మ్యూచువల్ ఫండ్ యూనిట్ అంటే ఏమిటి మరియు దానిని ఎలా కొనుగోలు చేయాలి?

మ్యూచువల్ ఫండ్‌లోని ఒక యూనిట్ అనేది ఫండ్‌లో మీకు గల యాజమాన్య వాటాను సూచిస్తుంది. మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువను నికర ఆస్తి విలువ (నెట్ అసెట్ వాల్యూ) అని పిలుస్తారు మరియు ప్రతి ట్రేడింగ్ రోజు యొక్క చివరిలో ఇది లెక్కించబడుతుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అనేది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ఈ ఫండ్‌లు చాలా మంది (బహుళ) పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి దానిని ఈక్విటీ షేర్ల నుండి డెట్ సాధనాల వరకు సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఫండ్‌లు వివిధ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం వలన, అవి సహజంగా వైవిధ్యతను అందిస్తాయి అందువల్ల మార్కెట్ రిస్క్‌ను కొంత వరకు తగ్గించవచ్చు. చాలా మంది పెట్టుబడిదారులు సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే అనేక కారణాలలో ఇది ఒకటి.

మీరు, చాలా మంది ఇతర పెట్టుబడిదారుల లాగే, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే, దానితో అనుసంధానం కలిగి ఉన్న వివిధ నిబంధనలను గురించి మీరు తెలుసుకోవాలి. ఈ వ్యాసంలో, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల యొక్క అర్థం, మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ ధర ఎలా లెక్కించబడుతుంది మరియు ఈక్విటీ షేర్ల నుండి అవి ఎలా విభిన్నంగా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోబోతున్నారు.

మ్యూచువల్ ఫండ్‌లో ఒక యూనిట్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్‌లోని యూనిట్ అనేది ఫండ్‌లో మీకు గల యాజమాన్య వాటాను సూచిస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్లను కలిగి ఉన్నప్పుడు, మీరు తప్పనిసరిగా ఫండ్ యొక్క ఆస్తులలో కొంత భాగాన్ని కలిగి ఉంటారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు ఫండ్‌లో మీకు గల యాజమాన్యాన్ని మాత్రమే సూచిస్తాయని మరియు ఫండ్ యొక్క అంతర్లీన సెక్యూరిటీలలో కాదని స్పష్టంగా తెలిసుకోవడం ముఖ్యం.

ఉదాహరణకు, మ్యూచువల్ ఫండ్ తన ఆస్తులలో 30% డెట్ సాధనాల్లో, 20% A అనే కంపెనీలో, 20% B అనే కంపెనీలో మరియు 30% C అనే కంపెనీలో పెట్టుబడి పెడుతుందని అనుకుందాం. ఇప్పుడు, మీరు అటువంటి ఫండ్ యొక్క యూనిట్‌ని కొనుగోలు చేస్తే, మీరు పైన పేర్కొన్న శాతంలో ఫండ్ ఆస్తులన్నింటిలో కొంత భాగాన్ని కలిగి ఉంటారు.

ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ విషయంలో, సృష్టించగల యూనిట్ల సంఖ్యకు గరిష్ట పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు కొత్త ఇన్వెస్టర్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ అయినప్పుడు మరిన్ని యూనిట్లను సృష్టిస్తాయి. కానీ క్లోజ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, యూనిట్లకు గరిష్ట సంఖ్య ఉంటుంది. నిర్దేశించిన యూనిట్‌లన్నింటికీ సభ్యత్వం పొందిన తర్వాత, ఇష్యూ మూసివేయబడుతుంది మరియు పెట్టుబడిదారుల నుండి తదుపరి సభ్యత్వాలు ఏవీ అమోదించబడవు.

మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ ధర ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల అర్థం గురించి తెలుసుకున్నారు, ఇంక వాటి విలువ ఎలా నిర్ణయించబడుతుందో చూద్దాం.

ఈక్విటీ షేర్ల మాదిరిగానే, మ్యూచువల్ ఫండ్‌లోని ప్రతి యూనిట్‌కు ఒక విలువ కేటాయించబడుతుంది. నికర ఆస్తి విలువ (నెట్ అసెట్ వాల్యూ) లేదా ఎన్ఏవీ(NAV) అని పిలువబడే విలువ ఈ క్రింది గణిత సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించబడుతుంది.

నికర ఆస్తి విలువ = [(ఫండ్‌లోని ఆస్తుల మొత్తం విలువ – ఫండ్‌లోని అప్పుల మొత్తం విలువ) ÷ ఫండ్‌లోని మొత్తం యూనిట్ల సంఖ్య]

మ్యూచువల్ ఫండ్ యూనిట్ ధర ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వ బడింది.

మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మరియు డెట్ సాధనాల రూపంలో ₹200 లక్షల విలువైన ఆస్తులను కలిగి ఉందని భావించండి. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, ఫండ్ మేనేజర్ ఫీజులు మరియు మార్కెటింగ్ మరియు కమీషన్ ఖర్చులు వంటి అన్ని సాధ్యమైన ఖర్చులతో సహా ఫండ్ యొక్క మొత్తం అప్పులు దాదాపు ₹20 లక్షల వరకు ఉంటాయి. లెక్కించే తేదీ నాటికి మ్యూచువల్ ఫండ్‌లోని మొత్తం యూనిట్ల సంఖ్య 4 లక్షలు ఉంటుంది.

పైన పేర్కొన్న ఫార్ములాలో ఈ విలువలను ప్రతిక్షేపించడం ద్వారా మీకు నికర ఆస్తి విలువ లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువ వస్తుంది.

నికర ఆస్తి విలువ = యూనిట్‌కు ₹45 [(₹200 లక్షలు – ₹20 లక్షలు) ÷ ₹4 లక్షలు] 

మ్యూచువల్ ఫండ్ యొక్క నికర ఆస్తి విలువ అంతటా ఒకే విధంగా ఉండదు. వాస్తవానికి, ఫండ్ యొక్క అంతర్లీన ఆస్తుల విలువలో మార్పుల ఆధారంగా ఇది హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఫండ్ యొక్క అంతర్లీన సెక్యూరిటీల విలువ పెరిగితే, ఫండ్ యొక్క ఎన్ఏవీ(NAV) కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి విరుద్ధంగా, ఫండ్ యొక్క సెక్యూరిటీల విలువ తగ్గితే, ఫండ్ యొక్క ఎన్ఏవీ(NAV) కూడా తగ్గవచ్చు.

ఇంకా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకారం, ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ తప్పనిసరిగా ప్రతి ట్రేడింగ్ రోజున చివరిలో వారి ఫండ్స్ యొక్క ఎన్ఏవీ(NAV)ని లెక్కించి ప్రచురించాలి.

మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఎలా కొనుగోలు చేయాలి?

పెట్టుబడిదారుగా, మీరు మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్లను ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోవాలి. మీరు అనుసరించాల్సిన ప్రక్రియ యొక్క శీఘ్ర అవలోకనం ఇక్కడ ఉంది.

  • దశ 1: ఏంజెల్ వన్‌లో డీమ్యాట్ ఖాతాను తెరవండి.
  • దశ 2: మీ వినియోగదారు గుర్తింపులను ఉపయోగించి మీ వ్యాపార ఖాతాకు లాగిన్ అవ్వండి.
  • దశ 3: పోర్టల్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ విభాగానికి నావిగేట్ అవ్వండి.
  • దశ 4: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ కోసం వెతకండి.
  • దశ 5: మీరు ఎన్ని యూనిట్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అన్నిటి కొనుగోలు కోసం ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసే ముందు, మీ ట్రేడింగ్ ఖాతాలో మీకు అవసరమైన మొత్తం ఉందో లేదో తనిఖీ చేసుకోండి.

కొనుగోలు ఆర్డర్ విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత, మీరు ఎన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేసారో అవి అన్నీ లింక్ చేయబడిన డీమ్యాట్ ఖాతాకు జమ చేయబడతాయి.

ప్రత్యామ్నాయంగా, మీకు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా లేకపోయినా కూడా మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను కొనుగోలు చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, మీరు తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంటరీ సాక్ష్యం మరియు మ్యూచువల్ ఫండ్ హౌస్‌తో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంతో పాటు ఫిజికల్ సబ్‌స్క్రిప్షన్ ఫారమ్‌ను పూరించాలి మరియు సమర్పించాలి. అప్లికేషన్ ధృవీకరించబడి, ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీకు మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లు కేటాయించబడతాయి మరియు మీ పెట్టుబడి వివరాలతో కూడిన కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (సీఏఎస్(CAS))ని మీరు అందుకుంటారు.

ఇప్పుడు, మీరు మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్లను కొనుగోలు చేయడానికి ముందు, మీరు పరిగణించవలసిన మరో ప్రధాన అంశం ఉంది, అది నికర ఆస్తి యొక్క విలువ. అది ఫండ్ హౌస్‌కి నిధులు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు మీకు కేటాయించబడే ఎన్ఏవీ(NAV) మ్యూచువల్ ఫండ్ కట్-ఆఫ్ సమయానికి ముందే బదిలీ చేయబడ్డాయా లేదా తర్వాత బదిలీ చేయబడ్డాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి ఫండ్‌లు నిర్ణీత కట్-ఆఫ్ సమయానికి ముందే బదిలీ చేయబడితే, యూనిట్‌లు ముందు రోజు ఉన్న ఎన్ఏవీ(NAV) లో కేటాయించబడతాయి. అలా కాకుండా, నిర్ణీత కట్-ఆఫ్ సమయం తర్వాత నిధులను మ్యూచువల్ ఫండ్ హౌస్‌కు బదిలీ చేస్తే, ప్రస్తుత రోజు ఉన్న ఎన్ఏవీ(NAV) వద్ద యూనిట్లు కేటాయించబడతాయి, ఇది ట్రేడింగ్ సెషన్ ముగింపులో మాత్రమే లెక్కించబడుతుంది.

ఈక్విటీ షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల మధ్య వ్యత్యాసం

ప్రారంభంలో, ఈక్విటీ షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు చాలా పోలికలను కలిగి ఉన్నట్లు అనిపించవచ్చు. అయినప్పటికీ, వాటి మధ్య తేడాలు కూడా ఉంటాయి. రెండింటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలను వివరించే పట్టిక ఇక్కడ ఉంది.

వివరాలు  ఈక్విటీ షేర్లు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు
యాజమాన్యం కంపెనీలో గల యాజమాన్యాన్ని సూచిస్తుంది మ్యూచువల్ ఫండ్ యొక్క సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియోలో యాజమాన్యాన్ని సూచిస్తుంది
డైవర్సిఫికేషన్ ఈక్విటీ షేర్లు ఒక నిర్దిష్ట కంపెనీకి చెందినవి కాబట్టి, డైవర్సిఫికేషన్ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ వివిధ సెక్యూరిటీల బాస్కెట్ లో పెట్టుబడి పెట్టడం వలన డైవర్సిఫికేషన్ ఉంటుంది.
పెట్టుబడి రిస్క్  సాధారణంగా ఈక్విటీ షేర్లతో పెట్టుబడి రిస్క్ ఎక్కువగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ యొక్క విభిన్న స్వభావం కారణంగా పెట్టుబడి రిస్క్ సాధారణంగా తక్కువగా ఉంటుంది
ఓటింగ్ హక్కులు హోల్డర్‌కు ఓటింగ్ హక్కులను అందిస్తాయి హోల్డర్‌కు ఎలాంటి హక్కులను అందించవు
అస్థిరత ఈక్విటీ షేర్లు చాలా అస్థిరంగా ఉంటాయి మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ(NAV) ఈక్విటీ షేర్ల వలె అస్థిరమైనది కాదు
లిక్విడిటీ లిక్విడిటీ ఒక కంపెనీకి మరొక కంపెనీకి ఒకేలాగ ఉండకపోవచ్చు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు సాధారణంగా ద్రవం(లిక్విడ్)గా ఉంటాయి మరియు ఏ సమయంలోనైనా రీడీమ్ చేసుకోవచ్చు (తిరిగి కొనవచ్చు)

ముగింపు

దీనితో పాటు, మ్యూచువల్ ఫండ్‌లోని యూనిట్ అంటే ఏమిటి మరియు దాని విలువ ఎలా నిర్ణయించబడుతుందో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు, మీరు ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి నిధులను బదిలీ చేసే సమయాన్ని బట్టి మీకు కేటాయించిన ఎన్ఏవీ(NAV) మారవచ్చు.

మీరు మునుపటి రోజు ఉన్న ఎన్ఏవీ(NAV) లో యూనిట్లను పొందాలనుకుంటే, ఫండ్ కోసం నిర్దేశించిన కట్-ఆఫ్ సమయానికి ముందే ఫండ్‌లు మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి బదిలీ చేయబడాలని గుర్తుంచుకోండి. లేకపోతే, మీకు ప్రస్తుత రోజు ఉన్న ఎన్ఏవీ(NAV) వద్ద యూనిట్లు కేటాయించబడతాయి, ఇది ట్రేడింగ్ రోజు ముగిసిన తర్వాత మాత్రమే లెక్కించబడుతుంది.

ఏంజెల్ వన్‌లో డీమ్యాట్ ఖాతాను ఉచితంగా తెరవండి మరియు ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్‌ల కోసం అన్వేషించండి.

FAQs

మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ విలువ ఎలా నిర్ణయించబడుతుంది?

నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)NAV)) అని కూడా పిలువబడే మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువ, ఫండ్ కలిగి ఉన్న ఆస్తుల యొక్క మొత్తం మార్కెట్ విలువ నుండి ఫండ్ ద్వారా వచ్చే అప్పుల మొత్తం విలువను తీసివేసిన తర్వాత వచ్చే సంఖ్యను మొత్తం బాకీ ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సంఖ్యతో భాగించగా వచ్చే సంఖ్యయే ఒక యూనిట్‌కు గల ఎన్ఏవీ(NAV)గా లెక్కించబడుతుంది.

మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువ మారుతుందా?

అవును, ఫండ్ యొక్క అంతర్లీన సెక్యూరిటీల మార్కెట్ విలువలో ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్ (ఎన్ఏవీ(NAV)) విలువ మారవచ్చు. ఉదాహరణకు, ఫండ్ యొక్క అంతర్లీన సెక్యూరిటీల మార్కెట్ విలువ పెరిగితే, ఫండ్ యొక్క ఎన్ఏవీ(NAV) కూడా పెరగవచ్చు మరియు ఎన్ఏవీ(NAV) పెరిగితే, సెక్యూరిటీల మార్కెట్ విలువ పెరగవచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లో నేను కొనుగోలు చేయగల కనీస యూనిట్ల సంఖ్య ఎంత?

మ్యూచువల్ ఫండ్‌లో మీరు కొనుగోలు చేయగల కనీస యూనిట్ల సంఖ్య కనీస పెట్టుబడి పరిమితి మరియు ఫండ్ యొక్క ఎన్ఏవీ(NAV) వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వేర్వేరు ఫండ్‌లు వేర్వేరు పరిమితులను కలిగి ఉంటాయి కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు ఆఫర్ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవడం మంచిది.

మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్ల కొనుగోలు లేదా అమ్మకంతో అనుసంధానించధించబడిన ఫీజులు ఏమైనా ఉన్నాయా?

అవును, మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు లేదా రీడీమ్ చేసినప్పుడు మీకు నిర్దిష్ట ఛార్జీలు విధించబడతాయి. ఖర్చు నిష్పత్తి మరియు లావాదేవీ రుసుములు మీరు యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు విధించబడే అత్యంత సాధారణ రుసుములలో రెండు, అయితే మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను రీడీమ్ చేసినప్పుడు ఎగ్జిట్ లోడ్ మరియు రిడెంప్‌షన్ రుసుములు విధించబడవచ్చు.

మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవీ(NAV) ఎంత తరచుగా లెక్కించబడుతుంది?

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశాల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ యొక్క నికర ఆస్తి విలువ ప్రతి ట్రేడింగ్ రోజు ముగిసిన తర్వాత లెక్కించబడుతుంది మరియు ప్రచురించబడుతుంది