మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ప్రముఖ పదజాలం గురించి తెలుసుకోవాలి. మీరు స్టాక్స్ కొనుగోలు చేసినప్పుడు, నిర్ణయించబడిన సెటిల్మెంట్ వ్యవధిలోపు మీ డీమాట్ అకౌంట్లో బదిలీ చేయబడతాయి. కానీ సెటిల్మెంట్ ఆలస్యం అయితే, లేదా మీ కొనుగోలు ఆర్డర్ నెరవేర్చబడకపోతే ఏమి జరుగుతుంది? అయితే, బై -ఇన్ స్టాక్స్ రూపంలో ఒక పరిష్కారం అందుబాటులో ఉంది. బై -ఇన్ స్టాక్స్ అంటే ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? విక్రేత సమయంలోపు స్టాక్స్ డెలివరీ చేయలేకపోయినా లేదా మొత్తానికి డెలివరీ చేయలేకపోయినా, కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇది ఒక పరిష్కారం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (NYSE) వంటి గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో, బై–ఇన్ ప్రక్రియలో భాగంగా, కొనుగోలు పార్టీ మూడవ–పార్టీ లేదా ఒక బై–ఇన్ ఏజెంట్ కి సూచిస్తూ స్టాక్స్ కొనుగోలు మరియు డెలివరీ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ నిర్వహించడం ద్వారా అసలు లావాదేవీను భర్తీ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఒక బై–ఇన్ నోటీసు జారీ చేసిన తర్వాత, మరొక విక్రేత నుండి తిరిగి కొనుగోలు చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్ నేరుగా అనుమతించవచ్చు.
అయితే, భారతీయ సందర్భంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) బై -ఇన్ స్టాక్ వేలం యొక్క ప్రత్యామ్నాయ ప్రక్రియను అనుసరిస్తుంది, ఇక్కడ ఎక్స్ఛేంజ్ స్టాక్స్ ను మూడవ పార్టీలకు అత్యంత పోటీ రేటుతో వేలం వేస్తుంది.
బై-ఇన్ స్టాక్స్ నిర్వచనం సందర్భంలో ధర వ్యత్యాస సెటిల్‌మెంట్ అర్థం చేసుకోవడం: అసలు ట్రాన్సాక్షన్ ధర మరియు బై-ఇన్ కొనుగోలు (రెండవ ట్రాన్సాక్షన్ లేదా రీ-పర్చేజ్) మధ్య ధర వ్యత్యాసం ఈ క్రింది పద్ధతిలో విక్రయ మరియు కొనుగోలు పార్టీల మధ్య సెటిల్ చేయబడుతుంది:
రెండవ లావాదేవీ/తిరిగి కొనుగోలు ధర అసలు లావాదేవీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బై-ఇన్ స్టాక్స్ నిర్వచనం: అసలు మరియు రెండవ లావాదేవీల మధ్య నిర్దిష్ట స్టాక్ ధర పెరిగిన పరిస్థితి ఉండవచ్చు. ఈ సందర్భంలో విక్రయ పార్టీ ఖర్చు వ్యత్యాసాన్ని చెల్లించడం ద్వారా కొనుగోలుదారునికి పరిహారం ఇస్తుంది.
రెండవ లావాదేవీ/తిరిగి కొనుగోలు ధర అసలు లావాదేవీ కంటే తక్కువగా ఉన్నప్పుడు బై-ఇన్ స్టాక్స్ నిర్వచనం: అసలు లావాదేవీ తేదీ నుండి నిర్దిష్ట స్టాక్ యొక్క మార్కెట్ ధర పడిపోయి కూడా ఉండవచ్చు. అసలు లావాదేవీ ధర కంటే కొనుగోలు ధర తక్కువగా ఉంటే, క్యాష్ చెల్లింపులు ఎదురుగా ఉన్న దిశలో తరలించబడతాయి. అంటే కొనుగోలు పార్టీ ఇప్పుడు విక్రేతకు ఖర్చు వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది.
NSE మరియు BSE సందర్భంలో బై-ఇన్ స్టాక్స్ నిర్వచనం: రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు టి+2 (ట్రేడింగ్ +2) రోలింగ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను అనుసరిస్తాయి, ఇక్కడ ఒక నిర్దిష్ట రోజు చేసిన ట్రేడింగ్ లావాదేవీలు రెండు పని రోజుల్లోపు సెటిల్ చేయబడతాయి. డెలివరీ విఫలమైన సందర్భంలో, లేదా తక్కువ డెలివరీలు జరిగిన సందర్భంలో, స్టాక్ ఎక్స్చేంజ్లు బై-ఇన్ స్టాక్ వేలం అందిస్తాయి. వేలం T+2 రోజున మాత్రమే నిర్వహించబడుతుంది, అయితే వేలం సెటిల్‌మెంట్ మూడవ (T+3) పని రోజున చేయబడుతుంది.
బై-ఇన్ స్టాక్ వేలం యొక్క ప్రయోజనాలు బై-ఇన్ ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్ సందర్భంలో: మూడవ-పార్టీ ఏజెంట్ల నియామకంతో పోలిస్తే బై-ఇన్ స్టాక్ వేలం యొక్క ప్రయోజనం ఏంటంటే వేలం ప్రక్రియ క్రమబద్దీకరించబడుతుంది మరియు ఆటోమేట్ చేయబడుతుంది. మొత్తం ప్రక్రియ పారదర్శకమైనదిగా అవ్వడమే కాకుండా, మార్కెట్‌లో మరింత ద్రవ్యతను అనుమతిస్తుంది. అసలు కొనుగోలుదారుడు కూడా అత్యంత ప్రయోజనకరమైన ధరను అందుకుంటారు. బై-ఇన్ ఏజెంట్ మోడల్ తీవ్రమైనది మరియు ఎక్కువ సమయాన్ని వినియోగిస్తుంది. అంతేకాకుండా, ఒక ఏజెంట్ గా పనిచేయడానికి చట్టపరమైన బాధ్యత ఏదీ లేనందున ఒక ఏజెంట్‌ను కనుగొనడం కష్టంగా ఉండవచ్చు.
బై-ఇన్ స్టాక్ వేలం యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడం: ఒకసారి సంబంధిత స్టాక్ మార్కెట్ వేలం గురించి తెలియపరచిన తరువాత, డీలర్లు మరియు బ్రోకర్లు తమ విక్రయించిన స్టాక్స్ కొరకు బిడ్స్ ఉంచడం ద్వారా పాల్గొంటారు. విజయవంతమైన వేలం విషయంలో, డెలివరీలో వైఫ్యల్యం చేసిన ట్రేడర్ బ్రోకరేజ్ ఛార్జీలతో పాటు వాస్తవ వేలం ధరను చెల్లించవలసి ఉంటుంది. జరిమానా కూడా ఛార్జ్ చేయబడవచ్చు. అయితే, వేలం విజయవంతం కాకపోతే, అసలు కొనుగోలు ట్రేడర్ పూర్తి వాపసు పొందుతారు. ఇప్పుడు అసలు వైఫ్యల్యం చేసిన ట్రేడర్ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే అది చెల్లించవలసి ఉంటుంది: ట్రేడింగ్ రోజు నుండి అత్యధికంగా ఉన్న మార్కెట్ ధర లేదా మునుపటి ట్రేడింగ్ రోజున స్టాక్ యొక్క ముగింపు మార్కెట్ ధరలో 20% పైన.
ముగింపు
అందువల్ల, స్టాక్ మార్కెట్లలో మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు, బై-ఇన్ స్టాక్స్ వంటి కీలక పదజాలాన్ని తెలుసుకోవడం ముఖ్యం. అలాగే, ఒక విశ్వసనీయమైన మరియు నమ్మదగిన బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవడం కూడా ముఖ్యం. ఒక విశ్వసనీయ ఆర్థిక భాగస్వామితో, స్టాక్ కొనుగోలు చేయడం వంటి మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీరు సమగ్ర మార్కెట్ నివేదికలు మరియు తాజా స్టాక్ అప్‌డేట్లను పొందుతారు. అత్యాధునిక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు 2-ఇన్ 1 డీమాట్ కమ్ ట్రేడింగ్ అకౌంట్ వంటి లక్షణాల కోసం చూడండి.