భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం కొరకు అయ్యే రుసుములు మరియు ఛార్జీలు

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ(AMC) లు) మ్యూచువల్ ఫండ్స్‌పై వివిధ రకాల ఛార్జీలను విధిస్తాయి. వివిధ మ్యూచువల్ ఫండ్ ఫీజులు ఎలా ఉంటాయో మరియు అవి ఎందుకు విధించబడుతున్నాయో అనే సమాచారం తెలుసుకోవడం మీకు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు అందుబాటులో ఉండి వైవిధ్యభరితమైన మార్గాన్ని అందిస్తాయి. అవి మార్కెట్-లింక్డ్ అయినందు వలన, చాలా సాంప్రదాయ పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ రాబడిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే, పెట్టుబడిదారులు తాము పెట్టుబడులను పెట్టడం ద్వారా భరించవలసిన తమ పైన పడే వివిధ మ్యూచువల్ ఫండ్ రుసుములను భారాన్ని గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాసంలో, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు తరచుగా విధించే వివిధ ఛార్జీలు మరియు వాటి అర్థం ఏమిటో మనం చూడబోతున్నాం.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో ఏమేమి ఛార్జీలు అనుసంధానించచబడి ఉంటాయి?

మ్యూచువల్ ఫండ్స్‌తో ముడి పడిన మీరు తెలుసుకోవలసిన మూడు ప్రధాన ఛార్జీలు ఉంటాయి – ఖర్చు నిష్పత్తి (ఎక్స్పెన్స్ రేషియో), లావాదేవీ (ట్రాన్సాక్షన్) ఛార్జీలు మరియు ఎగ్జిట్ లోడ్. ఈ మూడు ఛార్జీలలో ప్రతి ఒక్కటి మరియు అవి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (ఏఎంసీ(AMC)ల)చే ఎందుకు విధించబడుతున్నాయి అనే దాని గురించి ఇక్కడ లోతైన వివరణ ఇవ్వబడింది.

  1. వ్యయ నిష్పత్తి (ఎక్స్పెన్స్ రేషియో)

మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి అనేది మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. ఇది ఫండ్ యొక్క రోజువారీ నికర ఆస్తుల పై కొంత శాతంగా విధించబడే వార్షిక రుసుము. ఏఎంసీ(AMC)లు మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి వ్యయ నిష్పత్తిని విధిస్తాయి. ఈ ఖర్చులలో మ్యూచువల్ ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, పంపిణీ మరియు మార్కెటింగ్ ఖర్చులు, ఫండ్ మేనేజర్ ఫీజులు, రిజిస్ట్రార్ ఫీజులు మరియు కస్టోడియన్ ఛార్జీలు ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి అనేది మ్యూచువల్ ఫండ్‌లతో అనునుసంధానించచబడిన ప్రధాన ఛార్జీ మరియు ఇది మీ పెట్టుబడిపై వచ్చే రాబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి 1.5% గా ఉండి, మీరు ఫండ్‌లో ₹1,80,000 పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు సంవత్సరానికి ₹2,700 (₹1,80,000 * 1.5%) చెల్లించవలసి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే, మీ రాబడి అంత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నిర్దిష్ట రుసుము ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిగణనలోకి తీసుకుంటే, తక్కువ వ్యయ నిష్పత్తి గల ఫండ్‌ను ఎంచుకోవడం మంచిది. సెబీ (SEBI) పేర్కొన్న గరిష్ట పరిమితులకు లోబడి, ఖర్చు నిష్పత్తులను తమ ఇష్టానుసారంగా విధించే స్వేచ్ఛ (ఏఎంసీ(AMC)లకు ఉందని గమనించడం చాలా అవసరం. క్రియాశీలంగా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్‌లు సాధారణంగా నిష్క్రియాత్మకంగా నిర్వహించబడే నిధుల కంటే ఎక్కువ వ్యయ నిష్పత్తులను కలిగి ఉంటాయి.

  1. లావాదేవీ (ట్రాన్సాక్షన్) ఛార్జీలు

లావాదేవీ ఛార్జీలు మ్యూచువల్ ఫండ్ ఫీజులు, మీరు కొనుగోలు చేసిన యూనిట్ల మొత్తం విలువ ఒక నిర్దిష్ట పరిమితిని మించినప్పుడు మరియు విక్రయించినప్పుడు విధించబడుతుంది. భారతదేశంలో, ఈ పరిమితి ₹10,000గా సెట్ చేయబడింది, అంటే మీరు ₹10,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా, మీరు లావాదేవీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సూచించిన నిబంధనల ప్రకారం, మ్యూచువల్ ఫండ్‌లు కొత్త పెట్టుబడిదారుల నుండి వారి లావాదేవీ విలువ ₹10,000 కు మించి ఉంటే వారికి గరిష్టంగా ₹150 లావాదేవీ ఛార్జీని విధించవచ్చు. అయితే, ఇప్పటికే ఉన్న కస్టమర్ల విషయంలో, విధించబడే గరిష్ట లావాదేవీ ఛార్జీ ₹100కి పరిమితం చేయబడింది.

  1. ఎగ్జిట్ లోడ్

మ్యూచువల్ ఫండ్ ఫీజులు మరియు ఖర్చులలో మరొక ముఖ్యమైన భాగం ఎగ్జిట్ లోడ్. ఇది పేర్కొన్న హోల్డింగ్ వ్యవధి ముగిసేలోపు మీరు మీ పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నప్పుడు విధించబడే రుసుము. పెట్టుబడిదారులను పథకం నుండి నిష్క్రమించకుండా నిరుత్సాహపరచడం మరియు అకాల నిష్క్రమణతో ఆంఛ్లు చేసే ఖర్చులను కవర్ చేయడం అనేవి ఎగ్జిట్ లోడ్ యొక్క ప్రాథమిక లక్ష్యం.

విధించబడే ఎగ్జిట్ లోడ్ శాతం (ఏఎంసీ(AMC) యొక్క అభీష్టానుసారం ఉంటుంది అని గమనించడం చాలా ముఖ్యం. సాధారణంగా, చాలా మ్యూచువల్ ఫండ్‌లు ఎగ్జిట్ యొక్క మొత్తం విలువపై 1% లోడ్‌ను విధిస్తాయి. కాబట్టి మీ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ విలువ ₹50,000 అయితే, మీరు ₹500 (₹50,000 * 1%) ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది.

అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్‌లను విధించవు. అందువల్ల, పేర్కొన్న హోల్డింగ్ వ్యవధి ముగిసేలోపు మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను క్రమం తప్పకుండా విక్రయించాలని ప్లాన్ చేసుకున్నట్లైతే, ఎగ్జిట్ లోడ్ విధించని ఫండ్‌ను ఎంచుకోవడం మంచిది.

రెగ్యులర్ ప్లాన్‌లు ఎందు వల్ల ఎక్కువ వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి? 

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఒకే మ్యూచువల్ ఫండ్ కోసం రెండు రకాల ప్లాన్‌లను తరచుగా ఆఫర్ చేస్తాయి -. డైరెక్ట్ ప్లాన్‌లో, మీరు నేరుగా ఏఎంసీ(AMC) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. రెగ్యులర్ ప్లాన్‌లో, మీరు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అనుబంధంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ ప్లాన్ మరియు రెగ్యులర్ ప్లాన్ లేదా ఏజెంట్ ద్వారా ఫండ్‌లో పెట్టుబడి పెడతారు.

డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్‌లు రెండూ ఆస్తుల పోర్ట్‌ఫోలియో నుండి ఫండ్ మేనేజర్ మరియు వారి వ్యూహాల వరకు మ్యూచువల్ ఫండ్ కోసం అన్ని అంశాలలో సమానంగా ఉంటాయి. అవి ఒక్క అంశంలో మాత్రమే మారుతూ ఉంటాయి – అది వ్యయ నిష్పత్తి.

ఒకే మ్యూచువల్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్‌ల కంటే రెగ్యులర్ ప్లాన్‌లు తరచుగా అధిక వ్యయ నిష్పత్తులను కలిగి ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రెగ్యులర్ ప్లాన్‌లో పంపిణీదారు లేదా ఏజెంట్ యొక్క ప్రమేయం. పంపిణీ ఖర్చులు మరియు ఏజెంట్ కమీషన్లు వంటి ఖర్చులు రెగ్యులర్ ప్లాన్‌ల వ్యయ నిష్పత్తికి జోడించబడతాయి, ఇవి డైరెక్ట్ ప్లాన్ కంటే ఎక్కువ ఖరీదైనవి.

భారతదేశంలో గరిష్ట వ్యయ నిష్పత్తి పరిమితి ఎంత?

మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తులను సెట్ చేసుకునే స్వేచ్ఛను అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు సెబీ ఇచ్చింది. సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ యొక్క 52వ రెగ్యులేషన్ కింద పేర్కొన్న విధంగా గరిష్ట వ్యయ నిష్పత్తి పరిమితులను ఏఎంసీ(AMC)లు మించకూడదు.

నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు మరియు ఫండ్ యొక్క రకాన్ని బట్టి ఏఎంసీ(AMC)లు విధించగల గరిష్ట వ్యయ నిష్పత్తి మారుతూ ఉంటుంది. ఫండ్ నిర్వహణలో ఎంత ఎక్కువ ఆస్తులు ఉంటే, ఖర్చు నిష్పత్తి అంత తక్కువగా ఉంటుంది. సెబీ పేర్కొన్న పరిమితులను వివరించే పట్టిక ఇక్కడ ఉంది.

నిర్వహణలో ఉన్న ఆస్తులు (అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్(AUM)) డెట్ మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి పరిమితులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి పరిమితులు
₹500 కోట్ల వరకు 2.00% 2.25%
తదుపరి ₹250 కోట్లపై 1.75% 2.00%
తదుపరి ₹1,250 కోట్లపై 1.50% 1.75%
తదుపరి ₹3,000 కోట్లపై 1.35% 1.60%
తదుపరి ₹5,000 కోట్లపై 1.25% 1.50%
తదుపరి ₹40,000 కోట్లపై రోజువారీ నికర ఆస్తులలో ప్రతి ₹5,000 కోట్ల పెరుగుదలకు వ్యయ నిష్పత్తిలో 0.05% తగ్గింపు రోజువారీ నికర ఆస్తులలో ప్రతి ₹5,000 కోట్ల పెరుగుదలకు వ్యయ నిష్పత్తిలో 0.05% తగ్గింపు
₹50,000 కోట్లకు మించిన 0.80% 1.05%

ముగింపు

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ఫీజులు మరియు ఖర్చులు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో అంతర్భాగాలు. ఈ ఛార్జీలు మీ పెట్టుబడుల నుండి మీరు పొందే రాబడిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. మ్యూచువల్ ఫండ్ ఛార్జీలు తక్కువగా ఉంటే, మీకు రాబడి ఎక్కువగా ఉంటుంది.

ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు, మ్యూచువల్ ఫండ్ ఛార్జీలతో పాటు పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్, గత పనితీరు మరియు ఫండ్ మేనేజర్ యొక్క నైపుణ్యం వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోబడ్డాయని నిర్ధారించుకోండి. ఈ సమాచారం మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడిని గురించిన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

నేడే ఏంజెల్ వన్‌లో డీమ్యాట్ ఖాతాను తెరవండి మరియు వివిధ పెట్టుబడి ఎంపికలను అన్వేషించండి.

FAQs

మ్యూచువల్ ఫండ్స్‌తో ఏమేమి ఛార్జీలు అనుసంధానించచబడిఉంటాయి?

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి, ఎగ్జిట్ లోడ్ మరియు లావాదేవీల రుసుములు మ్యూచువల్ ఫండ్‌లతో అనుసంధానించచబడిన కొన్ని ఛార్జీలు.

వ్యయ నిష్పత్తి అంటే ఏమిటి మరియు అది నా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తుంది?

మ్యూచువల్ ఫండ్ వ్యయ నిష్పత్తి అనేది అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వసూలు చేసే రుసుము. ఇది కొంత శాతంగా వ్యక్తీకరించబడి పెట్టుబడి మొత్తం విలువపై విధించబడుతుంది. ఫండ్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ మరియు ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి వ్యయ నిష్పత్తి వసూలు చేయబడుతుంది.

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ఫీజులు మరియు ఖర్చులలో ఎంట్రీ లోడ్‌లు భాగమేనా?

కాదు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్లలో ఎంట్రీ లోడ్ల విధనాన్ని రద్దు చేసింది. ఆగస్ట్ 2009 నుండి ఎంట్రీ లోడ్‌లను వసూలు చేసే పద్ధతి ఆగిపోయింది.

ఎగ్జిట్ లోడ్‌లు అంటే ఏమిటి మరియు అవి ఎప్పుడు విధించబడతాయి?

ఎగ్జిట్ లోడ్‌లు అనేవి ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ రుసుము మరియు మీరు నిర్ణీత హోల్డింగ్ వ్యవధి ముగిసేలోపు మీ పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నట్లైతే విధించబడే ఖర్చు. సాధారణంగా ఈ ఫీజులు స్వల్పకాలిక ట్రేడింగ్ నుండి పెట్టుబడిదారులను నిరుత్సాహపరచడానికి మరియు మ్యూచువల్ ఫండ్ హౌస్ ముందస్తు  ఎగ్జిట్‌ల వల్ల కలిగే ఖర్చులను కవర్ చేయడానికి విధించబడతాయి. నిర్ణీత హోల్డింగ్ వ్యవధి ముగిసిన తర్వాత, ఎగ్జిట్ లోడ్‌లు విధించబడవు.

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ఛార్జీలను నియంత్రించేందుకు నియంత్రణ మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?

వును, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ఛార్జీలతో వ్యవహరించే అనేక నియమాలు, నిబంధనలు మరియు సర్క్యులర్‌లను సెబీ నోటిఫై చేసింది. ఇవి మ్యూచువల్ ఫండ్ ఫీజులకు సంబంధించి సెబీ యొక్క నియంత్రణ మార్గదర్శకాలు పారదర్శకతను ధృవీరిస్తాయి మరియు పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయి.