షేర్ అంటే ఏమిటి?
ఒక సంస్థ యొక్క మూలధనం షేర్లుగా విభజించబడింది. ప్రతీ షేరు ఒక యూనిట్ యాజమాన్యాయాన్ని సూచిస్తుంది. ఒక సంస్థ నిధులు సేకరించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ వాటాలు అమ్మకానికి ఇవ్వబడతాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక సంస్థ వ్యాపారులు లేదా పెట్టుబడిదారులకు కొనుగోలు చేయడానికి కొంత భాగాన్ని అందుబాటులోకి తేవడం. వివిధ ప్రయోజనాల కోసం అవసరమైన నిధులను అందుకున్నందున కంపెనీలు ఈ సాదకం నుండి ప్రయోజనం పొందుతాయి.
ప్రజలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- సంపద సృష్టించడం
- భవిష్యత్తు అవకాశాలు స్వంతం చేసుకోవడానికి
- పోర్ట్ఫోలియో వైవిధ్యం
- నష్ట్టాన్ని తగ్గించడం
- సులభంగా అందుబాటులో ఉన్న డబ్బు
- రిస్క్ లను ఎదుర్కోవడం
- డివిడెండ్ల యొక్క అదనపు ప్రయోజనం
సంపద సృష్టించడం
షేర్లలో పెట్టుబడి పెట్టడం అనేది సంపదను కూడబెట్టడం మరియు గుణించడం. షేర్ మార్కెట్లో డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి ట్రేడర్లు అనుసరించే అత్యంత ప్రాథమిక చిట్కా ‘తక్కువకు కొనండి, ఎక్కువకు అమ్మండి’’.
దీర్ఘకాలిక పెట్టుబడి అనేది సంపద సృష్టించడానికి మరొక షేర్ మార్కెట్ ప్రాథమికం. ఇది ఎందుకంటే వ్యాపారాలు ఒక జీవితకాలచక్రం గుండా వెళ్తాయి, మరియు పెట్టుబడిదారులు తమ షేర్ల యొక్క విలువ పెరగడానికి తగినంత సమయం ఇవ్వాలి. వారు కొంత కాలానికి ఒక నిర్దిష్ట స్టాక్‌లో పెట్టుబడి పెడితేనే ఇది సాధ్యమవుతుంది.
అవకాశాలు స్వంతం చేసుకోవడానికి
కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం అనేది పెట్టుబడిదారుడు ఆ కంపెనీలో కొంత భాగం కలిగి ఉన్నట్లు సూచిస్తుంది, తద్వారా కంపెనీ సంపాదించే లాభాలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ యాజమాన్యంలోని భాగం అతను కొనుగోలు చేసిన షేర్ల శాతానికి సమానం. కంపెనీ యొక్క పాక్షిక యజమానిగా, కంపెనీ యొక్క వార్తలు మరియు నవీకరణల గురించి అతనికి తెలియజేయబడుతుంది.
పోర్ట్ఫోలియో వైవిధ్యం
షేర్లలో పెట్టుబడి పెట్టడం పెట్టుబడి పోర్ట్ఫోలియోకు వైవిధ్యాన్ని జోడిస్తుంది. పోర్ట్ఫోలియో, పెట్టుబడిదారులకు అనేక ఆదాయ వనరులను ఇవ్వగలదు – రియల్ ఎస్టేట్, స్టాక్స్, బ్యాంక్ అకౌంట్స్ నుండి సంపాదించిన వడ్డీ వంటి అతని ప్రధాన ఆదాయ వనరు కాకుండా.
నష్టాన్ని తగ్గించడం
భారతీయ షేర్ మార్కెట్ అనేక కంపెనీలను కలిగి ఉంటుంది, పెట్టుబడిదారులు వారి అన్ని వనరులను ఒకేదానికి కట్టుబడటానికి బదులుగా వారి పెట్టుబడులను విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. ఒక కంపెనీ యొక్క నష్టాలు వారి కొన్ని షేర్ల తరుగుదలకు దారితీస్తే, మరికొన్ని షేర్ల విజయాలు వారి నష్టాలను సమతుల్యత చేయడానికి సహాయపడతాయి.
సులభంగా అందుబాటులో ఉన్న డబ్బు
ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి కొన్ని రకాల పెట్టుబడులలో, పెట్టుబడి మెచ్యూర్ అయ్యే వరకు పొందలేము.
దీనికి విరుద్ధంగా, షేర్లు కొనుగోలు చేయడంలో పెట్టుబడిదారులు ఎప్పుడైనా, పరిమితి లేకుండా అమ్మడానికి అనుమతిస్తుంది. ఈ లావాదేవీ ఫలితంగా వచ్చే మొత్తం వారి బ్యాంక్ అకౌంట్లకు సులభంగా బదిలీ చేయబడుతుంది.
రిస్క్ లను ఎదుర్కోవడం
షేర్ మార్కెట్లో ట్రేడింగ్ విషయానికి వస్తే ప్రాథమిక భయం ఊహించని నష్టాలు. ఇది స్టాప్ లాస్ ద్వారా అధిగమించవచ్చు, ఒక నిర్దిష్ట ధర పరిమితి గురించి పెట్టుబడిదారులు తమ బ్రోకర్లకు ఆదేశం ఇవ్వడానికి వీలు కల్పించే లక్షణం. వారి షేర్ల విలువ ఈ పరిమితి కంటే కింద పడినప్పుడు, అవి ఆటోమేటిక్ గా అమ్ముడవుతాయి, తద్వారా వారు పెద్ద నష్టాలనుండి రక్షింపబడతారు.
డివిడెండ్ల యొక్క అదనపు ప్రయోజనం
డివిడెండ్ అనేది ఒక కంపెనీ చేసే మొత్తం లాభం నుండి పెట్టుబడిదారులు పొందే చెల్లింపు. ఈ మొత్తాన్ని, డబ్బు లేదా మరిన్ని షేర్ల రూపంలో చెల్లించబడవచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టడం మరియు నమ్మదగిన కంపెనీని ఎన్నుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే పెట్టుబడిదారులకు డివిడెండ్లు చెల్లించడం తప్పనిసరి కాదు. అయితే, చాలా బహుళజాతి కంపెనీలు మరియు స్థిరమైన కంపెనీలు వారి షేర్ పెట్టుబడిదారుల సంఖ్యను విస్తృతం చేసుకొనుటకు డివిడెండ్లను అందిస్తాయి.