ఫైనాన్షియల్ మరియు కమోడిటీ మార్కెట్ల గురించి ఒక విషయం ఉందంటే, అది ధర మార్పులు. ధరలు అన్ని సమయంలో మారుతూ ఉంటాయి. అవి ఆర్థిక వ్యవస్థ, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తి, ఎలక్షన్ ఫలితాలు, అధికారాలు, యుద్ధాలు మరియు ప్రభుత్వ విధానాలతో సహా వివిధ కారకాలకు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఆచరణాత్మకంగా చూస్తే ఈ లిస్ట్ అంతులేనిది.
సహజంగానే, ఈ మార్కెట్లలో వ్యవహరిస్తున్న వారు ధర హెచ్చుతగ్గుల గురించి ఆందోళన పడతారు, ఎందుకంటే ధరల్లో మార్పులు అంటే నష్టాలు – లేదా లాభాలు. తమను తాము రక్షించుకోవడానికి, వారు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు వంటి డెరివేటివ్లను సాగిస్తారు. ఒక డెరివేటివ్ అనేది దాని విలువను అంతర్లీన ఆస్తుల నుండి పొందే ఒక ఒప్పందం; అంతర్లీన ఆస్తులలో స్టాక్స్, కమోడిటీలు, కరెన్సీ మొదలైనవి ఉండవచ్చు.
కాబట్టి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు ఏమిటి? ఒకసారి చూద్దాం.
ఫ్యూచర్స్ అంటే ఏమిటి?
ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఒక రకం డెరివేటివ్. ఈ రకం ఒప్పందంలో, ఒక కొనుగోలుదారు (లేదా విక్రేత) ఒక నిర్దిష్ట ఆస్తి యొక్క ఒక నిర్దిష్ట పరిమాణంలో, భవిష్యత్తు తేదీలో ఒక నిర్దిష్ట ధర వద్ద కొనుగోలు చేయడానికి (లేదా విక్రయించడానికి) అంగీకరిస్తారు.
ఒక ఉదాహరణతో దీనిని వివరించనివ్వండి. మీరు ఒక నిర్దిష్ట తేదీకి కంపెనీ ఎబిసి యొక్క 100 షేర్లను కొనుగోలు చేయడానికి భవిష్యత్తు ఒప్పందాన్ని రూ 50 వద్ద కొనుగోలు చేశారని అనుకుందాం. కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత, ప్రస్తుత ధరతో సంబంధం లేకుండా, మీరు ఆ షేర్లు రూ 50 లకు పొందుతారు. ప్రస్తుత ధర రూ 60 వరకు ఉంటే కూడా, మీకు ప్రతిదానికి రూ 50 వద్ద షేర్లు లభిస్తాయి, అంటే మీరు రూ 1,000 లాభాన్ని పొందుతారు. షేర్ ధర రూ 40 ఉంటే, మీరు వాటిని అప్పటికీ రూ 50 వద్ద కొనుగోలు చేయాలి. అలాంటి సందర్భంలో మీరు రూ. 1,000 నష్టపోతారు! ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్న ఒకే ఆస్తి స్టాక్స్ మాత్రమే కాదు. మీరు వ్యవసాయ వస్తువులు, పెట్రోలియం, బంగారం, కరెన్సీ మొదలైన వాటి కోసం ఫ్యూచర్స్ ఒప్పందాలను పొందవచ్చు.
ధర హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని తప్పించుకోవడానికి సహాయపడటంలో ఫ్యూచర్స్ విలువైనవి. ఉదాహరణకు, ఆయిల్ దిగుమతి చేసే ఒక దేశం భవిష్యత్తులో ధర పెరుగుదల నుండి దానిని రక్షించుకోడానికి ఆయిల్ ఫ్యూచర్స్ లను కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, రైతులు వారి ఉత్పత్తుల ధరలను ఫ్యూచర్స్ లను ఉపయోగించి లాక్ చేస్తారు, తద్వారా వారు తమ పంటను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధరలు పడిపోయే ప్రమాదాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.
ఆప్షన్స్ అంటే ఏమిటి?
ఆప్షన్స్ అనేది మరొక రకమైన డెరివేటివ్ కాంట్రాక్ట్. ఇది ఒక కొనుగోలుదారుకు (లేదా విక్రేతకు) ఒక నిర్దిష్ట ముందుగా నిర్ణయించబడిన తేదీకి ఒక నిర్దిష్ట ఆస్తిని కొనుగోలు చేయడానికి (లేదా విక్రయించడానికి) హక్కును ఇస్తుంది,బాధ్యత వహించదు.
రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి: కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అనేది కొనుగోలుదారుకు ఒక నిర్దిష్ట తేదీన నిర్దిష్ట ధరకు ఒక నిర్దిష్ట ఆస్తిని కొనుగోలు చేయడం కొరకు హక్కు ఇచ్చే ఒక ఒప్పందం, కానీ బాధ్యత కాదు. మీరు ఒక నిర్దిష్ట తేదీన కంపెనీ ఎబిసి యొక్క 100 షేర్లను కొనుగోలు చేయడానికి ఒక కాల్ ఆప్షన్ ను రూ 50 వద్ద కొనుగోలు చేశారని అనుకుందాం. కానీ ఆ నిర్దిష్ట తేదీన షేర్ ధర రూ. 40 కు పడిపోయినది మరియు మీకు ఆ కాంట్రాక్టు తో వెళ్ళడానికి ఆసక్తి లేదు ఎందుకంటే మీకు నష్టం వస్తుంది కాబట్టి. అప్పుడు మీరు రూ. 50 వద్ద షేర్లను కొనవలసిన అవసరం లేదు అనే హక్కును కలిగి ఉంటారు.. అందువల్ల డీల్ పై రూ 1,000 నష్టపోయే దానికి బదులుగా, ఒప్పందంలోకి ప్రవేశించడానికి మీరు చెల్లించిన ప్రీమియం ఒక్కటే ఏకైక నష్టం, ఇది చాలా తక్కువగా ఉంటుంది.
మరొక రకం ఆప్షన్ పుట్ ఆప్షన్. ఈ రకం ఒప్పందంలో, మీరు భవిష్యత్తులో అంగీకరించబడిన ధరకు ఆస్తులను అమ్మవచ్చు, కానీ బాధ్యత కాదు. ఉదాహరణకు, మీరు భవిష్యత్తు తేదీకి కంపెనీ ఎబిసి యొక్క షేర్లను రూ 50 వద్ద విక్రయించడానికి ఒక ఆప్షన్ కలిగి ఉన్నట్లయితే మరియు గడువు ముగిసే తేదీకి ముందు ధరలు రూ 60 కు పెరిగితే, మీకు రూ 50 వద్ద షేర్ విక్రయించవలసిన అవసరం లేని ఆప్షన్ కలిగి ఉంటారు. కాబట్టి మీరు రూ 1,000 నష్టాన్ని నివారించారు.
ఫ్యూచర్ మరియు ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ యొక్క ఒక ప్రయోజనం ఏంటంటే మీరు వివిధ ఎక్స్ఛేంజ్స్ లో స్వేచ్ఛగా ట్రేడింగ్ చేయవచ్చును. ఉదా. మీరు స్టాక్ ఎక్స్చేంజ్‌లు, కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లపై వస్తువులు మొదలైన వాటిపై స్టాక్ ఫ్యూచర్‌లు మరియు ఆప్షన్ను ట్రేడ్ చేసుకోవచ్చు. ఎఫ్&ఓ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలుసుకునేటప్పుడు, మీరు అటువంటి ట్రేడింగ్ అంతర్లీన ఆస్తిని తీసుకోవలసిన అవసరం లేకుండగా చేయవచ్చును అని అర్థం చేసుకోవడం అవసరం. మీరు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండకపోయినప్పటికీ, మీరు బంగారం ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా వస్తువులలో ధర హెచ్చుతగ్గుల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ధర మార్పుల నుండి లాభం పొందడానికి మీకు చాలా తక్కువ పెట్టుబడి అవసరం.
స్టాక్ మార్కెట్లో ఎఫ్&ఓ ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు. అయితే, ఇవి ఇటీవలి సంవత్సరాల్లో ప్రజాదరణలో అభివృద్ధి చెందుతున్నాయి, కాబట్టి దాని గురించి మరింత తెలుసుకోవడం మీ ప్రయోజనం కావచ్చు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) 2000 సంవత్సరంలో బెంచ్మార్క్ నిఫ్టీ 50 పై ఇండెక్స్ డెరివేటివ్స్ ప్రవేశపెట్టింది. నేడు, మీరు తొమ్మిది ముఖ్యమైన సూచికలలో మరియు 100 సెక్యూరిటీల కంటే ఎక్కువ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ) ద్వారా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో ట్రేడ్ చేయవచ్చు
ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం యొక్క గణనీయమైన ప్రయోజనం ఏంటంటే మీరు అంతర్లీన ఆస్తిపై డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీరు ట్రేడ్ చేయడానికి స్టాక్ బ్రోకర్ కు ప్రారంభ మార్జిన్ మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు, మార్జిన్ 10 శాతం అని ఊహించండి. కాబట్టి మీరు ₹. 10 లక్షల విలువగల స్టాక్ ఫ్యూచర్ ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు బ్రోకర్ కు మార్జిన్ మనీలో ₹. 1 లక్ష చెల్లించడం ద్వారా అలా చేయవచ్చు. పెద్ద పరిమానాలు అంటే లాభం చేసుకోవడానికి మీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. కానీ మీరు ఆశించే విధంగా షేర్ ధరలు తరలించకపోతే, మీరు భారీ నష్టాలను ఎదుర్కోవలసిఉంటుంది.
ఆప్షన్ తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి ఎందుకంటే ధరలు మీరు ఆశించిన విధంగా కదలకపోతే మీరు ఆప్షన్లను ఉపయోగించవలసిన అవసరం లేదు. కాంట్రాక్ట్ కోసం మీరు చెల్లించే ప్రీమియం మాత్రమే మీ నష్టం. కాబట్టి షేర్ మార్కెట్లో ఎఫ్&ఓ అంటే ఏమిటో మీకు తెలిసిన తర్వాత, దాని నుండి డబ్బు సంపాదించడం మరియు మీ ప్రమాదాలను తగ్గించడం సాధ్యమవుతుంది.
కమోడిటీస్ లో ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు
పెట్టుబడిదారులకు కమోడిటీస్ లో ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు మరొక ఎంపిక. అయితే, కమోడిటీ మార్కెట్లు అస్థిరమైనవి, కాబట్టి మీరు గణనీయమైన మొత్తంలో రిస్క్ భరించగలిగితే మాత్రమే వాటిలోకి ప్రవేశించడం మంచిది. కమోడిటీస్ కు మార్జిన్లు తక్కువగా ఉన్నందున, గణనీయమైన పరపతికి అవకాశం ఉంటుంది. లాభాల కోసం మరింత అవకాశాలను అందించవచ్చు, కానీ సాధారణంగా ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
మీరు భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసిఎక్స్) మరియు నేషనల్ కమోడిటీ & డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్సిడిఇఎక్స్) వంటి కమోడిటీ ఎక్స్ఛేంజ్ ల ద్వారా కమోడిటీ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లను ట్రేడ్ చేసుకోవచ్చు.
ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో అవసరమైన పాత్ర పోషిస్తున్నందున ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లు అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అవి ధర హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా సహాయపడతాయి మరియు మార్కెట్లు లిక్విడ్ గా ఉంటాయని నిర్ధారిస్తాయి. ఈ డెరివేటివ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా అవగాహన ఉన్నపెట్టుబడిదారుడు కూడా లాభం పొందవచ్చు.