List of upcoming NFOs in India

Podcast Duration: 6:04
ఇండియాలో రాబోతున్న ఎన్ఎఫ్ఓలు ఏవి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​NFO లు ఇన్వెస్టర్లకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వీటిద్వారా ఇన్వెస్టర్లు చాలా తక్కువ ధరకే స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. ఎలాగంటే ఒక కొత్త వ్యక్తి ఆఫీసులో జాయిన్ అయినట్లుగా. కంగారు పడకండి, నేను మీకు వివరంగా చెప్తాను. NFO అంటే ఒక కొత్త ఫండ్ ఆఫరింగ్ అని అర్థం. ఇది స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయినపుడు ఇది మీకు అందుబాటులో ఉంటుంది. ఒక నిర్ణీత కాలం దాకా దీని ఆఫర్ ప్రైస్ నిర్ణయించబడి ఉంటుంది. ఇన్వెస్టర్లు ఈ ఆఫర్ పీరియడ్ లో నిర్ణీత ధరకే యూనిట్లను కొనుగోలు చెయ్యవచ్చు. ఆఫర్ పీరియడ్ ముగిసిన తర్వాత స్టాక్ మార్కెట్ ను అనుసరించి ఈ యూనిట్ల ధర రోజువారీగా హెచ్చుతగ్గులకు గురికావడం మొదలవుతుంది. కొత్తగా అఫ్ఫీసులో చేరిన వ్యక్తిని మొదట్లోనే మనకు అనుగుణంగా మార్చుకోవడం సులభం, అతను వేరే గ్రూపులో చేరేక అది కొంచెం కష్టం అవుతుంది కదా, అలాగన్నమాట. కొత్తగా చేరినపుడు వారితో స్నేహం చేయడం సులభం, కాస్త సమయం గడిచాక అతను మనతో కలిసి పనిచేస్తాడు కానీ, అంతా క్లోజ్ గా మసలుకోవడం ఉండదు. అతను మనతో స్నేహంగా ఉండడానికి తగిన వాడా కాదా అన్నది తర్వాతి విషయం. ఈ విషయం గురించి తర్వాత చర్చించుకుందాం. NFOల పట్ల మన ఆసక్తి విషయంలో కూడా ఇదే రకమైన లాజిక్ వర్తిస్తుంది. ఇన్వెస్టర్లు NFOలలో ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపడానికి కారణం అవి తమకు ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తాయనే ఆలోచన. NFOలలో ఇన్వెస్ట్ చేయడానికి మరో కారణం అన్ రీజనబుల్లీ హై మార్కెట్ సిచుయేషన్. ఇటువంటి సిచుయేషన్ లో ఎంట్రీ ప్రైస్ చాలా అధికంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగానే ఉంటారు కానీ, అంత అధిక ధరల దగ్గర మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే రిస్క్ తీసుకోవడం వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే, భవిష్యత్తులో ప్రైస్ కరెక్షన్ ఉంటుందేమో అనే భయం. అటువంటి పరిస్థితుల్లో ఒక నిశ్చితమైన, ఆకర్షణీయమైన, తక్కువ ధరకు NFOలు లభ్యం కావడం అన్నది ఇన్వెస్టర్లను అటువైపుకు సహజంగానే ఆకర్షిస్తుంది. సరే, అదలా ఉంచితే ఇప్పుడు మనం ఈ ప్రోడ్ క్యాస్ట్ రాసే సమయానికి 2021 ఏప్రిల్ నెలలో రాబోయే NFOల గురించి మాట్లాడుకుందాం. NFOలకు సంబంధించిన సమాచారం అవి విడుదల చేయబోయే తేదీకి అతి దగ్గరలోనే విడుదల చెయ్యడం జరుగుతుంది. అయితే, వచ్చే నెలలో నవీకరణల కోసం ఈ స్పేస్ ని మరోసారి చూడండి. ప్రస్తుతానికి మనం 2021 ఏప్రిల్ లో విడుదల కాబోయే మ్యూచువల్ ఫండ్స్ యొక్క NFOలను చూద్దాం. ICICI ప్రుడెన్షిఅల్ , ఆదిత్య బిర్లా, SBI, నిప్పాన్ ఇండియా సంస్థలు ఈ మధ్యనే తమ NFOలను క్లోజ్ చెయ్యడం జరిగింది, అయితే వీటి ఆఫర్ ధర 10 రూపాయలు, కనిష్ట సబ్స్క్రిప్షన్ మొత్తం 1000 యూనిట్లు. పోతే, ప్రస్తుతం ఇంకా ఓపన్ లో ఉన్న కొన్ని NFOల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మనం ప్రధానమైన వివరాలలోకి వెళ్దాం: ​ ● మొదటి ఆప్షన్ మైరే అసెట్ NYSE FANG +ETF FoF డైరెక్ట్ గ్రోత్; దీని ప్రారంభ తేదీ ఏప్రిల్ 19, ముగింపు తేదీ మే 3. ​● ఇక రెండవ ఆప్షన్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మల్టీ కాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్; దీని ప్రారంభ తేదీ ఏప్రిల్ 19, ముగింపు తేదీ మే 2 ​ ● మూడవ ఆప్షన్ ITI షార్ట్ డ్యూరేషన్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ దీని ప్రారంభ తేదీ కూడా ఏప్రిల్ 19, ముగింపు తేదీ మే 2 ​● ఇక నాల్గవ ఆప్షన్ క్వాంటమెంటల్ ఫండ్ దీని ప్రారంభ తేదీ ఏప్రిల్ 13, ఇది ఏప్రిల్ 19 నాటికే ముగియవలసి ఉండగా ముగింపు తేదీ ఏప్రిల్ 27 వరకు పొడిగించడం జరిగింది. అయితే IPOs లాగా NFOs లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే వీటి పాస్ట్ రికార్డ్స్ మనకు లభ్యం కావు. ఎందుకంటే, కొత్త ఫండ్ కు ఎటువంటి ట్రాక్ రికార్డ్ ఉండదు. కాకపోతే ఆ ఫండ్ హౌస్ యొక్క రేపుటేషన్ ను బట్టి మీరు దాని సంభావ్యతను బేరీజు వేయవచ్చు. అయినప్పటికీ అది చాలా రిస్క్ తో కూడుకున్న పనే అవుతుంది. ​ ​మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే మీరు లోరిస్క్ మ్యూచువల్ ఫండ్స్ వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం మంచిది. మీరు SIP ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఒకేసారి పెట్టుబడి పెద్దడం కంటే మొంతవరకు రిస్క్ తగ్గుంచుకునే అవకాశం ఉంటుంది. ​ఈ ప్రోడ్ క్యాస్ట్ ప్రారంభంలో జనం కొత్త మిత్రుడితో ఎలా మెలగాలో NFOలను అలా కొనుగోలు చేస్తారు అన్నవిషయాన్ని గురించి చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ కొత్త వ్యక్తి తో స్నేహం చెయ్యడం తమకు అంతగా ఉపయోగపడుతుందా? అది తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను కొంతకాలం పాటు గమనించాలి, ఔనా? అదేవిధంగా, కొత్త ఫండ్ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి ముందు దాని పనితీరును గమనించవలసి ఉంటుంది.; లేదా ఆ ఫండ్ మార్కెట్ లో నిలదొక్కుకునే వరకు కొంతకాలం వేచి చూడడం మంచిది. మరో విషయం NFO మార్కెట్ లోకి వచ్చేక ఆ ఫండ్ యొక్క మార్కెట్ విలువ ఆఫర్ ధర కంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక ఫండ్ ను 10 రూపాయలకు కొనుగోలు చేశారని అనుకుందాం, దాని మార్కెటింగ్ కాస్ట్, ఇతర నిర్వహణ ఖర్చులు పోను దాని NAV వాల్యూ 9 పాయింట్ల దగ్గర పబ్లిష్ అవుతుంది. 10 దగ్గర కాదు. లేదంటే మీరు నెగటివ్ రిటర్న్స్ పొందడం మొదలవుతుంది. మీరు ఈ రిస్క్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే, మెచూరిటీ నాటికి మీ యూనిట్ల NAV వేల్యూ నాటకీయంగా పెరిగే అవకాశం కూడా ఉంది, కానీ మీరు ఎల్లప్పుడు మీరు జాగరూకతతో ఉండాలి. ​ ​ఒకవేళ మీరు ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లయితే, లేదా స్టాక్ మెర్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని అనౌకుంటున్నట్లయితే, మీరు ఆ పని ఏంజిల్ బ్రోకింగ్ ద్వారా చెయ్యవచ్చు కదా? మీరు ఇలాంటి నిజాయితీతో కూడిన మరియు సహాయకరమైన మరిన్ని పాడ్‌ క్యాస్ట్‌ లను కూడా వినవచ్చు, మా సమాచార వీడియోలను చూడవచ్చు. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ చానెల్ చూడండి లేదా www.angelone.in ను సందర్శించండి. మరో ప్రోడ్ క్యాస్ట్ లో కలుసుకుందాం అప్పటివరకూ ఏంజిల్ బ్రోకింగ్ నుండి గుడ్ బై అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్! మ్యూచువల్ ఫండ్ లో పేతుబదులు మార్కెట్ రిస్క్ కు లోపడి ఉంటాయి, కాబట్టి స్కీమ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​. ​