సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) vs మ్యూచువల్ ఫండ్స్

SGBలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక సురక్షితమైన మార్గాన్ని అందజేస్తాయి, అయితే మ్యూచువల్ ఫండ్‌లు అధిక రాబడి కోసం వివిధ ఆస్తులలో విభిన్న పెట్టుబడులను పెట్టే అవకాశాలను అందజేస్తాయి. SGB ​​vs మ్యూచువల్ ఫండ్‌ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను అర్ధం చేసుకోండి

చాలా మంది భారతీయుల హృదయాలలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఆస్తిగా మాత్రమే కాకుండా, ముఖ్యమైన సందర్భాలలో ప్రియమైనవారికి ఇవ్వడానికి ఇష్టపడే ఒక మంచి బహుమతిగా కూడా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఇది ఒక ముఖ్యమైన పెట్టుబడి ఎంపికగా విస్తృతంగా పరిగణించబడుతోంది. దీనికి విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందించే సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB లు), బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అందజేస్తున్నాయి. 

అంతే కాకుండా, ఈక్విటీ మరియు డెట్ సెక్యూరిటీల యొక్క డైవర్సిఫైడ్ మిక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఫండ్స్ పూల్ చేసే మ్యూచువల్ ఫండ్ల సౌలభ్యం పెరుగుతోంది. మనము ఈ వ్యాసంలో, పెట్టుబడిని సావరిన్ గోల్డ్ బాండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టడంలో వాటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను పరిశీలిస్తాము.

సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBలు) అంటే ఏమిటి?

SGB లు అనేవి గ్రామ్‌లలో కొలవబడే బంగారంలో పెట్టే ప్రభుత్వ-మద్దతు గల పెట్టుబడులు. వాస్తవానికి ఈ లోహాన్ని తాకకుండానే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవి మిమ్మల్ని అనుమతిస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం యొక్క నిజమైన అవసరాన్ని తగ్గించడానికి మరియు బంగారం విలువ పెరిగే కొద్దీ పెట్టుబడిదారుల సంపాదన పెరిగే అవకాశాన్ని పెంచడానికి వాటిని జారీ చేస్తుంది.

ఇందులో పెట్టుబడిని ఎవరు పెట్టవచ్చును?

స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి తక్కువ-రిస్క్ ఉండే మార్గాన్ని కోరుకునే వారికి మరియు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారికి SGB లు గొప్పగా ఉంటాయి, అయితే బంగారాన్ని భౌతికంగా నిల్వ చేయడం లేదా భద్రపరచడం అనే చింత లేని కారణంగా వీటిని బాగా ఇష్టపడతారు. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి లేదా మరింత డైవర్సిఫైడ్ మిక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి బంగారాన్ని జోడించాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి? అనే విషయాన్ని గురించి మరింత చదవండి

ఫీచర్లు మరియు ప్రయోజనాలు:

  • రాబడులు: పెట్టుబడిదారులు బంగారం ధర పెరుగుదలకు అవకాశం ఉండే మూలధన విలువతో పాటు, సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీ రేటును పొందుతారు.
  • పన్ను: మెచ్యూరిటీ సమయం వరకు బాండ్‌ని ఉంచినట్లయితే మూలధన లాభాల పన్ను విధించబడదు. పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం మాత్రమే వడ్డీపై ఆదాయం పన్ను విధించబడుతుంది.
  • కాలఅవధి: బాండ్‌లకు 8 సంవత్సరాల కాలఅవధి ఉంటుంది, వడ్డీ చెల్లింపు తేదీలలో 5వ సంవత్సరం నుండి నిష్క్రమించే అవకాశం ఉంటుంది.
  • పెట్టుబడి: SGB లలో కనీస పెట్టుబడి ఒక గ్రాము బంగారం, ఇది విస్తృత శ్రేణి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

షేర్లు, బాండ్లు మరియు ఇతర సెక్యూరిటీల వంటి ఆస్తుల మిశ్రమ ఎంపికలో పెట్టుబడి పెట్టడానికి అనేక మంది పెట్టుబడిదారుల నుండి ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్స్ సేకరిస్తాయి. నిపుణులైన మేనేజర్ల మార్గదర్శకత్వంతో పెట్టుబడిదారులకు అనేక రకాల పెట్టుబడి ఎంపికలను యాక్సెస్ చేయడానికి ఈ పద్ధతి ఒక సరళమైన మార్గాన్ని అందిస్తుంది.

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి అనే దాని గురించి మరింత తెలుసుకోండి?

ఇందులో పెట్టుబడిని ఎవరు పెట్టవచ్చు?

మీరు ఇప్పుడే కొత్తగా ప్రారంభించిన వారైనా లేక మీరు పెట్టుబడి పెట్టడంలో అనుభవం పుష్కలంగా ఉన్న వారైనా, మ్యూచువల్ ఫండ్స్ అనేది వివిధ రకాల పెట్టుబడిదారులకు ఒక మంచి ఎంపిక. అవి విభిన్న ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌లు మరియు పెట్టుబడి కాల అవధులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. మీరు సాధారణ పొదుపు ఖాతా నుండి పొందే దానితో పోలిస్తే అధిక ఆదాయాలను లక్ష్యంగా చేసుకుంటూ కూడా కొంత పెట్టుబడికి రిస్క్ తీసుకోవడం మీకు సరైనదే అయితే, మ్యూచువల్ ఫండ్‌లు మీకు ఒక గొప్ప ఎంపిక.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు:

  • డైవర్సిఫికేషన్: మ్యూచువల్ ఫండ్‌లు వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెడతాయి, ఇది రిస్క్‌ని విస్తరించడంలో సహాయపడుతుంది.
  • ఫ్లెక్సిబిలిటీ: పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్ ఆధారంగా అనేక రకాల ఫండ్ ఆప్షన్‌ల నుండి ఎంచుకోవచ్చు. జీరో కమీషన్‌తో ఏంజెల్ వన్‌తో 4000+ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.
  • లిక్విడిటీ: మ్యూచువల్ ఫండ్‌ల షేర్లను సాధారణంగా ఫండ్ యొక్క ప్రస్తుత నికర ఆస్తి విలువ (NAV) తో పాటు కొనుగోలు లేదా రిడెంప్షన్ సమయంలో ఫండ్ విధించే ఏవైనా రుసుములతో కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.
  • నిర్వహణ: ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్‌లు సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాన్ని నిర్వహిస్తారు, ఇది పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులను నిర్వహించడానికి తగిన సమయం లేదా తగిన నైపుణ్యం లేని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

SGB vs మ్యూచువల్ ఫండ్స్

ఫీచర్ సావరిన్ గోల్డ్ బాండ్ SGB మ్యూచువల్ ఫండ్
స్వభావం ప్రభుత్వ సెక్యూరిటీలు బంగారంలో సూచించబడతాయి. స్టాక్‌లు, బాండ్‌లు లేదా ఇతర సెక్యూరిటీల వంటి విభిన్న ఆస్తులలో పూల్ చేయబడిన పెట్టుబడులు.
పెట్టుబడి రకం బంగారం-ఆధారిత, ప్రతి యూనిట్ నిర్దిష్ట పరిమాణంలో బంగారాన్ని సూచిస్తుంది వివిధ – ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్స్ మొదలైనవి.
రిస్క్ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించిన రిస్క్ తక్కువ. రిస్క్ ప్రధానంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు సంబంధించినదిగా ఉంటుంది. ఫండ్ రకం (ఈక్విటీ, డెట్, హైబ్రిడ్) మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తక్కువ నుండి ఎక్కువ వరకు మారుతూ ఉంటుంది.
రాబడులు స్థిర వడ్డీ (2.5% వార్షికంగా) మరియు బంగారం ధర పెరుగుదల అవకాశాన్ని అందిస్తుంది. మార్కెట్ పనితీరు మరియు ఫండ్ మేనేజ్‌మెంట్ ఆధారంగా మారుతూ ఉంటుంది. స్థిరమైన రాబడి ఉండదు.
లిక్విడిటీ 5 సంవత్సరాల తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిక్విడిటీని ట్రేడ్ చేసుకోవచ్చు; అంతకంటే ముందు అయితే లిక్విడిటీ పరిమితంగా ఉంటుంది. అధిక లిక్విడిటీ, షేర్లను ఏదైనా వ్యాపార దినం రోజున కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు (ఆ తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో నిష్క్రమించే ఎంపికతో); 8 సంవత్సరాల మెచ్యూరిటీ. లాక్-ఇన్ అవధి లేదు (3-సంవత్సరాల లాక్-ఇన్ ఉన్న ELSS ఫండ్‌లు మినహా).
పన్ను మెచ్యూరిటీ వరకు కలిగి ఉంటే మూలధన లాభాల పన్ను లేదు; వడ్డీ పన్ను విధించబడుతుంది. మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది; ఈక్విటీ మరియు డెట్ ఫండ్ల మధ్య పన్ను విధానం మారుతూ ఉంటుంది.
కనీస పెట్టుబడి సాధారణంగా, ఒక గ్రాము బంగారం. మారుతూ ఉంటుంది; SIP లకు రూ. 500 నుండి ప్రారంభించవచ్చు.
అనుకూలత భద్రత మరియు వడ్డీ ఆదాయంతో ద్రవ్యోల్బణం నుండి రక్షణ కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలం. ఫండ్ రకాన్ని బట్టి సంప్రదాయవాదం నుండి దూకుడుగా ఉండే విస్తృత శ్రేణి పెట్టుబడిదారుల వరకు అందరికీ అనుకూలం.
నిర్వహణ ప్రభుత్వంచే జారీ చేయబడి, RBI చే నిర్వహించబడుతుంది. వివిధ ఆస్తులలో నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్‌లచే ప్రొఫెషనల్‌గా నిర్వహించబడుతుంది.

ముగింపు!

భారతదేశంలో బంగారం ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది, ఇది ఒక విలువైన ఆస్తిగానే కాకుండా దానికి గల సాంస్కృతిక ప్రాముఖ్యత వల్ల కూడా గౌరవించబడుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌లు SGB లు భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకునేందుకు తెలివైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి, భౌతికంగా మన దగ్గర పెట్టుకున్నప్పుడు కలిగే సమస్యలేవీ లేకుండా కేవలం దాని విలువను మాత్రమే సంగ్రహిస్తుంది.

దీనికి విరుద్ధంగా, మ్యూచువల్ ఫండ్స్ బహుముఖ పెట్టుబడికి మార్గాన్ని అందజేస్తాయి. ఏ ఒక్క పెట్టుబడి ఎంపిక కూడా అందరికీ పూర్తిగా సరిపోదని గుర్తించడం చాలా అవసరం. వ్యక్తిగత ఆస్తి పనితీరుతో సంబంధం లేకుండా మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా ఆస్తిని వివిధ తరగతుల్లో వైవిధ్యభరితమైన స్థిరమైన పెట్టుబడిగా పెట్టే వ్యూహానికి ఇది కీలకం. SGB లు మరియు మ్యూచువల్ ఫండ్స్‌తో సహా సరైన పెట్టుబడుల మిశ్రమాన్ని ఎంచుకోవడాన్ని, మీరు స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ప్లాన్ చేస్తుంటే, వాటిని మీ ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్‌తో సమలేఖనం చేయాలి.

SGB లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజే ఏంజెల్ వన్‌తో మీ డీమ్యాట్ ఖాతాను తెరవండి మరియు మీ ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా విభిన్నమైన మరియు వ్యూహాత్మక పెట్టుబడుల వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.

FAQs

సావరిన్ గోల్డ్ బాండ్‌లు వర్సెస్ మ్యూచువల్ ఫండ్‌ల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB లు) అనేవి బంగారం ధరలను ప్రతిబింబించే ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు, పరోక్షంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గాన్ని అందజేస్తాయి. మ్యూచువల్ ఫండ్‌లు స్టాక్‌లు మరియు బాండ్‌ల వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారుల నుండి డబ్బును సమీకరిస్తాయి, డైవర్సిఫికేషన్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి.

ఏది మంచిది: SGB లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్?

ఎంపిక మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు మరియు మీ రిస్క్ టాలరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది, అయితే మ్యూచువల్ ఫండ్స్‌చే నిర్వహించబడే పెట్టుబడుల ద్వారా అధిక రాబడికి అవకాశాన్ని అందస్తాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా?

వడ్డీ ఆదాయం మరియు పన్ను ప్రయోజనాలను అందజేస్తూ బంగారంపై ఆసక్తి ఉన్నవారికి SGB లు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత పెట్టుబడి లక్ష్యాలు మరియు వ్యూహాల ఆధారంగా వాటి అనుకూలత మారుతూ ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ కంటే బాండ్లు ప్రమాదకరమా?

బాండ్ మరియు మ్యూచువల్ ఫండ్ రకాన్ని బట్టి రిస్క్ మారుతూ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే SGB ల వంటి ప్రభుత్వ బాండ్‌లు సాధారణంగా తక్కువ రిస్క్‌ని కలిగి ఉంటాయి. కార్పొరేట్ బాండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్‌ల ప్రమాద స్థాయిలు వాటి నిర్దిష్ట ఆస్తులపై ఆధారపడి ఉంటాయి.

సెక్షన్ 80C కింద సావరిన్ గోల్డ్ బాండ్లను క్లెయిమ్ చేయవచ్చా?

లేదు, SGB లు సెక్షన్ 80C తగ్గింపులకు అర్హత పొందవు. అయినప్పటికీ, వారు మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాలపై పన్ను మినహాయింపును పొందుతారు.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు మితమైన రిస్క్ టాలరెన్స్‌తో పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ను కోరుకునే వారికి, భౌతికంగా యాజమాన్యం లేకుండానే బంగారానికి చేరువ కావడానికి ఇష్టపడే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.