మ్యూచువల్ ఫండ్స్ కోసం SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనే సిద్ధాంతాన్ని గురించి మీకు తెలుసా? స్టాక్ SIP లు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఒకే విధమైన ప్రయోజనాన్ని అందజేస్తాయి, కానీ వీటిలో ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ SIPలు నిపుణులచే నిర్వహించబడే బాస్కెట్ స్టాక్‌లో మీ పెట్టుబడిని వివిధ రకాలుగా పెడతాయి, స్టాక్ SIPలు మీరు పెట్టుబడి పెట్టే వ్యక్తిగత స్టాక్‌లను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది అధిక రాబడిని అందించే అవకాశాన్ని కలిగి ఉంటుంది అయితే ఇందువల్ల అధిక నష్టాలు కూడా ఉండవచ్చును, ఎందుకంటే మీ అదృష్టం నేరుగా మీరు ఎంచుకున్న కంపెనీలతో ముడిపడి ఉంటుంది. ముందుగా తయారుచేసిన కిరాణా సామాగ్రితో నిండి ఉన్న బాస్కెట్ (మ్యూచువల్ ఫండ్ SIP) మరియు ప్రతి వస్తువును ఒక్కొక్క దాన్నీ చేతితో ఎంచుకోవడం (స్టాక్ SIP) వంటి రెండు పద్ధతులను గురించి ఆలోచించండి. రెండు పద్ధతులూ మీ చిన్నగదిని నింపడానికి మీకు ఉపయోగపడతాయి, కానీ స్టాక్ SIPతో, మీ మెనూని మీరే రూపొందింకునే చెఫ్ వంటి వారు అవుతారు.
స్టాక్ SIP vs మ్యూచువల్ ఫండ్ SIP మధ్య ఎంచుకోవడం
మ్యూచువల్ ఫండ్ SIPలు మరియు స్టాక్ SIPలు రూపాయి ధర యొక్క సగటు విలువ యొక్క ప్రయోజనాన్ని పంచుకున్నప్పటికీ, పెట్టుబడి విధానం, రిస్క్ ప్రొఫైల్ మరియు నిర్వహణ పరంగా అవి ఒక దానికొకటి భిన్నంగా ఉంటాయి. మీకు ఏ మార్గం బాగా సరిపోతుందో నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడటానికి ఈ కింది వివరణను చూడండి:
ఫీచర్ | స్టాక్ SIP | మ్యూచువల్ ఫండ్ SIP |
పెట్టుబడి రకం | పెట్టుబడిదారు ఎంచుకున్న వ్యక్తిగత స్టాక్‌లు | నిపుణులచే నిర్వహించబడే స్టాక్‌ల యొక్క డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో |
నియంత్రణ మరియు ఫ్లెక్సిబిలిటీ | ఎక్కువ – మీరు నిర్దిష్ట స్టాక్‌లను ఎంచుకుని, నిర్వహిస్తారు | ఫండ్ మేనేజర్ హోల్డింగ్‌లను ఎంచుకుని, నిర్వహిస్తారు |
రిస్క్ ప్రొఫైల్ | ఎక్కువ – ఎంచుకున్న స్టాక్‌ల పనితీరుతో నేరుగా ముడిపడి ఉంటుంది | తక్కువ – వ్యక్తిగత స్టాక్ పనితీరు నుండి ప్రమాదాన్ని తగ్గించడంలో డైవర్సిఫికేషన్ సహాయపడుతుంది |
నాలెడ్జ్ మరియు రీసెర్చ్ | స్టాక్ అనాలిసిస్ యొక్క లోతైన జ్ఞానం అవసరం | పరిశోధన చేయవలసిన అవసరం తక్కువ, కానీ మార్కెట్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది |
నిర్వహణ | స్వీయ-నిర్వహణ –
మీరే అన్ని పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటారు |
వృత్తిపరంగా నిర్వహించబడే – ఫండ్ మేనేజర్లు పరిశోధన, ఎంపిక మరియు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్‌ను నిర్వహిస్తారు |
కనీస పెట్టుబడి | స్టాక్ ధరపై ఆధారపడి మారుతూ ఉంటుంది | సాధారణంగా తక్కువ కనీస పెట్టుబడి మొత్తాలు |
రాబడులకు గల అవకాశం | ఎంపిక చేసిన స్టాక్‌లు బాగా పనిచేస్తే, రాబడులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది | రాబడులు తగ్గే అవకాశం ఉంటుంది, కానీ సాధారణంగా స్థిరంగానే ఉంటాయి |
అనుకూలత | అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు పరిశోధన మరియు రిస్క్‌తో సౌకర్యవంతంగా ఉంటారు | కొత్త పెట్టుబడిదారులు లేదా సమతుల్యమైన నిర్వహణా విధానాన్ని కోరుకునేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది |
మీ పొదుపు (సేవింగ్స్) ఎలా వృద్ధి చెందుతాయో చూడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజే మా SIP కాలిక్యులేటర్‌ని ప్రయత్నించండి మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి. మీ ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. ఇప్పుడే ప్రారంబించండి!
మీ కోసం సరైన SIPని ఏ విధంగా ఎంచుకోవాలి
మీకు ఏ SIP ఉత్తమమో నిర్ణయించుకోవడానికి ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి:
- రిస్క్‌ను తట్టుకోగల స్థాయి: మీకు రిస్క్‌ను తట్టుకోగల స్థాయి అధికంగా ఉంటే మరియు మీ పోర్ట్‌ఫోలియోను చురుకుగా నిర్వహించడం మీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నట్లయితే, అందుకు స్టాక్ SIP ఒక మంచి ఎంపిక కావచ్చు. అయినప్పటికీ, లోతైన పరిశోధనతో పాటు నష్టాలు సంభవించే పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండండి
- పెట్టుబడిని గురించిన పరిజ్ఞానం: స్టాక్ SIPలకు స్టాక్‌ను గురించిన విశ్లేషణ మరియు మార్కెట్ ప్రవర్తనపై బలమైన అవగాహన అవసరం ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి కొత్తవారైతే లేదా విస్తృతమైన పరిశోధన కోసం సమయం లేకుంటే, మ్యూచువల్ ఫండ్ SIP మీకు మరింత లభ్యతలో ఉండేలా చేయగల ఎంట్రీ పాయింట్‌ను అందజేస్తుంది.
- సమయ నిబద్ధత: స్టాక్ SIPలు పరిశోధన మరియు పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ SIPలు పెట్టుబడి నిర్ణయాలను నిపుణులు నిర్వహించడం వలన మీకు ఖాళీ సమయం అందుబాటులో ఉంటుంది.
- పెట్టుబడి యొక్క లక్ష్యాలు: మీ దీర్ఘకాలిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మీరు అధిక రాబడికి గల అవకాశాన్ని కోరుకుంటూ యాక్టివ్ మేనేజ్‌మెంట్‌తో సౌకర్యవంతంగా ఉంటే, స్టాక్ SIP మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగానికి అనుకూలంగా ఉంటుంది (మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉండే డైవర్సిఫికేషన్‌తో పాటుగా). అయితే, మరింత బ్యాలెన్స్‌డ్ మరియు హ్యాండ్స్-ఆఫ్ విధానం కోసం, మ్యూచువల్ ఫండ్ SIP తరచుగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన పోర్ట్‌ఫోలియోకు డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. స్టాక్ SIPలు అధిక రాబడికి గల అవకాశాన్ని అందిస్తున్నప్పటికీ, అవి వాటితో పాటుగా అధిక నష్టాన్ని కూడా కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ SIPలు మరింత సమతుల్యమైన మరియు వృత్తినైపుణ్యంతో నిర్వహించబడే విధానాన్ని అందిస్తాయి కానీ తక్కువ రాబడిని అందిస్తాయి.
ఆఖరిగా, ఉత్తమమైన ఎంపిక అనేది మీ వ్యక్తిగత పరిస్థితులు, రిస్క్‌ను తట్టుకునే స్థాయి మరియు పెట్టుబడి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
స్టాక్ SIP కి గల పరిమితులు
- రిస్క్ ఎక్కువ: మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, స్టాక్ SIPలు మిమ్మల్ని ఎక్కువ రిస్క్‌కి గురి చేస్తాయి. కంపెనీ పనితీరు, ఆర్థిక పరిణామాలు మరియు విస్తృతంగా ఉండే మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి వివిధ అంశాలకు స్టాక్ ధరలు సున్నితంగా ఉంటాయి. మీరు ఎంచుకున్న స్టాక్‌ల పనితీరు తక్కువగా ఉంటే ఇవి గణనీయమైన నష్టాలకు దారి తీస్తాయి.
- పూర్తి పరిజ్ఞానం లేకపోవడం: స్టాక్ SIPలతో విజయవంతంగా ప్రయాణం చేయడానికి లోతైన పరిశోధన మరియు విశ్లేషణ అవసరం. మీరు కంపెనీ ఫండమెంటల్స్‌ని అర్థం చేసుకోవాలి, ఆర్థిక నివేదికలను విశ్లేషించాలి, మార్కెట్ ట్రెండ్‌లపై అప్‌డేట్‌గా ఉండాలి మరియు ఇండస్ట్రీ డైనమిక్‌లను గ్రహించాలి. కొత్త పెట్టుబడిదారులకు ఇది కష్టమైన విషయంగా ఉండి పేలవమైన పెట్టుబడి నిర్ణయాలకు దారితీయవచ్చు.
- సమయ నిబద్ధత: స్టాక్ SIP లు ఒక సారి “సెట్ చేసి మరచిపో” వంటి వ్యూహాలు కాదు. వాటికి నిరంతర పర్యవేక్షణ మరియు సర్దుబాట్లు అవసరం అవుతాయి. మార్కెట్ కదలికలు, ఆర్థిక వార్తలు మరియు కంపెనీ అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్థాయిలో పరిశీస్తూ ఉండడానికి సమయం కావలసి ఉంటుంది మరియు ఇది ఒత్తిడితో కూడుకున్న పని, ప్రత్యేకించి తమ ప్రమేయం లేని పెట్టుబడి విధానాన్ని కోరుకునే వారికి.
మ్యూచువల్ ఫండ్ SIPకి గల పరిమితులు
- రాబడులకు తక్కువ అవకాశం: మ్యూచువల్ ఫండ్స్‌లో డైవర్సిఫికేషన్ అనేది ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది వ్యక్తిగత స్టాక్‌లతో సాధ్యమయ్యే రాబడుల విస్ఫోటన అవకాశాన్ని కూడా పరిమితం చేస్తుంది. బాగా ఎంచుకున్న స్టాక్ SIP మ్యూచువల్ ఫండ్‌ను అధిగమించగలదు, అయితే ఇది చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకుని ఉంటుంది.
- నిర్వహణ కొరకు రుసుములు: మ్యూచువల్ ఫండ్‌లు వృత్తిపరమైన నిర్వహణను కలిగి ఉంటాయి, వీటికి రుసుములు ఉంటాయి. మీరు అటువంటి రుసుములను చెల్లించనవసరం లేని స్టాక్ SIPతో పోలిస్తే ఈ రుసుములు మీ మొత్తం రాబడిని తగ్గిపోయేలా ప్రభావితం చేస్స్తాయి (బ్రోకరేజ్ ఖర్చులు వర్తిస్తున్నప్పటికీ).
- పరిమిత నియంత్రణ: మ్యూచువల్ ఫండ్‌లతో, మీ డబ్బు పెట్టుబడి పెట్టబడిన నిర్దిష్ట కంపెనీలపై మీకు ప్రత్యక్ష నియంత్రణ ఉండదు. ఫండ్ మేనేజర్ తన వ్యూహం ఆధారంగా ఆ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఖచ్చితమైన కంపెనీలను ఎంచుకోవడానికి స్టాక్ SIPలు మిమ్మల్ని అనుమతిస్తాయి.
- పైకి కనపడని ఖర్చులు: కొన్ని మ్యూచువల్ ఫండ్‌లు నిర్వహణ ఖర్చులకు సంబంధించిన వ్యయ నిష్పత్తులు వంటి నిర్వహణ రుసుములకు మించిన పైకి కనపడని ఖర్చులను కలిగి ఉంటాయి. స్టాక్ SIPలకు బ్రోకరేజ్ ఫీజులు ప్రాథమిక వ్యయంగా ఉంటూ, ఖర్చుల పరంగా ఇవి మరింత పారదర్శకంగా ఉంటాయి.
ఆఖరిగా చెప్పుకోవలసిన విషయాలు
మ్యూచువల్ ఫండ్ SIPలు మరియు స్టాక్ SIPల మధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీటిలో ఒకదాన్ని ఎంచుకోండి. మీరు స్టాక్ మార్కెట్‌కి కొత్తవారైతే, ఏంజెల్ వన్‌తో ఉచిత డీమ్యాట్ ఖాతాను తెరవండి, ఇక్కడ మీరు స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPలలో సజావుగా పెట్టుబడి పెట్టవచ్చు.
FAQs
స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPల మధ్యన ఉండే ప్రధాన తేడా ఏమిటి?
స్టాక్ SIP నిర్దిష్ట స్టాక్‌లను క్రమం తప్పకుండా కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మ్యూచువల్ ఫండ్ SIP మీ డబ్బును విభిన్నమైన స్టాక్‌లలో లేదా నిపుణులచే నిర్వహించబడే రుణంలో పెట్టుబడి పెడుతుంది.
స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPల మధ్య ఏది ప్రమాదకరం?
ఒకే కంపెనీ పనితీరు మీ రాబడిపైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి SIPలుఅధిక రిస్క్‌ను కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్‌లు కంపెనీలన్నిటికీ తమ రిస్క్‌ను వ్యాప్తి చేయడం వల్ల మరింత స్థిరత్వాన్ని అందిస్తాయి.
స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPల మధ్య అధిక రాబడిని ఏది అందిస్తుంది?
మీరు విజయవంతంగా ఉండే స్టాక్‌లను ఎంచుకుంటే SIPలు పెద్ద లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ అవి పెద్ద నష్టాలకు కూడా దారితీస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిమితమైన, స్థిరమైన వృద్ధిని అందిస్తాయి.
స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPలలో ఎంత కృషి చేయవలసి ఉంటుంది?
స్టాక్ SIPలకు స్టాక్‌లను ఎంచుకోవడానికి మరియు వాటి పనితీరును పర్యవేక్షించడానికి పరిశోధన అవసరం. మ్యూచువల్ ఫండ్స్ మీ లక్ష్యాలు మరియు రిస్క్‌ని తట్టుకోగల స్థాయి ఆధారంగా ఒక ఫండ్‌ను ఎంచుకుంటాయి.
స్టాక్ SIPలు మరియు మ్యూచువల్ ఫండ్ SIPలు ఎవరికి బాగా సరిపోతాయి?
స్టాక్ మార్కెట్ పరిశోధన మరియు అస్థిరతతో సౌకర్యవంతంగా ఉండే అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు స్టాక్ SIPలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్‌లు ప్రారంభకులకు లేదా విభిన్నత మరియు వృత్తిపరమైన నిర్వహణను కోరుకునే వారికి అనువైనవి.