ఎల్లప్పుడూ రాబడులు ఇచ్చే స్టాక్ ను ఏ పెట్టుబడిదారుడు వద్దని అంటాడు? మల్టీబ్యాగర్ స్టాక్ అంటే సరిగ్గా అదే, ఒక పెట్టుబడిదారునిగా మీరు అదృష్టవంతులు అవుతారు ఒకవేళ మీరు అటువంటి స్టాక్స్ ఒకటి లేదా ఎక్కువ గుర్తించగలిగితే.
మల్టీబ్యాగర్ స్టాక్ అంటే ఏమిటి?
మొట్టమొదట సారి పీటర్ లించ్ తన పుస్తకం ‘ఒన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్‘ అనే దానిలో ‘మల్టీ బ్యాగర్‘ స్టాక్స్ అనే పదం ఉపయోగించారు, ఈ స్టాక్స్ పెట్టుబడిపై అనేక రెట్లు రాబడిని ఇచ్చే స్టాక్స్, అంటే, తక్కువ సమయంలో 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులు. ఉదాహరణకు ఒక స్టాక్ రెండు రెట్లు రాబడి ఇస్తే, అది ఒక టు–బ్యాగర్, అది మీకు మూడు రెట్లు రాబడి ఇస్తే అప్పుడు అది ఒక మూడు–బ్యాగర్ లేదా నాలుగు బ్యాగర్, ఆ మాదిరిగా. ఈ స్టాక్స్ గొప్ప ప్రాధమికలతో మరియు పెట్టుబడిదారులచే కనుగొనబడే అధిక వృద్ధి సామర్థ్యాలతో తక్కువ ధరలో ఉంటాయి.
కొంచెం రిస్క్ తీసుకుని తమ మూలధనాన్ని నిర్మించుకోవాలని చూసే పెట్టుబడిదారులు మల్టీబ్యాగర్స్ పై దృష్టి పెడతారు. కానీ విషయం ఏమిటంటే ఒక మల్టీబ్యాగర్ అది మల్టీబ్యాగర్ అయ్యిన తరువాతే తెలుస్తుంది అది మల్టీబ్యాగర్ అని. మొదటిలో, ఇది అతిగా ప్రేరేపించబడిన మార్కెట్ వాతావరణంలో ప్రమాదకర పనిలాగా కనిపించవచ్చు.
మల్టీబ్యాగర్స్ యొక్క ఉదాహరణలు
భారతదేశంలోని మల్టీబ్యాగర్స్ యొక్క ఉదాహరణలు, 2015 లో యూనిప్లై ఇండస్ట్రీస్ అనే ఒక స్టాక్ ఒక సంవత్సరంలో 1400 శాతం కంటే ఎక్కువ రాబడులు ఇచ్చింది, అంటే పదనాలుగు-బ్యాగర్. 2020 లో భారతీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని ప్రముఖ మల్టీబ్యాగర్లు ఏమిటంటే, పది సంవత్సరాల్లో 22,300 శాతం రాబడులు ఇచ్చిన క్యాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్; లా ఒపాల ఆర్జి, గత దశాబ్దంలో 4500 శాతం పెరిగింది; లేదా గత పది సంవత్సరాల్లో 2600 శాతం రాబడులు ఇచ్చిన గార్వేర్ టెక్నికల్ ఫైబర్లు.
మల్టీబ్యాగర్లను అంచనా వేయడంలో పెట్టుబడిదారులు జాగ్రత్త వహించి ఉండాలి. బేస్ ఎఫెక్ట్ మరియు అధిక వృద్ధి సామర్థ్యం వంటి అంశాలు మంచి పనితీరుకు బాధ్యత వహించవచ్చు. కానీ మల్టీబ్యాగర్స్ విషయంలో గత పనితీరు భవిష్యత్తు పనితీరుపై హామీ ఇవ్వలేదు.
మల్టీబ్యాగర్ స్టాక్స్ ను ఎలా గుర్తించాలి?
కంపెనీ బుక్స్ లో ఉన్న అప్పు
పెట్టుబడిదారులు కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ నిష్పత్తిపై ఒక దృష్టిని ఉంచవలసి ఉంటుంది. మూలధనం కన్నా అప్పులు ఎక్కువగా ఉండటంవలన భవిష్యత్తులో కంపెనీకు కార్యకలాపాల ప్రమాదాన్ని ఎదుర్కొనవచ్చును. డెట్ టు ఈక్విటీ నిష్పత్తి కూడా పరిశ్రమల మధ్య భిన్నంగా ఉంటుంది, కానీ నిపుణులు సలహా ఏమిటంటే, డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 0.3 మించకూడదు. అందుకు బదులుగా, మూలధనంపై స్థిరమైన రాబడులు పొందుతున్న కంపెనీల కోసం చూడండి. ఆవిష్కరణ లేదా ఆర్ఒసి పెరుగుదల లేకుండా ఒక్క మూలధనం ఎక్కువగా పెట్టడం వలన వచ్చిన అభివృద్ధి అయితే, భవిష్యత్తులో కంపెనీ వైఫల్యం పొందే అవకాశం ఉంటుంది.
ఆదాయ గుణకాలు చూడండి
కంపెనీ యొక్క ఆదాయ గుణకం అనేది, ఆదాయాలకు సంబంధించి దాని యొక్క ఈక్విటీ విలువ. ఒక కంపెనీకి తక్కువ ఆదాయ గుణకం ఉంటే, అది ఒక చవకైన ప్రతిపాదనగా పరిగణించబడుతుంది. ఇటువంటి కంపెనీకి బలమైన ప్రాధమికలు ఉంటే; ఇది వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తుంది.
PE నిష్పత్తులను అధ్యయనం చేయండి
మీరు కంపెనీ యొక్క ప్రస్తుత PE నిష్పత్తి పరిశీలిస్తే మల్టీబ్యాగర్ గుర్తించడంలో ఒక అడుగు దగ్గరగా వస్తారు. కంపెనీ యొక్క PE నిష్పత్తి అనేది, దాని షేర్ ధర మరియు ఒక షేర్ కు వచ్చే రాబడుల నిష్పత్తి. స్టాక్ ధర కంటే PE వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది మల్టీబ్యాగర్ యొక్క సూచికల్లో ఒకటి.
తక్కువగా విలువ కట్టిన స్టాక్లను చూడండి
తక్కువగా విలువ కట్టడం అనేది తప్పనిసరిగా చెడ్డ విషయం కాకపోవచ్చు. ఒకవేళ స్టాక్ అధిక విలువ కలిగి ఉంటే, పెట్టుబడి బుడగ పేలవచ్చు, మరియు పెట్టుబడిదారులు మూల్యాంకనల తగ్గింపుతో నిరాశ చెందవచ్చు. కానీ ఒక స్టాక్ తక్కువగా విలువ కట్టబడినట్లయితే మరియు కంపెనీకి మంచి ప్రాథమిక అంశాలు ఉన్నట్లయితే, భవిష్యత్తులో మూల్యాంకన సవరించబడవచ్చు మరియు పెట్టుబడిదారులు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.
ఒక బలమైన పరిశ్రమను ఎంచుకోండి
తదుపరి ఐదు నుండి పది సంవత్సరాల వరకు గణనీయంగా అభివృద్ధి చెందడానికి చూస్తున్న ఒక పరిశ్రమలో మల్టీ బ్యాగర్ ఎంచుకోండి. అభివృద్ధి పరంగా అధిక స్థానంలో ఉండి ఇంతకంటే ఎక్కువ అభివృద్ధికి కష్టం అనిపించే పరిశ్రమ లేదా పరిశ్రమకు బలమైన ఆర్థిక లేదా విధానాలలో అడ్డంకులు ఉన్నట్లయితే, అటువంటి పరిశ్రమలో మల్టీబ్యాగర్ ఎంచుకోవడం చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు.
ఒక బలమైన పోటీతత్వ ప్రయోజనం ఉన్న ఒక కంపెనీ కోసం చూడండి
వారెన్ బఫె ‘ఎకానమిక్ మోట్‘ అని పిలిచే, దీర్ఘకాలంలో లాభాలను పొందడానికి కంపెనీ చేత భద్రపరచబడిన పోటీ ప్రయోజనం ఉన్న కంపెనీ కోసం చూడండి. ఇది కంపెనీ యొక్క పోటీదారులపై వృద్ధి మరియు లాభదాయకతను పెంచుతుంది. ఇది గణనీయమైన అధిక మార్కెట్ వాటా, తక్కువ–ఖర్చు ఉత్పత్తి, కార్యకలాపాలు విస్తృతంగా పెంచబడే శక్తి, బలమైన బ్రాండ్ నాయకత్వం, పేటెంట్లు మరియు మేధో సంపత్తి, ఆర్ & డి పెట్టుబడులు, ఘన పంపిణీ నెట్వర్క్ మరియు విధానాలలో లోపాలు లేని కంపెనీ, ఇందులో ఏదైనా కావచ్చు.
సహనం కలిగి ఉండండి
పెట్టుబడిదారులు వారి పోర్ట్ఫోలియోలో మల్టీబ్యాగర్స్ కలిగి ఉండటం నుండి ప్రయోజనం పొందడానికి, వారు సహనం కలిగి ఉండవలసి ఉంటుంది. ధర ఎంత సమంజసనీయంగా ఉన్నప్పటికీ, మల్టీబ్యాగర్ లో స్వల్ప కాల వ్యవధి ట్రేడ్ చేస్తే ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి మరియు అధిక రాబడులు రాకపోవచ్చు. ఇటువంటి విజేతలను ఎక్కువ కాలం పట్టుకుని ఉంచడం అనేది ఒక మంచి ఆలోచన.
మేనేజ్మెంట్ చాలా ముఖ్యం
కంపెనీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, వారి నిర్వహణ పద్ధతులు, స్థిరత్వం, కంపెనీ కోసం దృష్టి, షేర్ హోల్డర్ మరియు డివిడెండ్ విధానాలు మరియు కార్పొరేట్ గవర్నెన్స్ చూడండి. ఆర్ధిక తిరోగమనం మరియు కంపెనీ కష్ట కాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో కంపెనీ ను జాగ్రత్తగా నడిపించినటువంటి మేనేజ్మెంట్ కోసం చూడండి. ఒక కంపెనీ తరచుగా దాని వ్యాపార నమూనాను మార్చినట్లయితే, అది పెట్టుబడిదారులకు ప్రమాదాన్ని సూచించవచ్చు.
ముగింపు:
కొన్ని మల్టీబ్యాగర్లు మీ పోర్ట్ఫోలియో యొక్క మొత్తం రాబడులను బాగా పెంచవచ్చు, కానీ ఒక విజేతని ఎంచుకోవడానికి వెనుక సాంకేతిక ధోరణి విశ్లేషణ మరియు పరిశోధన అవసరం మరియు మంచి ఫలితాలను ఇస్తాయి.