.10.

కాబట్టి, ట్రేడింగ్ కి అనువైన స్థాన పరిమాణం: 500/10

అది 50. కాబట్టి మీ రిస్క్ ఆకలిని బట్టి మీ ఆదర్శ స్థాన పరిమాణం లేదా సెక్యూరిటీ XYZ యొక్క షేర్ల సంఖ్య 50 కావచ్చు.

ముగింపు:

కొనుగోలు లేదా అమ్మే స్థాయిల అంత ఎక్కువ ముఖ్యం కాకపోయినా, మీ ట్రేడింగ్ స్థాన పరిమాణం కూడా ముఖ్యమే. ఒక ఒప్పందం నుండి పూర్తిగా లాభం పొందడానికి, మీ మొత్తం స్టాక్స్ లో ఒక కంపెనీ యొక్క స్టాక్ ఎంత ఉంటే సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం.