షేర్ మార్కెట్ అనేది ఒక వేగవంతమైన ప్రదేశం, ఇక్కడ మార్కెట్ గంటల్లో ఏదైనా ఇచ్చిన సమయంలో అనేక వాటాదారులు వ్యాపారం చేస్తూఉంటారు. మీరు రోజు మొత్తంలో బహుళ సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని లేదా అమ్మడానికి చూస్తున్న ఒక ట్రేడర్ అయితే, స్టాక్ ధరలను ట్రాక్ చేయుట మరియు తదనుగుణంగా కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చాలా గందరగోళంగా ఉండవచ్చు. దీనిని ఎదుర్కోవడానికి, మీరు ఒక ఐఒసి ఆర్డర్ ఉంచవచ్చు అనగా షేర్ మార్కెట్లో తక్షణమే లేదా ఆర్డర్ను రద్దు చేయుట.
షేర్ మార్కెట్లో ఐఒసి అంటే ఏమిటి?
ఒక పెట్టుబడిదారుడు లేదా ట్రేడర్ షేర్ మార్కెట్లో ప్రారంభించగల అనేక రకాల ‘ఆర్డర్లు‘ లో ఐఒసి ఒకటి. ఆర్డర్ మార్కెట్లోకి విడుదల అయిన వెంటనే, అది అమలు చేయబడాలి అని ఆర్డర్ పేర్కొంటుంది. అంటే సెక్యూరిటీను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం దాదాపు వెంటనే జరుగుతుంది, మరియు అది కాకపోతే, ఆర్డర్ రద్దు చేయబడుతుంది మరియు మీరు ఇకపై దానిని పెండింగ్లో ఉన్న ఆర్డర్ గా కలిగి ఉంచనక్కర్లేదు. ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దు చేయబడుతుంది మరియు పెట్టుబడిదారుడు నుండి ఎటువంటి జోక్యం అవసరం లేదు.
ఐఒసి అనేది ఒక ‘వ్యవధి‘ ఆర్డర్, అంటే ఆర్డర్ మార్కెట్లో ఎంతకాలం సక్రియంగా ఉంటుందో పెట్టుబడిదారుడు నిర్ణయిస్తారు. ఐఓసి విషయానికి వస్తే, ఆర్డర్ మరియు దాని అమలు మధ్య కొన్ని సెకన్ల కాలవ్యవధి మాత్రమే ఉన్నందున అది ‘సున్నా వ్యవధి‘ ఆర్డర్.
మీరు ఒక ఐఒసి ఆర్డర్ను ఒక పరిమితి లేదా మార్కెట్ ఆర్డర్ గా సెట్ చేయవచ్చు. ఒక పరిమితి ఆర్డర్ అంటే అది ఒక నిర్దిష్ట ధర వద్ద ఉన్నప్పుడు మాత్రమే మీరు సెక్యూరిటీని విక్రయించగలరు / కొనుగోలు చేస్తారని అర్థం. ఒక మార్కెట్ ఆర్డర్ అంటే ప్రస్తుత ధర వద్ద ట్రేడ్ అమలు చేయబడిందని అర్థం.
ఉదాహరణకు, ఎక్స్వైజెడ్ కంపెనీ యొక్క 100 షేర్లను కొనుగోలు చేయడానికి మీరు ఒక ఐఒసి మార్కెట్ ఆర్డర్ను ఉంచారు. ఆర్డర్ వెంటనే మార్కెట్లోకి విడుదల చేయబడుతుంది. పూర్తి కాకపోతే ఆర్డర్ రద్దు చేయబడుతుంది. ఒకవేళ 10 షేర్లను మాత్రమే కొనుగోలు చేసి ఆర్డర్ పాక్షికంగా నెరవేరిన సందర్భంలో, మిగిలిన 90 షేర్ల కోసం ఆర్డర్ రద్దు చేయబడుతుంది.
ఐఒసి ఆర్డర్ ఎప్పుడు అత్యంత ఉపయోగకరమైనది?
ఇప్పుడు షేర్ మార్కెట్లో ఐఒసి అర్థం ఏమిటో మీకు తెలుసు కాబట్టి, మీరు ఒక ఐఒసి ఆర్డర్ ఎప్పుడు ఉపయోగించడం అనే దాని గురించి అర్థం చేసుకోవచ్చు.
ఐఒసి ఆర్డర్ జారీ చేయడానికి ఉత్తమ సమయం ఏంటంటే మీరు పెద్ద ఆర్డర్ చేయాలనుకుంటే అప్పుడు మరియు మార్కెట్లో ఎక్కువ కాలం పాటు ఉండటం ద్వారా మార్కెట్ ను ప్రభావితం చేయడం ఇష్టం లేనప్పుడు. పాక్షిక నెరవేర్పు షరతులు వలన ఐఒసి అనువైనది మరియు మార్కెట్ నుండి మీకు ఉత్తమమైనదాన్ని పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు మీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ నుండి ఒక ఐఒసిని త్వరగా జారీ చేయవచ్చు. మీరు మీ ప్రోగ్రాంలో ఐఒసి ఆర్డర్ నిర్మించవచ్చు మరియు సమర్థవంతంగా ట్రేడ్ చేయవచ్చు. మీకు ట్రేడ్ చేయడానికి బహుళ సెక్యూరిటీలు ఉన్నప్పుడు కానీ ప్రతిదానిని పర్యవేక్షించడానికి సమయం మరియు ప్రయత్నం చేయలేనప్పుడు, మీరు నిర్దిష్ట సెక్యూరిటీల కోసం ఒక ఐఒసి ఆర్డర్ను సెట్ చేయవచ్చు.
ఒక రోజు ఆర్డర్ నుండి ఐఒసి ఎలా భిన్నంగా ఉంటుంది?
ఐఒసి ఆర్డర్ మరియు ఒక రోజు ఆర్డర్ మధ్య వ్యత్యాసం చాలా సులభం. ఒక రోజు ఆర్డర్ పూర్తి కాకపోతే ట్రేడింగ్ రోజు ముగింపులో ముగుస్తుంది; అయితే సెక్యూరిటీ యొక్క లభ్యత లేని వెంటనే ఐఒసి రద్దు చేయబడుతుంది.
మీరు ఇప్పుడు ఐఒసి ఆర్డర్ యొక్క ప్రాథమిక అవగాహనతో సలహా పొందారు. ఈ విశ్వాసంతో, మీరు మీ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ నుండి ట్రేడింగ్ ఆర్డర్లను జారీ చేసి మీ ఫైనాన్సులను నిర్మించుకోండి.